ప్రకృతి ‌వ్యవసాయంలో ఒక విజయగాథ

మట్టిని నమ్ముకున్నవారికి నేలతల్లే తోవ చూపిస్తుంది. ప్రకృతిమాత కరుణ రైతన్నలకు ఎప్పటికైనా తప్పక సిరుల వర్షం కురిపిస్తుంది. వెంకట్ వట్టి విజయగాథ దీనికి ఒక ఉదాహరణ. హైదరాబాద్‌‌కు చెందిన ఆయన మొదట్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆ తర్వాత ఐటీ రంగానికి మారారు. సుమారు పదహారేళ్లు విదేశాల్లో...

ఇది ఒక ఆర్గానిక్ సూపర్ స్టోర్

ఆర్గానిక్ పంటలు, దినుసులు, పదార్థాల పట్ల ఇప్పుడు దేశంలో మక్కువ పెరుగుతోంది. ఆర్గానిక్ సాగు వల్ల పండే పంటలతో తయారయ్యే పదార్థాలు రుచికరంగా ఉండి ఆరోగ్యకరం కావడమే ఇందుకు కారణం. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. అయితే అసలు సమస్య ఏమిటంటే మార్కెట్‌లో ఆర్గానిక్ పేరుతో...

ఆర్గానిక్‌ పద్ధతిలో మల్లెపూల సాగు

చక్కని పరిమళాలు వెదజల్లే మల్లెపువ్వులను అనేక సుగంధ సాధనాల తయారీలో వినియోగిస్తారు. సబ్బులు, హెయిర్ ఆయిల్స్‌, సౌందర్య సాధనాలు, అగరుబత్తీల తయారీలో మల్లెపూల వినియోగం బాగా ఉంటుంది. సెంట్లు, పర్‌ ఫ్యూమ్‌ లలో మల్లెపూలను ఎక్కువగా వినియోగిస్తారు. సువాసనలు గుభాళించే మల్లెపూలు పక్కన పెట్టుకుని పడుకుంటే వాటి...

ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ వేదిక

ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులలో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. రసాయన ఎరువుల వినియోగం వల్ల పెరిగిన ఆర్థిక భారంతో సతమతమౌతున్న అన్నదాతలు క్రమంగా సేంద్రియ సేద్యంవైపు మరలుతున్నారు. అయితే పండించిన ధాన్యాన్ని, దినుసులను ఎలా విక్రయించాలన్నదే పెద్ద ప్రశ్న. సేంద్రియ పద్ధతుల్లో పండించే పంటలకు వినియోగదారులలో కూడా...

ఆర్గానిక్ సాగులో సూపర్ స్టార్

భారతీయ చలనచిత్రరంగంలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సూపర్ స్టార్ మమ్ముట్టి. ప్రత్యేకించి ఆయన దక్షిణాదిన వందలాది మలయాళం, కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంపై 'యాత్ర' టైటిల్‌తో తీసిన బయోపిక్‌లో ఆయన నటించి మెప్పించారు. సినీరంగంలో తన విశేష కృషికిగాను...

ఒకసారి నాటితే పదిహేనేళ్ల ఆదాయం

‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అనేది పాతకాలపు సామెత. అయితే.. కరివేపాకును అలా తీసిపారేయలేం అంటున్నారు రైతులు. ముఖ్యంగా కూరలు, ఇతర వంటకాల పోపుల్లో వాడే కరివేపాకు వినియోగం ఈ ఆధునిక కాలంలో బాగా పెరిగింది. కరివేపాకును పొడిగా చేసుకుని డబ్బాల్లో నిల్వ ఉంచుకుని వేడి వేడి అన్నంలో...

సహజ పద్ధతిలో మిరప రక్షణ

మిర్చి.. ప్రతి నిత్యం.. అన్ని ఇళ్లలో ఆహార పదార్థాల్లో వినియోగించే అతి ముఖ్యమైన పంట. రోజూ కొన్ని వేల టన్నుల మిర్చి ఆహారపదార్థాల తయారీకి అవసరం అవుతుంది. అలాంటి ముఖ్యమైన మిర్చి పంటకు క్రిమి కీటకాలు, తెగుళ్ల బెడద ఎక్కువనే చెప్పాలి. మిర్చి పంట సాగులో సస్యరక్షణ...

వందే గౌ మాతరం!

దేశీ ఆవు పెరుగుతో ఎంత లాభం ఉందో తెలుసా? మరీ ముఖ్యంగా రసాయన ఎరువులు వినియోగించే రైతులకు దేశీ ఆవు పెరుగు ఎంత ప్రయోజనం కలిగిస్తుందో.. మరెంత డబ్బు ఆదా చేసిపెడుతుందో తెలుసా? 50 కిలోల యూరియా కంటే, రెండు కిలోల దేశీ ఆవు పెరుగుతో చేసిన...

సూపర్ బ్రాండ్‌గా మారిన పెళ్లి మిఠాయి

తండ్రి అడుగుజాడల్లో నడవడమే కాదు, తండ్రి సంప్రదాయ వృత్తికి కూడా ప్రాచుర్యం కల్పించి ఒక సూపర్ బ్రాండ్‌నే సృష్టించారు భూపిందర్ సింగ్ బర్గాడీ. ఒక కుమారుడు (భూపిందర్ సింగ్ బర్గాడీ), తన తండ్రి (సుఖ్‌దేవ్ సింగ్ బర్గాడీ) పేరును ఎలా నిలబెట్టారో తెలుసుకోవాలంటే ఈ కథనం ఆసాంతం...

కేంద్ర బడ్జెట్‌లో వ్యవ’సాయం’

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన కేంద్ర వార్షిక బడ్జెట్ 2021-22లో ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించి కొన్ని మౌలిక అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. లీటర్ పెట్రోల్‌పై రూ. 2.50 పైసలు, డీజిల్‌పై రూ. 4...

Follow us

Latest news