మా గురించి…

వి.ఈ.ఆర్ ఆగ్రో ఫామ్స్ (V.E.R Agro Farms) స్థాపనకు స్ఫూర్తి కీ.శే. వర్రే ఈశ్వర రావు గారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లాకు చెందిన ఈశ్వర రావు గారి జీవితం ఆసాంతం భూమితోను, వ్యవసాయంతోను ముడిపడి సాగింది. ఆయన పదహారణాల రైతుబిడ్డ. దాతృత్వంలో చేతికి ఎముక అన్నదే లేని అన్నదాత. నిరంతరం సామాజిక సేవాకార్యక్రమాలతోనే జీవనం గడిపిన ప్రేరణ ప్రదాత.
1953 నవంబర్ 1న పెదకళ్లేపల్లిలో జన్మించిన ఈశ్వర రావుగారి సొంతూరు దివిసీమలోని చిన యాదర. దివిసీమ ఉప్పెన తర్వాత వారి కుటుంబం గుడ్లవల్లేరు మండలంలోని పెసరమిల్లిలో స్థిరపడింది. భూమాతతో ఉన్న పేగుబంధం వల్ల ఈశ్వర రావు గారు వృత్తిపరంగా కడదాకా రైతుగానే కొనసాగారు. అన్ని వేళలా తోటి రైతు సోదరులకు అండగా నిలిచారు. రైతుగా విజయం సాధించారు. వ్యవసాయదారుగా కొనసాగడంలోనే జీవన సాఫల్యం ఉందని ఆయన త్రికరణశుద్ధిగా విశ్వసించారు. ఇందులో భాగంగానే 30 ఏళ్ల కిందట ఈశ్వర రావుగారు గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగులో కొంత భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని మంచి వ్యవసాయక్షేత్రంగా మలచారు. వ్యవసాయ అనుబంధ రంగాలనూ అభివృద్ధి పరచారు. పశుపోషణ అంటే ఈశ్వర రావుగారికి ప్రాణం. మన వ్యవసాయం ప్రకృతితో ముడిపడి సాగాలని ఆయన ఆకాంక్షించారు. ‘జై కిసాన్’ అన్నది ఆయనకెంతో ప్రీతిపాత్రమైన నినాదం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన సేద్యాన్ని వదలలేదు. పొలం పనులు దేశసేవలో భాగమేనని ఆయన భావించారు. మనం చేసే ప్రతిపనీ మనతో పాటు తోటివారికి కూడా ఏదో రకంగా ఉపయోగ పడాలన్నది ఆయన జీవనసూత్రం. 

గోసేవలో శ్రీ పూర్ణ గంగాధర రావు

నేలతల్లిని నమ్మిన అచ్చమైన రైతుబిడ్డగా, పదుగురి బాగు కోరే సామాజిక కార్యకర్తగా సార్థకమైన జీవితం గడిపిన ఈశ్వర రావుగారు 2017 సెప్టెంబర్ 12 న దివంగతులయ్యారు. ఆయన లేని లోటు తీర్చలేనిది.
ఆ తర్వాత కీ.శే. ఈశ్వర రావుగారి చిన్న కుమారుడు శ్రీ వర్రే పూర్ణ గంగాధర రావు తండ్రి ఆశయాల వారసుడిగా, తండ్రి అడుగుజాడల్లో నడవాలని సంకల్పించారు. ఇందులో భాగంగా శ్రీ వర్రే పూర్ణ గంగాధర రావు తండ్రి గారి పేరుతో V.E.R Agro Farms ఏర్పాటు చేశారు. V.E.R అంటే Varre Eswar Rao (వర్రే ఈశ్వర రావు) అని అర్థం.
ఎలక్ట్రానిక్ మీడియాలో సీనియర్ జర్నలిస్టుగా కొనసాగుతూనే మేళ్లవాగు (కారంపూడి) పొలాన్ని ఆయన ఆదర్శ వ్యవసాయక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ జామ, దానిమ్మ వంటి పండ్ల తోటలతో పాటు ఆర్గానిక్ విధానంలో విరివిగా కూరగాయలు సాగుచేస్తున్నారు. అలాగే గిర్, కాంక్రేజ్, ఒంగోలు, పుంగనూరు, దేవని జాతులకు చెందిన దేశీ ఆవులతో ఆయన ఇక్కడ ఒక మంచి గోశాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడి పశువులను ఆయన కన్నబిడ్డలుగానే భావిస్తారు. దేశీ గోజాతుల సంతతిని పెంపొందించి అభివృద్ధి పరచాలని ఆయన ఊనికతో ప్రయత్నిస్తున్నారు.

గోశాలలో శ్రీ వర్రే పూర్ణగంగాధర రావు

గోసేవతో పాటు దేశవాళీ గోవుల ఎరువుతో రైతుల కోసం V.E.R Agro Farms విశిష్ట ఉత్పాదనగా ఆయన Eswar Organic Manureను రైతాంగానికి అందిస్తున్నారు. ఇది సుభాష్ పాలేకర్ గారి ZBNF ప్రకృతి వ్యవసాయ విధానంలో తయారయ్యే ‘ఘన జీవామృతం’. నూటికి నూరు పాళ్లు నాణ్యత, 100% ప్రామాణికత కలిగి ఉన్న ఈ Eswar Organic Manureను ఆయన రైతులకు చౌకగా, సరసమైన ధరకే అందిస్తున్నారు. అనతికాలంలోనే ఈ ఘన జీవామృతం రైతుల విశేష ఆదరణకు పాత్రమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక విశిష్టమైన బ్రాండ్‌గా రూపొందింది.

కీ.శే. వర్రే ఈశ్వర రావు స్మృతివనం

తాతలు, తండ్రుల ఆస్తులకే కాదు, బిడ్డలు వారి ఆదర్శాలకు, ఆశయాలకు కూడా వారసులుగా నిలవాలన్నది శ్రీ వర్రే పూర్ణ గంగాధర రావు భావన. అలా ఆయన సారథ్యంలో కొనసాగుతున్న V.E.R Agro Farms కీ.శే. వర్రే ఈశ్వర రావుగారి ఆశయాల మేరకు.. రైతన్నలకు అండదండలుగా ఉంటూ దినదిన ప్రవర్థమానమవుతోంది.

కీ.శే. వర్రే ఈశ్వర రావు తరచు చెబుతుండే ఈ మాటలు మాకు శిరోధార్యాలు..జీవనసూత్రాలు.

భూమిని నమ్ముకున్నవాడు ఎన్నటికీ చెడిపోడు. 
నేలతల్లితో చెరగని అనుబంధం.. రైతుకు తరగని ఆనందం. 
తోటివారికి తోడుగా నిలవడమే జీవిత పరమార్థం. 
సదాశయాల విత్తనాలతో దేశానికి శ్రేయస్సు కలిగించే విధానాల పంటలు పండుతాయి. 
మట్టిని నమ్ముకుంటేనే మానవాళికి మనుగడ.

– కీ.శే. వర్రే ఈశ్వర రావు

మా చిరునామా:

వి ఈ ఆర్ ఆగ్రో ఫామ్స్, 
మేళ్లవాగు, బొల్లపల్లి మండలం,
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
పిన్ కోడ్ 522614. ఫోన్ 6303311894

VER AGRO FARMS ORGANIC MANURE | వి ఈ ఆర్ ఆగ్రో ఫామ్స్ వారి ఘన జీవామృతం

For Orders Please Contact- V.E.R AGRO FARMS, Ph: 7396394749, 6303311894, Email: infonet@veragrofarms.com.

ఆర్డర్లు కోసం సంప్రదించండి :- వి ఈ ఆర్ ఆగ్రో ఫామ్స్, Ph: 7396394749, 6303311894, Email: infonet@veragrofarms.com.

VER Agro Farms Goushala

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here