భారతదేశంలో ఆర్గానిక్‌ వ్యవసాయ పరిశ్రమకు సంబంధించి ప్రతిష్టాత్మక ‘జైవిక్ ఇండియా అవార్డులు-2019’ మన దేశంలోని ఆరుగురు ఆర్గానిక్ రైతులను వరించాయి. వారు లానువాకుమ్ ఇంచెన్, మనోజ్ కుమార్, కైలాశ్ రామ్ నేతమ్, సచిన్ తనాజీ యవాలే, హనుమంత హలాకీ, మాతోట ట్రైబల్ ఫార్మింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. ఈ రైతులు, మాతోట ట్రైబల్ ఫార్మింగ్ సంస్థ కూడా ఆర్గానిక్ ఫార్మర్స్ గ్రూప్‌కు చెందిందే.

ప్రపంచం మొత్తంలో భారతదేశంలోనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న ఔత్సాహిక రైతులు అత్యధికంగా ఉన్నారు. ఆర్గానిక్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం మనదేశంలో 8,35,000 మంది రైతులు ఆర్గానిక్ విధానంలో ఆహార పంటలు పండిస్తున్నారు. అయితే.. ఇంత మంది ఔత్సాహిక ఆర్గానిక్ ఫార్మింగ్ రైతులు ఉన్నా వారిలో జైవిక్ ఇండియా అవార్డులు 2019 వరించిన ముఖ్యమైన ఆరుగురి గురించి తెలుసుకుందాం. తాము సాగు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయంలో వారు కనబరచిన అత్యుత్తమ ప్రతిభకు గుర్తింపుగా ఈ అవార్డులు అందుకున్నారు.లానువాకమ్ ఇంచెన్ (First prize) ఉత్తర, ఈశాన్య భారతదేశం: నాగాలాండ్‌లోని దిమాపూర్‌కు చెందిన ఇంచెన్ చైతన్యవంతుడైన యువరైతు. తన 24.7 ఎకరాల్లో ఇంచెన్ అల్లం, టీ, పుదీనా, సుగంధ ద్రవ్యాలను పూర్తి ఆర్గానిక్ వ్యవసాయ విధానంలో పండిస్తున్నారు. సంఘటిత వ్యవసాయంలో మిశ్రమ పంటల విధానాన్ని ఇంచెన్ అవలంబిస్తున్నారు. పంటలకు పోషకాలు అందించేందుకు, తెగుళ్ల నివారణ కోసం ఆచ్ఛాదన, బయో గ్యాస్, కంపోస్ట్ ఎరువులు, కుళ్లిన పదార్థాలను వినియోగిస్తారు. ఆర్గానిక్ విధానంలో తాను పండించే పంటలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంటారు ఇంచెమ్. అలాగే అమెరికా, ఇంగ్లండ్, చైనా, మలేసియా దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు.
మనోజ్ కుమార్ (2nd prize) ఉత్తర, ఈశాన్య భారతదేశం: ఆర్గానిక్ వ్యవసాయం చేయడంలో మనోజ్ కుమార్ సుప్రసిద్ధులు. కొత్తగా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకునే వారిని ఎంతో బాగా ప్రోత్సహించే మెంటార్ కూడా. పది ఎకరాల సొంత పొలంలో ఆయన ఆర్గానిక్ వ్యవసాయ విధానంలో పండ్లు, కాయగూరలు, పప్పు ధాన్యాలు పండిస్తుంటారు. సంఘటిత వ్యవసాయ విధానంలో ఆయన మిశ్రమ పంటలు పండిస్తుంటారు. పంటలకు పోషకాలు అందించేందుకు, తెగుళ్ల నివారణ కోసం ఆచ్ఛాదన, బయో గ్యాస్, కంపోస్ట్ ఎరువులు, కుళ్లిన పదార్థాలను వినియోగిస్తారు మనోజ్ కుమార్. తాను పండించే ఆర్గానిక్ పంటలను మనోజ్ కుమార్ నేరుగా ఢిల్లీలోని వినియోగదారులకు, ఆర్గానిక్ ఉత్పత్తుల రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తుంటారు.
కైలాశ్‌రామ్ నేతమ్ (1st prize) మధ్య, పశ్చిమ భారతదేశం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో వర్షపాతం ఉండే కాంకేర్ జిల్లాలో మూడు ఎకరాల్లో కైలాశ్‌రామ్ నేతమ్ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. తన పొలంలో ఆయన ఆర్గానిక్ విధానంలో కూరగాయలు, ధాన్యాలు, పప్పుధాన్యాలు పండిస్తుంటారు. పాడి, కోళ్ల పరిశ్రమను కైలాశ్‌రామ్ నేతమ్ సమీకృత విధానంలో నిర్వహిస్తుంటారు. తన పంటపొలంలో నేతమ్ వర్మీ కంపోస్టును, సహజసిద్ధమైన నదీప్ ఎరువులే వాడతారు. తన వ్యవసాయ ఉత్పత్తులను ఆయన స్థానిక మార్కెట్లలో నేరుగా వినియోగదారులకు అమ్ముతుంటారు.
సచిన్ తనాజీ యవాలే (2nd prize) మధ్య, పశ్చిమ ఇండియా: ఆర్గానిక్ పంటల సాగులో మంచి అనుభవం ఉన్న వ్యక్తి సచిన్ తనాజీ యవాలే. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో మూడు ఎకరాల్లో ఆయన ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటారు. సచిన్ తన పొలంలో ఆర్గానిక్ విధానంలో కూరగాయలు, పండ్లు, చెరకు పండిస్తుంటారు. పశువులతో పాటుగా వర్మీ కంపోస్ట్‌ను సమీకృత విధానంలో నిర్వహిస్తుంటారు. తన ఉత్పత్తులను సచిన్ స్థానిక మార్కెట్లలోను, రిటైల్ దుకాణాల్లోను అమ్ముతారు.హనుమంత్ హలాకి (1st prize) దక్షిణ భారతదేశం: కర్ణాటలోని బెల్గాం జిల్లాకు చెందిన హనుమంత్ హలాకీ ఆర్గానిక్ పంటల సాగులో సక్సెస్‌ఫుల్‌ రైతు. మొత్తం 127 మంది రైతులతో 434 ఎకరాల్లో సంఘటితంగా వ్యవసాయం చేస్తుంటారాయన. గోకుల్ ఆర్గానిక్ ఫాం పేరుతో హనుమంత్ హలాకీ సొంతంగా ఓ ఆర్గానిక్ ఫాం నిర్వహిస్తున్నారు. తన ఫాంలో ఆయన ఆర్గానిక్ వ్యవసాయ విధానంలో భారీ ఎత్తున కూరగాయలు, చిరు ధాన్యాలు (మిల్లెట్స్) పండిస్తుంటారు. తాను పండించే ఆర్గానిక్ పంటలను స్థానిక మార్కెట్లకు, ఆర్గానిక్ స్టోర్‌లకు సరఫరా చేస్తారు. హనుమంత్ హలాకీ త్వరలోనే ఆర్గానిక్ పంటల ఎగుమతి రంగంలోకి కూడా అడుగుపెట్టేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు.మాతోట ట్రైబల్ ఫార్మింగ్ & మార్కెటింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ (2nd prize) దక్షిణ భారతదేశం: 150 మంది రైతులతో కూడిన వ్యవసాయ ఉత్పత్తుల సమీకరణ, నిర్వహణ కంపెనీ మాతోట. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పరిసరాల్లో సంస్థ ఈ రైతుల బృందం మొత్తం 2,231.36 ఎకరాల్లో ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండిస్తున్నారు. పూర్తి ఆర్గానిక్ విధానంలో ఈ రైతులు మామిడి, మిరియాలు, కాఫీ, మొక్కజొన్న, పసుపు, చిరుధాన్యాలు (మిల్లెట్స్) పండిస్తున్నారు. మాతోట గ్రూప్‌లోని సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫార్మర్ల నుంచి నేరుగా నూరు శాతం ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. తమ గ్రూపులో ఆర్గానిక్ రైతులను 300కు పెంచాలనే లక్ష్యంతో మాతోట ఉంది. మాతోట గ్రూపు సేకరించే ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రస్తుతం కేరళ, హైదరాబాద్, ఢిల్లీల్లో విక్రయిస్తోంది.

ఇలాంటి ప్రతిష్టాత్మ అవార్డులు ఆర్గానిక్‌ వ్యవసాయరంగ పోటీలో మన రైతులు అంతర్జాతీయ పోటీలో నిలబడేందుకు ప్రోత్సాహంగా నిలుస్తాయి. రైతుల్లో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. నిజానికి ప్రపంచంలో ఆర్గానిక్‌ వ్యవసాయం చేసే మొత్తం రైతుల్లో భారతదేశ ఆర్గానిక్‌ వ్యవసాయ రైతులే అత్యధికం అని ఒక సర్వే వెల్లడించింది. మొత్తం 16 మంది సభ్యుల న్యాయ నిర్ణేతల బృందం క్షుణ్ణంగా పరిశీలించి అవార్డు విజేతలను ఎంపిక చేసింది.

అవార్డుల ఎంపిక కమిటీ సభ్యులుగా ఎన్‌.హెచ్‌.శివశంకర్‌రెడ్డి (కర్నాటక మాజీ వ్యవసాయశాఖ మంత్రి), డాక్టర్‌ అశోక్‌ దళ్వాయ్‌ (జాతీయ రెయిన్‌ఫెడ్‌ ఏరియా అథారిటీ & చైర్మన్‌, సీఈఓ, కమిటీ ఆన్‌ డబ్లింగ్‌ ఫార్మర్స్‌ ఇన్‌కం), రాజశేఖర్‌రెడ్డి శీలం (మేనేజింగ్ డైరెక్టర్‌- శ్రేష్ట నేచురల్ బయో ప్రొడక్ట్స్‌ ప్రై.లిమిటెడ్‌), జెన్నిఫెర్‌ చాంగ్‌ (ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌- ఐఎఫ్‌ఓఏఎం ఆసియా), లారా బాట్చా (ప్రెసిడెంట్‌- ఆర్గానిక్‌ ట్రేడ్ అసోసియేషన్‌), పంకజ్‌ కుమార్ ప్రసాద్‌ (మేనేజింగ్‌ డైరెక్టర్‌- నార్త్‌ ఈస్టర్న్‌ రీజినల్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌), డాక్టర్‌ క్రిషన్ చంద్ర (డైరెక్టర్‌ ఆఫ్‌ ది నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌- గవర్నమెంట్‌ ఆఫ్ ఇండియా) వ్యవహరించారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here