మేకిట్ మెమొరబుల్ క్రియేటివ్ వర్క్స్‌(ఎంఐఎం) స్టార్టప్‌ కంపెనీతో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు తోడ్పాటును అందిస్తున్న చేపూరి అభినయ్ సాయి ఇప్పుడు మరో అడుగు ముందుకువేసి రైతులకు అండగా నిలిచేందుకు పూనుకున్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం (Zero budget natural Farming)లో రైతులకు తగిన శిక్షణ ఇవ్వడంతో పాటు వారి పంటలకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ఎన్విరోప్రామిస్ (Enviropromise) పేరుతో ఒక కొత్త స్టార్టప్ ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా ఇటీవల ఈ స్టార్టప్‌ ప్రారంభమైంది. ఈ కంపెనీలో ప్రస్తుతం పది మంది ఉద్యోగులు, మరో పది మంది ఇంటర్న్స్‌ పని చేస్తున్నారు. ఈ స్టార్టప్‌కు కావలసిన ఆర్థిక వనరుల కోసం అభినయ్ వెంచర్ కాపిటలిస్టులను సంప్రదిస్తున్నారు.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అభినయ్ పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బి.టెక్ చదువుతున్నారు. నైపుణ్యం ఉండీ అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్నవారికి చేయూతనివ్వడం కోసం అభినయ్ టీనేజ్‌లోనే ఒక స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. గత మూడేళ్లలో తన కంపెనీ ద్వారా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 70 మందికిపైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారి పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని సంకల్పించారు.

చిన్ననాటి నుంచీ ప్రకృతిని ప్రేమించే తత్వమే ఈ స్టార్టప్ ప్రారంభించేందుకు స్ఫూర్తి కలిగించిందని నూనుగు మీసాల అభినయ్ చెబుతారు. ఆర్గానిక్ సాగును ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా వీలు కలుగుతుందనే ఉద్దేశ్యం ఇందులో ఉందంటారు. తన స్టార్టప్‌లో లాభార్జన దృష్టి లేదని అభినయ్ స్పష్టం చేశారు. Enviropromise స్టార్టప్‌ కంపెనీలో భాగంగా రైతుల కోసం రెండు అప్లికేషన్లను అభివృద్ధిపరచామని ఆయన వివరించారు. ఈ అప్లికేషన్ల ద్వారా ప్రకృతి సాగు రైతులు తమ వ్యవసాయోత్పత్తులను నేరుగా విక్రయించుకునే వీలు కలుగుతుందని ఆయన చెప్పారు. దేశంలో కోట్లాది మంది రైతులకు ఇంకా ఇంటర్నెట్ అందుబాటులోకి రాలేదనీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వారు ప్రయోజనం పొందలేకపోతున్నారనీ ఆయన అభిప్రాయపడ్డారు. సేంద్రియ వ్యవసాయంలో పంట దిగుబడులను పెంచే విధానాలపై అభినయ్ స్టార్టప్ అవగాహన కల్పిస్తుంది. అలాగే పంట వ్యర్థాలను సులువుగా బయో డీజిల్‌గాను, బయో పెట్రోల్‌గాను మార్చే విధానాలను ఆయన రూపొందించి వాటిని రైతులకు అందుబాటులోకి తేనున్నారు. దీని వల్ల రైతులపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని ఆయన చెబుతున్నరు.

ఎన్నో ఒడిదుడుకులు!

రైతుల కోసం పని చేయాలనే సంకల్పానికి అభినయ్‌ కుటుంబ నేపథ్యం కూడా ఒక కారణం. అభినయ్‌ది ఒకప్పుడు, తమ ఎన్గల్‌ గ్రామంలో సంపన్న కుటుంబం. 50 మంది దాకా వారి దగ్గర పనిచేసేవారు. ఇంట్లో పది కార్లుండేవి. ఆ ఊరికి టెలిఫోన్ పరిచయం చేసింది కూడా ఆ కుటుంబమే. కానీ అభినయ్‌కి 4 ఏళ్ల వయసున్నప్పుడు ఓడలు బండ్లయ్యాయి. కుటుంబం అప్పులపాలై సర్వం కోల్పోయింది. కనీసం తినేందుకు తిండి కూడా లేకుండా అవస్థలు పడింది. అయితే నెమ్మదిగా కొన్నేళ్లకు ఆ కుటుంబం కుదుటపడింది. ఇలా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అభినయ్ తన తోటివారికి సాయపడాలన్న అవగాహనతో పెరిగారు. ఆ క్రమంలోనే నిరుద్యోగులకు తోడ్పాటునందించడం కోసం ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో ఉన్నప్పుడే ఒక స్టార్టప్ ప్రారంభించారు. దానికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. టాలెంట్ ఉన్నవారికి తన ప్రొఫెసర్లతో అవసరమైన ప్రాథమిక శిక్షణ ఇప్పించి మంచి కంపెనీలలో అవకాశాలు కల్పిస్తూ వచ్చారు అభినయ్. ఇందంతా తను ఉచితంగానే చేయడం విశేషం. తన కృషికి గుర్తింపుగా అభినయ్ 2018లో YOUNGEST IDEAL ENTREPRENEUR అవార్డు, 2019లో SWI International Emerging Entrepreneur అవార్డు అందుకున్నారు. 2020లో BEST YOUNGEST INNOVATIVE ENTREPRENEUR పురస్కారానికి కూడా ఎంపికయ్యారు.

ఆర్గానిక్ రైతులకు బాసట

ఇప్పుడు అభినయ్ ప్రారంభించిన మరో స్టార్టప్ కంపెనీ Enviropromise పలు క్షేత్రాల్లో పనిచేస్తుంది. మొదట రైతులతో ప్రత్యక్ష సంబంధాలు నెలకొల్పుకుని, వారికి ఆర్గానిక్ వ్యవసాయంలో అవసరమైన శిక్షణనిస్తుంది. ఆపై రైతులు ఉత్పత్తి చేసే ఆర్గానిక్ పంటలు, ఆహార పదార్థాలను విక్రయించేందుకు తగిన వేదిక కల్పిస్తుంది. పంటలకు సంబంధించిన వ్యర్థాలను రీసైకిల్ చేసి ఆ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంది. పంట వ్యర్థాల నుండి బయో డీజిల్, బయో పెట్రోల్ వంటివి తయారు చేయాలన్నది అభినయ్ ఆలోచన. అలాగే విద్యుత్తు, సౌర వాహనాలను కూడా ఉత్పత్తి చేయాలని అభినయ్ భావిస్తున్నారు. అభినయ్ రసాయన వ్యవసాయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాల వల్ల మనం తినే ఆహారం విషతుల్యమౌతోందంటారు. అందుకే ఆర్గానిక్ వ్యవసాయం ఒక్కటే పర్యావరణహితమైందని గట్టిగా చెబుతారు. అందుకే రైతులను ప్రకృతి వ్యవసాయంవైపుకు మరల్చేందుకు తన స్టార్టప్‌ ద్వారా పూనుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే అభినయ్ ఆర్గానిక్ ఆహారంపై అవగాహన కల్పిస్తున్నారు. https://freshspout.in/ వెబ్‌సైట్ ద్వారా ఆర్గానిక్ ఆహార ఉత్పత్తుల విక్రయానికి ఒక వేదిక కల్పించారు. అభినయ్ సాయికి ఇప్పుడు కేవలం 21 ఏళ్లు. ఇంత చిన్న వయసులోనే ఈ యువకుడు పెద్ద మనసు కలిగి ఉండడం, వినూత్నంగా ఆలోచించడం, ఉదారంగా తోటివారికి తోడ్పడడం అభినందనీయం.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Enviropromise
5-3-68/9/4/3, Venkateshwara colony,
katedan, Budwel, Hyderabad,
Telangana, India, 500077
Ph: 63038 89345
info.enviropromise@gmail.com
support@freshspout.in
https://freshspout.in/
https://www.saiabhinaychepuri.com/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here