అందరికీ శ్రీప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భారతీయ జీవనంలో పంచాంగానికి విశేష ప్రాముఖ్యం ఉంది. కాలస్వరూపాన్ని వివరించే పంచాంగం తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలతో కూడి ఉంటుంది. అలాగే కార్తెల ప్రవేశాలు, ముహూర్తాలు, శుభసమయాలు, పండుగలు, పుణ్యదినాలు, రాశిఫలాల వివరాలు పంచాంగంలో ఉంటాయి. ఈ దృష్ట్యా V.E.R FOUNDATION ప్రామాణికమైన భారత ప్రభుత్వ సమ్మత శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని (2021-22) ప్రచురించి ఉచితంగా అందజేసింది. ఏ పంచాంగమైనా ఏదో ఒక ప్రదేశానికే తయారు చేయబడుతుంది. అలా ఈ పంచాంగం విశాఖపట్టణానికి అనుగుణంగా చేయబడింది. కనుక ముహూర్తాలకు సమయ సంస్కారం అవసరం. ఈ సమయ సవరణ ఎలా చేసుకోవాలో పంచాంగంలో వివరంగా ఉంది. ఇక అందరికీ ముద్రిత ప్రతులను అందించడం వీలు కాదు కనుక ఈ పంచాంగాన్ని PDF రూపంలో ఇక్కడ అందుబాటులో ఉంచడం జరుగుతోంది. ఈ పంచాంగాన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్రింది లింక్‌పై క్లిక్ చేయండి!

Sri Plavanama Samvatsara Panchangam (2021-22)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here