వర్షాకాలం వచ్చేసింది. ఎక్కడ ఏ పండ్ల దుకాణంలో చూసినా అల్లనేరేడు పండ్లు అందరికీ నోరూరిస్తున్నాయి. అల్లనేరేడు పండు తినేవారికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నేరేడులో ఎక్కువ స్థాయిలో ఉండే పొటాసియం గుండె సక్రమంగా పనిచేయడానికి చాలా ఉపయోగపడుతుంది. విషవాయువులు, వాయు కాలుష్యం వల్ల దెబ్బతిన్న ఊపిరితిత్తులు, శ్వాసనాళాలను అల్లనేరేడు శుభ్రం చేస్తుంది. అల్లనేరేడులో ఉండే జింక్, విటమిన్ సీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. అల్లనేరేడులో ఉండే సైనైడిన్‌ లాంటి సమ్మేళనాలు కొలన్ క్యాన్సర్‌ ను నిరోధిస్తాయి. ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్‌ తక్కువ. బ్లడ్‌ సుగర్‌ ను అదుపులో ఉంచుతుంది. ఎక్కువ మూత్ర విసర్జన, దాహం లాంటి డయాబెటిక్‌ లక్షణాలు అల్లనేరేడు పండ్లు తినేవారికి తగ్గిస్తాయి. అల్లనేరేడు తింటే చర్మం నిగనిగలాడుతుంది. వీటిలో ఉండే యాంటి ఆక్సిడెంట్ల సమ్మేళనాలు, విటమిన్ సీ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. అల్ల నేరేడుపండ్లతో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను ఇవి అడ్డుకుంటాయి. మన దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.

సంపూర్ణ ఆరోగ్యం ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ప్రకృతిసిద్ధమైన ఆహారాల్లో అల్లనేరేడు పండు ఒకటి. నేరేడుపండును పోషకాల గని అంటే అతిశయోక్తి కాదు. నేరేడుపండు మాత్రమే కాకుండా దీని ఆకు, చెట్టు బెరడు కూడా మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తాయి. మన కడుపులో చాలా కాలంగా పేరుకుపోయిన మలినాలు నేరేడుపండు తింటే బయటకు వెళ్లిపోతాయి. పేగుల్లో చుట్టుకుపోయిన వెంట్రుకలను కోసేసి బయటకు పంపించే శక్తి నేరేడుపండుకు ఉంది. నేరేడుపండు తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నీరసం, నిస్సత్తువ ఉన్నవారు నేరేడుపండ్లు తింటే వెంటనే శక్తి ఇస్తాయి. వెన్ను నొప్పి, నడుంనొప్పి, మోకాళ్ల నొప్పులు నేరేడుపండ్లు తింటే తగ్గుతాయి. జిగట విరేచనాలతో బాధపడేవారికి నేరేడుపండ్ల రసం రెండు మూడు చెంచాలు చొప్పున ఇస్తే శక్తిని ఇవ్వడంతో పాటు పేగుల కదలికలను నియంత్రిస్తుంది.ఎన్నో ప్రయోజనాలు కలిగించే అల్లనేరేడులో ఏజీజే 85 రకం సాగు గురించి తెలుసుకుందాం. అల్లనేరేడు మొక్క నాటిన మూడో ఏట నుంచే కాపు కాయడం మొదలవుతుంది.  మూడో ఏట 25 శాతం, నాలుగో ఏట 50 శాతం, నాలుగో ఏట 75 శాతం, ఐదో ఏడు వచ్చేసరికి నూరుశాతం నేరేడు చెట్టు పంట దిగుబడి ఇస్తుంది. పదేళ్ళు వచ్చేసరికి చెట్టు బాగా విస్తరిస్తుంది.ఇతర నేరేడు జాతుల కంటే ఏజీజే 85 రకం అల్లనేరేడు పండులో గుజ్జు అధికంగా ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది. మిగతా నేరేడుపండ్ల కంటే గింజ పరిమాణం చాలా తక్కువ ఉంటుంది. మొక్క నాటిన మూడున్నరేళ్లకే పూత, పిందె వస్తుంది. తొలి ఏడాది ఒక్కో చెట్టు నుండి కనీసం 20 కిలోల అల్లనేరేడు దిగుబడి ఇస్తుంది. ఈ రకం నేరేడు చెట్టు కూడా నిటారుగా 12 లేదా 13 అడుగుల ఎత్తు కంటే ఎక్కువ ఎదగదు. చెట్టు చుట్టూరా బాగా ఎక్కువగా విస్తరిస్తుంది. కింది భాగంలో ఉండే కొమ్మలకు అంటే ఆరు లేదా ఏడు అడుగుల కిందనే పంట దిగుబడి కాస్త అధికంగా వస్తుంది. దీంతో పండ్లు తెంపుకోవడం చాలా సులభం. చిన్నసైజు స్టూలు వేసుకుని కూడా ఏజీజే 85 అల్లనేరేడు పండ్లను తేలికగా కోసుకోవచ్చు.పండిన ఏజీజే 85 అల్లనేరేడు కోసిన తర్వాత నాలుగైదు రోజులు చెడిపోకుండా ఉంటుంది. దాంతో దేశంలో ఏ మూలకు రవాణా చేయడానికైనా ప్రస్తుత ఆధునిక రవాణా సౌకర్యాలతో రెండు మూడు రోజులు కంటే ఎక్కువ పట్టదు. దీంతో రిటైల్‌ మార్కెట్లో విక్రయించే వ్యాపారికి మరో రెండు రోజులు సమయం దొరుకుతుంది. దీంతో ఏజీజే 85 అల్లనేరేడుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. బాక్స్ ప్యాకింగ్ ్లో ఏజీజే 85 అల్లనేరేడును నిల్వచేస్తే వారం రోజులు కూడా నిల్వ ఉంటుందని రైతు సురేంద్ర వివరించారు. ఏజీజే 85 అల్లనేరేడు పండ్ల రుచి బాగుంటుంది. గింజ చిన్నగా ఉండి, గుజ్జు ఎక్కువ ఉంటుంది. నిల్వ ఉండే సమయం కూడా అధికంగా ఉంటుంది. ఏజీజే 85 అల్లనేరేడు పండ్ల షేప్ కూడా చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటుంది. చూడగానే తినాలపిస్తుంది.అల్లనేరేడు మొక్కలను తోటలో 26 లేదా 27 అడుగుల దూరంలో నాటుకోవాలని సురేంద్ర వాటి కొమ్మలు విస్తరించి తోట అంతా కొమ్మలు కమ్మేస్తాయి. మొక్కలు నాటిన తర్వాత అవి ఎదిగే వరకూ నేరేడుతోటలో అంతర పంటగా సీతాఫలం, లేదా ఇతర పంటలు కూడా వేసుకుంటే తొందరగా ఆదాయం వస్తుంది. నేరేడుచెట్లు తోట అంతా విస్తరించిన తర్వాత దాని నుంచి వచ్చే ఆదాయమే ఇబ్బడి ముబ్బడి అవుతుంది. చెట్టు ఎంత విస్తరిస్తే అంత ఎక్కువగా పంట దిగుబడి కూడా పెరుగుతుంది. ఏజీజే 85 అల్లనేరేడు చెట్టు నుండి మొక్క నాటిన ఐదో ఏట నుంచి వాణిజ్యపరంగా పంట దిగుబడి వస్తుంది. అక్కడి నుంచి ఏటేటా దీని దిగుబడి పెరుగుతూనే ఉంటుంది. మొక్క నాటిన 15వ ఏట నుంచి ఈ ఏజీజే 85 అల్లనేరేడు తోటలో దిగుబడి పూర్తిస్థాయిలో వస్తుంది.అల్లనేరేడు చెట్లు హ్యుమిడిటీ తక్కువ ఉన్న ప్రాంతాల్లో బాగా ఎదుగుతాయి. అందుకే రాయలసీమ ప్రాంతంలో ఈ అల్లనేరేడు పంటను రైతులు అధికంగా సాగుచేస్తుంటారు. కోస్తా ప్రాంతంలో హ్యుమిడిటీ ఎక్కువ కాబట్టి అక్కడ ఈ హైబ్రీడ్‌ నేరేడుపంట అంతగా సాగుచేయరు. తెలంగాణ ప్రాంత వాతావరణం ఏజీజే 85 అల్లనేరేడు పంట సాగుకు అనువైనదే అని సురేంద్ర వెల్లడించారు. హ్యుమిడిటీ 60 లోపు ఉన్న ప్రాంతాల్లో ఈ రకం నేరేడుసాగు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రాయి, రప్పలతో కూడిన భూమిలో, పీహెచ్‌ 9 వరకు ఉన్న భూములు కూడా అల్లనేరేడు పంటకు అనుకూలం. ఆమ్లగుణం కాకుండా క్షారగుణం ఉండే భూముల్లో అల్లనేరేడు సాగు అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో సీడ్ లెస్‌ అల్లనేరేడు పండ్లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.ఏజీజే 85 రకం అల్లనేరేడు రకం మొక్కలు కావాలన్నా, మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా సురేంద్రను 9949614751లో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here