తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల ఆధ్వర్యంలో గోమహా సమ్మేళనం ఈ నెల 30, 31 తేదీల్లో జరుగుతోంది. ఈ గోమహా సమ్మేళనానికి యుగతులసి ఫౌండేషన్, S.A.V.E. సంస్థలు సహకారం అందిస్తున్నాయి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగే ఈ గోమహా సమ్మేళనంలో తొలిరోజున గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహిస్తారు. ఈ మహాసమ్మేళనం యువ రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచడానికి ఉద్దేశించింది. ముందుగా పేరు నమోదు చేసుకున్న వారికి గోమహాసమ్మేళనంలో ప్రవేశం ఉచితం.రెండో రోజు అక్టోబర్ 31న దేశీయ గోవు గురించి, ప్రస్తుత మన ఆర్థిక, ఆధ్యాత్మిక వ్యవస్థల అభివ్రుద్ధికి గోవు ప్రాశస్త్యం గురించి సదస్సు నిర్వహిస్తారు. గోశాలలు నిర్వహించే వారికి, గోవులను పోషించేవారికి, గోప్రేమికులకు, గోఆధారిత వ్యవసాయ విధానాన్ని ప్రచారం చేసేవారికి, ఉపాధి కోసం గ్రామాల్లో గోవు ఆధారిత కుటీర పరిశ్రమలు పెట్టే వారికి ఈ గోమహాసమ్మేళనానికి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల ఆహ్వానం పలుకుతోంది.తొలిరోజు అక్టోబర్ 30దీ రైతు సదస్సులో అంశాలు ఇలా ఉన్నాయి:

వ్యవసాయ భూమిలో, గ్రామాల్లో చెరువు ప్రాముఖ్యత గురించి, వాననీటి సంరక్షణ విషయంపైన, వ్యవసాయంలో దేశీ ఆవు ఆవశ్యకతపైన, దేశీ విత్తనాన్ని కాపాడుకోవడం, వ్యవసాయ ఉత్పత్తులతో కొన్ని విలువ ఆధారిత ఉత్పత్తులు చేసుకోవడం, అంతర పంటలు, 5 లేయర్ మోడల్ (మిశ్రమ ఉద్యాన వన పంటలు), వంటలు వండే పాత్రలు, వండుకొనే విధానం, కాలానుగుణ ఆహార మార్పులు మొదలైన వాటిపైన అవగాహన ప్రసంగాలు ఉంటాయి. ఎద్దుగానుగతో నూనెలు తయారుచేసుకొనే పద్ధతులపైన అవగాహన, అలాంటి సేవలు అందించే వారితో పరిచయాలు ఉంటాయి. రైతుల వద్ద కొని దేవస్థానానికి దానం ఇచ్చే దాతలకు రైతులతో పరిచయాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల వారీగా ప్రకృతి వ్యవసాయ రైతుల వివరాలు, పరిచయాలు ఉంటాయి.

ఈ గోమహాసమ్మేళనానికి సంబంధించి ఇతర వివరాలు తెలుసుకోవాలంటే..
S.A.V.E. Organization,
భాగ్యనగరం.
Ph. 04027654337, 04027635867,
6309111427లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల లోపు సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here