కాలీఫ్లవర్‌లో 92 శాతం నీరు ఉంటుంది. మనిషి శరీరాన్ని డీహైడ్రేటెడ్‌గా ఉంచడంలో కాలీఫ్లవర్‌ తోడ్పడుతుంది. కాలీఫ్లపర్‌ ఉండే హెల్దీ బ్యాక్టీరియా పేగుల్లో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాలీఫ్లవర్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉన్న కారణంగాగుండె జబ్బులు, క్యాన్సర్‌, చక్కెర వ్యాధుల నివారణకు బాగా ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో తేలింది. కాలీఫ్లవర్‌లో విటమిన్‌లు, ఖనిజాలు, ముఖ్యమైన ఫైటో రసాయనాలు పుష్కలంగా ఉంటాయి.బ్రోకలీ, క్యాబేజీ వంటి క్రూసిఫరస్ కుటుంబానికి చెందిన ఈ జాతి మొక్క. కాలీఫ్లవర్‌ 100 గ్రాముల్లో కార్బో హైడ్రేట్లు .4.97 గా్రాములు, ప్రొటీన్‌ 1.92 మిల్లీ గ్రాములు, ఫైబర్‌ 2 గ్రాములు, ఫ్రక్టోజ్‌ 0.97 గ్రాములు, గ్లూకోజ్‌0.94 గ్రాములు, ఐరన్‌ 0.42 మిల్లీ గ్రాములు, సోడియం 30 మిల్లీ గ్రాములు, పొటాషియం 299 మిల్లీ గ్రాములు, భాస్వరం  44 మిల్లి గ్రాములు, మెగ్నీషియం 15 మిల్లీ గ్రాములు, కాల్షియం  22 మిల్లీ గ్రాములు, రాగి 0.039 మిల్లీ గ్రాములు, జింక్‌ 0.27 మిల్లీ గ్రాములు, మాంగనీస్‌ 0.155 మిల్లీ గ్రాములు, ఫ్లోరైడ్‌ 1/1/4 గ్రాములు, విటమిన్‌ సి 48.2 మిల్లీ గ్రాములు, రిబోఫ్లావిన్‌ 0.06 మిల్లీ గ్రాములు, థయామిన్‌ 0.05 మిల్లీ గ్రాములు, నియాసిన్‌ 0.507 మిల్లీ గ్రాములు, పాంతోతేనిక్‌ యాసిడ్‌ 0.667 మిల్లీ గ్రాములు, ఫోలేట్‌ 57/1/4 గ్రామలు, శక్తి 25 కిలో కేలరీలు ఉంటాయి.కాలీఫ్పలవర్‌లో ఇన్ని పోషకాలు ఉన్నాయని, గుండె, క్యాన్సర్‌, చక్కెర వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుందని ఎంతమందికి తెలుసో తెలియదో కానీకూరలలో అనేక మంది కాలీఫ్లవర్‌ను విరివిగా వాడుతుంటారు. ఇలాంటి కాలీఫ్లవర్‌ పండించడంతో రైతుకు ఎలాంటి లాభాలు వస్తామి? కాలీఫ్లవర్‌ సాగులో యాజమాన్య పద్ధతులు ఎలా ఉండాలి? కాలీ ఫ్లవర్‌లో ఎలాంటి రకాలు ఉంటాయి? ఎకరం భూమిలో ఎన్ని వేల మొక్కలు నాటుకోవచ్చు? ఎకరంలో కాలీఫ్లవర్‌ సాగుకు ఎంత పెట్టుబడి అవుతుంది? కాలీఫ్లవర్ పంట సాగుకు ఎంత సమయం తీసుకుంటుంది? మార్కెట్‌లో ఎంత ధర పలుకుతుంది? ఏ కాలంలో కాలీఫ్లవర్‌ మొక్కలు నాటుకుంటే మంచి గిట్టుబాటు ధర వస్తుంది? లాంటి విషయాలను వికారాబాద్‌ జిల్లాలోని పులిమద్ది గ్రామంలో ఐదేళ్లుగా విరివిగా కాలీఫ్లవర్ సాగు చేస్తున్న రైతు రఘుపతి ద్వారా వివరాలు తెలుసుకుందాం.ఒక ఎకరా భూమిలో 25 వేల కాలీఫ్లవర్ మొక్కలు నాటుకోవచ్చు. నర్సరీ నుంచి ఒక్కో మొక్కకు 70 పైసలకు ఖరీదు చేసి, నారు తెచ్చి రైతులు పొలంలో కాలీఫ్లవర్ మొక్కలు నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలు నాటే ముందే భూమిని బాగా దున్నుకేని, డ్రిప్‌ వేసుకోవాల్సి ఉంటుంది. ఎకరం నేలలో కాలీఫ్లవర్ మొక్కలు నాటేందుకు సుమారు 10 మంది వరకు కూలీలు అవసరం అవుతారు. సాధారణంగా కాలీఫ్లవర్‌ 60 రోజుల పంట అని నర్సరీ యజమానులు చెబుతారు కానీ, 70 నుంచి 80 రోజుల్లో కోతకు వస్తుందని రఘుపతి వివరించాడు. సుబాసింప్టస్‌ రకం అయితే.. 80 రోజుల్లోపల కోతకు వస్తుందని, మరి కొన్ని రకాలైతే 100 రోజులకు దిగుబడి వస్తాయన్నాడు రఘుపతి. కాలీఫ్లవర్ మొక్కలు నాటుకునేందుకు ఒక రోజు ముందు డీఏపీ లేదా 20:20 లేకపోతే కాంప్లెక్స్‌ ఎరువులను కొంత డ్రిప్‌ పైపుల ద్వారా, కొంత బోదెలలలో తాను వేస్తానన్నాడు. నారు నాటే రోజే రసాయన ఎరువులు వేస్తే నారు మాడిపోతుందని చెప్పాడు. కాలీఫ్లవర్ మొక్క నాటిన 10 నుంచి 15 రోజుల్లో వేరు పట్టి, మొక్క తయారు మొదలవుతుంది. ఆ తర్వాత యూరిగా గానీ, 20:20 గానీ, 0:13 గానీ వేస్తామన్నాడు. కాలీఫ్లవర్ నారు మొక్కను రెండు అడుగుల దూరంలో నాటుకోవాల్సి ఉంటుంది. అలా బోదె మీద రెండు వైపులా కాలీఫ్లవర్ మొక్కలను జిగ్‌జాగ్‌ విధానం నాటుతారు. సాలుకు సాలుకు మధ్య దూరం రెండున్నర అడుగుల దూరం పెడతారు.కాలీఫ్లవర్ పంటకు సాధారణంగా వైరస్ సోకుతుంటుంది. వర్షం పడితే కాలీఫ్లవర్ మొక్కకు నల్ల తెగులు సోకుతుంది. తెల్లదోమ, పచ్చదోమ, ఎర్రనల్లి లాంటి ఎక్కువగా ఆశిస్తాయి. కాలీఫ్లవర్ మొక్కలు నాటిన తర్వాత 15 నుంచి 20 రోజుల నుంచి ఇలాంటి ఇలాంటివి మొదలయ్యే అవకాశం ఉందని రైతు రఘునాథ్‌ వివరించాడు. అలా తెగుళ్లు ఆశించినప్పుడు కోరజన్‌, సిక్స్‌ ఆర్‌, బోరాన్‌ లాంటి మందులు పిచికారి చేస్తామన్నాడు. కాలీఫ్లవర్‌ మొగ్గ విచ్చుకునే సమయంలో బోరాన్‌ మందును గమ్‌తో కలిపి చల్లితే పువ్వు బాగా తెల్లగా రావడంతో పాటు సైజు కూడా పెద్దగా వస్తుందన్నాడు. గమ్‌ కలపడం వల్ల కాలీఫ్లవర్‌ ఆకుకు వారం నుంచి పది రోజుల దాకా బోరాన్ అంటుకుని ఉంటుంది. కాలీఫ్లవర్ మొక్కలకు 40 నుంచి 50 రోజుల మధ్యలో పువ్వులు పూయడం మొదలవుతాయి.కాలీఫ్లవర్‌ అమ్మకం మార్కెట్‌ హెచ్చు తగ్గులపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లోకి వెళ్లిన తర్వాత కానీ దాని ధర తెలియదన్నాడు రైతు రఘుపతి. పది కాలీఫ్లవర్‌లు ఉన్న బస్తాకు రూ.150 నుంచి రూ.200 పైన ధర పలికితేనే రైతుకు గిట్టుబాటు అవుతుందన్నాడు. అంతకు తక్కువకు అమ్మాల్సి వస్తే.. సంచులు, కిరాయి, కమీషన్‌, మందులు, కూలీడబ్బులు, మూడు నెలల పాటు రైతు చేసిన కష్టానికి నష్టం వస్తుందన్నాడు. కాలీఫ్లవర్ ఒక్కోసారి రూ.70 నుంచి 80 రూపాయలకు కూడా అమ్మిన రోజులున్నాయన్నాడు. ఈ ధర మాత్రమే పలికితే రైతుకు పెట్టుబడి కూడా రాదు. కాలీఫ్లవర్ పైరుపై మందులు సమయానుకూలంగా కొట్టకపోయినా, ఎక్కువ మందులు కొట్టినా, వాతారణ మార్పులను బట్టి కూడా పువ్వులు గోధుమ రంగులో లేదా నల్లటి మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉందని రఘుపతి పేర్కొన్నాడు.కాలీఫ్లవర్‌ నింపే ఒక్కో సంచి ఖరీదు రూ.7 ఉంటుందని, తమ ఊరి నుంచి హైదరాబాద్‌ తీసుకెళ్లేందుకు వాహనానికి రూ.15 అవుతుందని రఘుపతి వివరించాడు. అంటే పది కాలీఫ్లవర్లు మార్కెట్‌కు తరలించేందుకు రూ.25 వరకు ఖర్చవుతుంది. ఎరువులు, మందులు, కూలీలు, నారు ఖర్చు అన్నీ కలుపుకుంటే కాలీఫ్లవర్ పండించే రైతుకు సుమారు రూ. 100 ఖర్చు అవుతుందన్నాడు. అందుకే సంచిని కనీసం రూ.150కి అమ్మితే గిట్టుబాటు అవుతుందని చెప్పాడు. ఎకరం భూమిలో కాలీఫ్లవర్ సాగు చేస్తే.. నారు మొదలు అన్నీ కలుపుకొని లక్ష రూపాయల వరకు పెట్టుబడి అవుతుందని రఘుపతి వివరించాడు. పది వేల నారు వేస్తే.. 500 సంచుల నిండా కాలీఫ్లవర్‌ దిగుబడి వస్తుందన్నాడు. ఒక్కో కాలీఫ్లవర్ రూ.20 ధర పలికితే.. ఎకరం పంటలో పెట్టుబడి అంతా పోగా 40 నుంచి 50 వేలు వరకు మిగులుతుందని చెప్పాడు. ఆపైన ఎంత ఎక్కువ ధర వస్తే ఆ మేరకు లాభం కూడా పెరుగుతుందన్నాడు. కాలీఫ్లవర్ పంట ఒకసారి వేస్తే.. మళ్లీ అదే పంట వేయకూడదని రైతు రఘుపతి అనుభంతో చెప్పాడు. పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలన్నాడు. కాలీఫ్లవర్‌నే మళ్లీ మళ్లీ వేస్తే వైరస్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించాడు. వైరస్ సోకిందంటే మొక్కలు ఎదగవని చెప్పాడు. మొక్కల్ని వైరస్‌ కొరికి కొరికి చంపేస్తుందని, దాంతో కుళ్లిపోతాయన్నాడు. కాలీఫ్లవర్ మొక్కల్సి అక్టోబర్ ఆఖరులో నవంబర్‌ మొదట్లో నాటుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుందన్నాడు.కాలీఫ్లవర్‌ పంట అంటేనే మందులతో కూడిన సాగు అని, మార్కెట్‌ అనుకూలంగా ఉంటేనే దీన్ని పండిస్తే మంచిదని రైతు రఘుపతి చెప్పాడు. కాలీఫ్లవర్ నాటు వేసినది మొదలు ప్రతి నిత్యం చీడ పీడలను జాగ్రత్తగా గమనించుకోవాలన్నాడు. లాభదాయకంగా ఉన్నప్పటికీ కష్టపడి జాగ్రత్తగా సాగు చేయాలనుకునేవారు కాలీఫ్లవర్ పంట వేస్తే ఉపయోగం ఉంటుందని రఘుపతి అన్నాడు

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here