సేంద్రియ సాగు విధానాలను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో పంజాబ్‌లో 2021 మార్చి 26 నుండి 28 వరకు ‘కుద్‌రత్ ఉత్సవ్ 2021’ నిర్వహిస్తున్నారు. హిందీలో కుదరత్ అంటే ప్రకృతి (Nature) అని అర్థం. మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీ, పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీ సంయుక్తంగా బఠిండా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ సహకారంతో ఈ కుదరత్ ఉత్సవ్ కార్యక్రమం తలపెట్టాయి. ఖేతీ విరాసత్ మిషన్ ద్వారా బఠిండలోని మహారాజా రంజిత్ సింగ్ పంజాబ్ టెక్నికల్ యూనివర్శిటీలో ఈ ప్రకృతి మహోత్సవం జరుగుతుంది. కుదరత్ ఉత్సవ్ 2021 ప్రధానాంశాలు : సేంద్రియ వ్యవసాయం, ఆహారం-సంపూర్ణ ఆరోగ్యం, పోషణ, సస్టైనబిలిటీ, ఎకాలజీ-సంప్రదాయం, సంస్కృతి.

‘కుదరత్ ఉత్సవ్ 2021’ లక్ష్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

సుస్థిరమైన ఆహార వ్యవస్థను ప్రజలకు పరిచయం చేయడం.
సేంద్రియ రైతులు, వినియోగదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం.
చిరుధాన్యాల సాగును, తృణధాన్యాల ఆహారాన్ని ప్రోత్సహించడం.
చిరుధాన్యాల సాగులో అనుసరిస్తున్న వినూత్న విధానాల ప్రదర్శన.
ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి, కిచెన్ గార్డెనింగ్‌లో ఔషధ మొక్కలను చేర్చడం.
సస్టైనబుల్, ఎకోలాజికల్ కాటన్ సాగును ప్రోత్సహించడం.
సంపూర్ణ ఆహారం, సేంద్రియ ఆహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం.
సాంప్రదాయ పత్తి దుస్తులను తయారుచేసే చేనేత, చేతివృత్తులవారిని ప్రోత్సహించడం.
సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి ఆధారిత కార్యకలాపాలలో యువతను భాగస్వాములుగా చేయడం.
మన సాంప్రదాయ జ్ఞానాన్ని యువతరానికి అందించేందుకు ఒక వ్యస్థను రూపొందించడం.
సేంద్రియ వ్యవసాయం, సంపూర్ణ ఆరోగ్యం, ఇతర ప్రకృతి ఆధారిత రంగాలలో యువతరానికి ఉపాధి అవకాశాలను కల్పించడం.

లేడీ శ్రీరామ్ కాలేజీ విద్యార్థినులకు సాగు విధానాల గురించి అవగాహన

‘కుదరత్ ఉత్సవ్ 2021’ కార్యక్రమాలు:

కుదరత్ ఉత్సవ్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యకలాపాలను ఉత్సవంలో భాగంగా నిర్వహిస్తారు. సేంద్రియ చిరుధాన్యాల ఫుడ్ ఫెస్టివల్ వర్క్‌షాప్‌లు, దేశీ సీడ్ ఫెస్టివల్, కిచెన్ గార్డెనింగ్ వర్క్‌షాప్, సంపూర్ణ ఆరోగ్యంపై చర్చలు, హోలిస్టిక్ హెల్త్ కన్సల్టేషన్ డాక్టర్ ఖాదర్ వాలి / డాక్టర్ ఆజాద్ వంటివారితో చర్చాకార్యక్రమాలు, వ్యవసాయం / సేంద్రియ వంటగది, తోటపనిలో ఔషధ మొక్కల వినియోగం, పర్యావరణ వ్యవసాయ పద్ధతులు ప్రత్యేకంగా పంట వ్యర్థాల నిర్వహణ, పంజాబ్ చిరుధాన్యాస ప్రచారం, రైతుల వర్క్‌షాప్‌లు, మిల్లెట్ సాగు, సేంద్రియ పత్తి సాగు, వరి విత్తనాల పర్యావరణ పద్ధతులు, ఔషధ మొక్కల సాగు, సేంద్రియ ఉత్పత్తి యొక్క మార్కెటింగ్ మార్గాలు, FPO నిర్మాణం మరియు నిర్వహణ, కిసాన్ హాత్ / రైతు స్టాల్స్, రైతు సంప్రదింపులు, క్విజ్, రంగోలి, ఆన్-స్పాట్ పెయింటింగ్, ప్రదర్శనలు, Kheti Virasat Mission ప్రస్థానం, మిరాకిల్ మిల్లెట్స్, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, పర్యావరణ శ్రేయస్సు, సంపూర్ణ ఆరోగ్యం, ఫ్రూట్ అండ్ ఫుడ్ ఫారెస్ట్, త్రింజన్ – పంజాబ్ గ్రామీణ కళాకారులు, ప్రత్యక్ష ప్రదర్శనలు – త్రింజన్ చేనేత, చేతివృత్తులవారు, సాంస్కృతిక సాయం సమయం, సినిమా ప్రదర్శనలు.

కుదరత్ ఉత్సవ్ 2021లో రైతులు ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే ముందుగా నిర్వాహకులకు సమాచారం అందించవలసి ఉంటుంది. ఈ మూడు రోజుల ఉత్సవంలో పాల్గొనడం ద్వారా రైతులు సేంద్రియ సాగు, సేంద్రియ ఆహారానికి సంబంధించిన సమాచారం తెలుసుకోగలుగుతారు. వివిధ ప్రాంతాల్లో సాగుతున్న సేంద్రియ వ్యవసాయ విధానాలను గురించి ఒకచోటే తెలుసుకునే వీలు కలుగుతుంది.

మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Kheti Virasat Mission, H.N0-72,
Street Number- 4, R V Shanti Nagar,
PO Box # 1, JAITU – 151202 Faridkot, Punjab
7087107168, 9915195062
Email: kudratutsav21@khetivirasatmission.org
Phone: +91 1635 503415, +91 9872682161
Email: info@khetivirasatmission.org
https://khetivirasatmission.org/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here