కిచెన్ వేస్ట్‌ డీ కంపోస్ట్‌ పేస్ట్‌ పెరటి మొక్కలు, టెర్రస్‌ గార్డెన్‌ లోని మొక్కలకు మంచి బాలాన్నిస్తుందని ఇంతకు ముందు చెప్పుకున్నాం. డీ కంపోస్ట్ పేస్ట్‌ ను మళ్లీ నీళ్లతో కలిపి డైల్యూట్‌ చేసుకుని మొక్కలకు వేసుకుంటే అవి పచ్చగా, ఏపుగా, బలంగా, ఎలాంటి వ్యాధులకు గురికాకుండా ఎదుగుతాయని చెప్పుకున్నాం కదా!? ఇప్పుడు వేస్ట్ డీ కంపోస్ట్‌ పేస్ట్‌ కన్నా మరింత సులువుగా డీకంపోస్ట్‌ లిక్విడ్‌ తయారీ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా ఖర్చు లేకుండా, మన ఇంటిలో, పెరట్లో లభించే వేస్ట్‌ వస్తువులతో డీకంపోస్ట్‌ లిక్విడ్‌ తయారీ చేసుకోవడం ఇందులో ప్రత్యేకత.ఇందుకు మనకు కావాల్సినవి ఇంటిలో నీళ్ల కోసం వాడుకుని వదిలిపెట్టిన వాటర్ నాబ్‌ ఉన్న కింది క్యాన్‌, దాని పైన నీటితో పెట్టుకునే వాటర్ క్యాన్‌. ముందుగా పైన ఉండే వాటర్ క్యాన్‌ అడుగు భాగాన్ని కట్‌ చేసి ఓపెన్‌ గా ఉంచుకోవాలి. దాని నుంచి నీరు కిందికి వచ్చే మూతిని అలాగే ఉంచుకోవాలి. పైన ఉండే కంటెయినర్‌ కు పైభాగంలో కొన్ని చిన్న చిన్న రంధ్రాలు పెట్టాలి. దాన్ని వాటర్ నాబ్ ఉన్న వాటర్‌ క్యాన్‌ పై నీళ్లు వాడుకునేటప్పుడు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టాలి. మనం వాడి పక్కన పడేసిన రెండు యూనిట్ల వాటర్‌ క్యాన్‌ లను కంపోస్ట్ బిన్, లిక్విడ్‌ కలెక్టర్‌ గా కింది కంటెయినర్‌ ఉపయోగపడతాయి.వాటర్ క్యాన్‌ పై యూనిట్‌ మూతికి పైన కొద్దిగా కొబ్బరి పీచు ఒక లేయర్‌ గా వేసుకోవాలి. అది పైన ఉన్న క్యాన్ లోని పదార్థాలు నేరుగా కిందికి దిగిపోకుండా అడ్డుకుంటుంది. డీ కంపోస్ట్‌ లిక్విడ్ మాత్రమే కింది కంటెయినర్‌ లోకి వచ్చేలా చేస్తుంది. అంటే కొబ్బరి పీచు ఫిల్టర్‌ లా పని చేస్తుందన్న మాట. దాని పైన కొద్దిగా మట్టి వేయాలి. మట్టిపైన మన వంట ఇంటిలో గ్రీన్ వేస్ట్‌, బ్రౌన్ వేస్ట్‌ అంటే.. కాయగూరలు, ఆకుకూరల వేస్ట్‌, పండ్ల నుంచి వచ్చిన వేస్ట్‌ ఒక లేయర్‌ గా, ఎండిన ఆకులు మరో లేయర్‌ గా వేసుకోవాలి. బ్రౌన్ వేస్ట్‌ లేదంటే వరిపొట్టు, ఇంట్లో వృథాగా పడి ఉన్న బ్రౌన్ కార్డుబోర్డు అట్టపెట్టెల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా వేసుకోవచ్చు.గ్రీన్ వేస్ట్‌ ఎంత వేశామో అంతే పరిమాణంలో బ్రౌన్ వేస్త్ కూడా వేసుకోవాలి. ఆపైన ఓ గుప్పెడు వర్మీ కంపోస్ట్‌ కూడా వేసుకుంటే మంచిది. వర్మీ కంపోస్ట్‌ లో ఉండే వానపాము గుడ్లు కింది కంటెయినర్‌ లోకి జారి లిక్విడ్‌ తో కలుస్తాయి. ఇవి లిక్విడ్ ద్వారా కుండీలో చేరి, పిల్లలుగా మారి  మొక్కలు బాగా ఏపుగా, బలంగా ఎదిగేందుకు ఉపయోగపడతాయి.ఆపైన ఒక లేయర్‌ గా కొద్ది మోతాదులో పశువుల ఎరువు కూడా వేసుకుంటే మంచిది. బాగా మాగిన ఎరువు అయితే వేస్ట్‌ లిక్విడ్ తయారీకి మరింత చక్కగా ఉపయోగపడుతుంది. లేయర్ల మధ్య మధ్యలో గుప్పెడు మట్టి కూడా వేసుకోవాలి. మట్టిని యాడ్ చేసినప్పుడు కంపోస్ట్‌ చాలా వేగంగా తయారవుతుంది. మట్టిలో మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వేస్ట్ లిక్విడ్ ప్రాసెస్‌ మరింత వేగంగా జరుగుతుంది. అయితే.. వండిన పదార్థాలు ఏవీ ఈ విధానంలో వాడకూడదు.పై కంటెయినర్ నుంచి కింద ఉన్న వాటర్ కంటెయినర్ లోకి దిగిన వేస్ట్‌ డీ కంపోస్ట్ లిక్విడ్‌ ను మనం గ్లాసులోకి నీటిని తీసుకున్నట్టే డబ్బాల్లోకి సులువుగా పట్టుకోవచ్చు. ఇలా తయారైన లిక్విడ్ ను బెస్ట్ అవుటాఫ్ వేస్ట్‌ గా ఉపయోగపడుతుంది. మామూలుగా కిచెన్ వేస్ట్‌, ఇతర వృథా పదార్థాలను డబ్బాల్లో లేయర్లుగా వేసుకుని, మొక్కలు పెంచుకోవడం ఒక విధానం. అయితే.. వర్షాకాలంలో ఈ విధానం కొద్దిగా శ్రమతో కూడి ఉంటుంది. ఏ కాలంలో అయినా సరే బెస్ట్ అవుటాఫ్ వేస్ట్‌ లిక్విడ్ తయారీ విధానం ఏమాత్రం కష్టం ఉండదు. మొక్కలకు పోషకాలు త్వరగా అందేందుకు వీలుగా ఉంటుంది.మన పెరటి చెట్ల నుంచి రాలిన ఆకులు, లేదా కుండీల నుంచి తీసేసిన మొక్కలు, తీగలను ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేస్ట్ లిక్విడ్‌ తయారు చేసుకునే కంటెయినర్‌ లో వాడుకోవచ్చు. కిచెన్‌ లో వచ్చిన వేస్ట్ ను వృథాగా పడేసే బదులు ఇలా డీకంపోస్ట్‌ లిక్విడ్‌ మాదిరిగా చేసుకుంటే మనకు అవసరం అనుకునే మొక్కలను మనకు నచ్చిన విధంగా ఆరోగ్యవంతంగా, ప్రకృతి సిద్ధంగా పెంచుకుని వాటి ఫలాలను అనుభవించవచ్చు. కిచెన్ కంపోస్ట్‌ లో అధిక మొత్తంలో నైట్రోజన్ ఉంటుంది. మొక్కలు పచ్చగా, ఆరోగ్యంగా పెరిగేందుకు నైట్రోజన్ బాగా ఉపయోగపడుతుంది.ఒకవేళ మన ఇంటిలో సరిపడినంతగా కిచెన్ వేస్ట్‌ లభించకపోతే.. సమీపంలో ఉండే కూరగాయల షాపుల్లో బయట పడేసిన కూరగాయలు, ఆకుకూరల వేస్ట్‌ తెచ్చుకుని వాడుకోవచ్చు. కిచెన్ వేస్ట్ డీ కంపోస్ట్ లిక్విడ్‌ తో పెరట్లోని, టెర్రస్ మీద పెంచుకునే మొక్కలను పచ్చగా, బలంగా ఎదిగేలా చేసుకోవచ్చు. ఈ మొత్తం ప్రాసెస్‌ లో ఎక్కడా రసాయనాల వినియోగం ఉండదు. ఇలా పండించుకున్న ఆకు, కాయగూరలు, పండ్లతో మన ఆరోగ్యం మరింతగా మెరుగవుతుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here