సహజసిద్ధ విధానంలో ఆర్గానిక్ పంటలు పండించాలనే ఔత్సాహికులు ఏటేటా పెరుగుతున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయంలో నేలకు బలం చేకూర్చేదిగా మనకు తరచు వినిపించే మాట వర్మీ కంపోస్ట్‌. వర్మీ కంపోస్ట్‌ ఒక్కటి వేసుకున్నా భూమి సారవంతం అవుతుంది. వర్మీ కంపోస్ట్ కు కల్చర్స్‌ అంటే.. ట్రైకో డెర్మా, ఫాస్పో పవర్‌, హ్యూమిక్ యాసిడ్‌, సూడోమోనాస్‌, వేంపవర్, వేపపిండి, జీవామృతం అన్నీ కలిపితే రకాల పోషకాలు అందుతాయి. వర్మీ కంపోస్ట్‌ కు ఈ కల్చర్స్ కలిపి వరుసగా మూడేళ్లు భూమిలో వేసుకుంటే నేల పూర్తిగా సారవంతం అవుతుంది. ఆ తర్వాత వేసుకోవాల్సిన అవసరం లేకుండానే పంటలు చక్కగా పండుతాయి. ఆరోగ్యవంతమైన పంటలు మనకు అందుతాయి.ఇప్పుడు ఈ వర్మీ కంపోస్ట్‌ తయారీ విధానం, దాంట్లో కల్చర్సల్‌ ఏ మోతాదులో వేసుకోవాలో, వట్టిగా వర్మీ కంపోస్ట్‌ కొనుక్కుంటే ఎంత ఖరీదు ఉంటుంది? దానికి కల్చర్స్ కలిపితే ఎంతకు దొరుకుతుందనే విషయాలను హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని ఆదిభట్ల, శంషాబాద్‌ ఎయిర్ పోర్టు పరిసరాల్లో ఉన్న జ్యోతి ఆర్గానిక్ యూనిట్‌ యజమాని జ్యోతి నుంచి తెలుసుకుందాం. 12 ఏళ్లుగా జ్యోతి ఆర్గానిక్‌ యూనిట్లను పసుమాముల రోడ్డు తారామతిపేటలో, పెద్ద అంబర్ పేటలో, నాదర్ గుల్‌, ఆదిభట్ల టీసీఎస్ సమీపంలో జ్యోతి ఆర్గానిక్‌ యూనిట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వర్మీ కంపోస్ట్ కు ట్రైకో డెర్మా, ఫాస్పో పవర్‌, హ్యూమిక్ యాసిడ్‌, సూడోమోనాస్‌, వేంపవర్, వేపపిండి, జీవామృతం కలిపిన మిశ్రమాన్ని పంటలకు వేసుకుంటే పైరు ఏపుగా ఎదుగుతుంది, క్రిమి కీటకాలు ఆశించకుండా, పంట దిగుబడి అధికంగా వస్తుంది.ముందుగా వర్మీ కంపోస్ట్ తయారీ విధానం చూద్దాం. ఆవులు, గేదెల పేడను సేకరించి, దాన్ని ఆరుబయట నేలపై బెడ్‌ లా చేసుకోవాలి. ఎందుకంటే పచ్చిగా ఉండే పేడలో వేడి ఉంటుంది. దాంట్లో వానపాములు వేసినప్పుడు వేడికి చనిపోతాయి. ఇలా పల్చగా పరిచిన తర్వాత పేడలో ఉండే తడిని బట్టి ఎండలో వారం నుంచి 10 రోజుల పాటు ఆరబెట్టాలి. ఇలా ఆరిన పేడను షెడ్లలో నీడపట్టున బెడ్స్ గా వేసుకోవాలి. డ్రై చేసిన పేడలో వానపాములు వదిలిపెట్టాలి. వానపాములు బెడ్ పైవరకు వచ్చి పేడను తింటాయి. వానపాములు పేడను తిని అవి విసర్జించే పదార్థమే నాణ్యమైన వర్మీ కంపోస్ట్‌ అని జ్యోతి వివరించారు. అలాపేడ బెడ్‌ డ్రైగా అవుతుంది. ఈ బెడ్లను 40 నుంచి 50 రోజుల పాటు అలాగే ఉంచాలి. ఈ బెడ్లపై ఎండాకాలం అయితే రోజుకు రెండు మూడు సార్లు పైప్ తో నీరు ఇవ్వాలి. వర్మీకంపోస్ట్ బెడ్లు ఉన్న షెడ్లలోకి కొంగలు, పక్షులు వచ్చి వానపాములను తినకుండా చుట్టూ మెస్‌ బిగించుకోవాలి. ఈ బెడ్లు 40 నుంచి 50 రోజులయ్యేసరికి ఉండలు ఉండలుగా ఉండే పేడ డ్రై అవుతుంది. పేడ పొడిగా మారి, పేడ వాసన పోయి తేలికగా అవుతుంది.పేడ బెడ్లు తేలికగా మారి టీ పొడి మాదిరి తయారవుతుంది. అప్పటి నుంచి బెడ్లకు నీరు ఇవ్వడం ఆపేయాలి. ఆ బెడ్లను రేకులతో పై పొరను మెల్లగా తీసుకోవాలి. మెల్లిగా ఎందుకు తీయాలంటే దాంట్లో ఉండే వానపాములు రేకు తగిలి తెగిపోతాయి, చనిపోతాయి. పై పొరను జాగ్రత్తగా తీసుకుంటే దాని కింది పొర కంటే కిందికి వానపాములు వెళ్లిపోతాయి. తర్వాత మరో పొర డ్రై అవుతుంది. దాన్ని కూడా అలాగే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. తేలికగా అయిన వర్మీ కంపోస్ట్ లోనే పానపాముల గుడ్లు ఉంటాయి.పొరలు పొరలుగా తీసుకున్న వర్మీ కంపోస్ట్‌ ను ఒక జాలీలో పోసి ఫిల్టర్ చేయాలి. దీంతో మెత్తని వర్మీ కంపోస్ట్ కిందకు దిగుతుంది. దాంట్లో ఉంటే రాళ్లు, రప్పలు, పెంకులు లాంటి వ్యర్థ పదార్థాలు ఒక పక్కన పడతాయి. ఇలా ఫిల్టర్ చేసి, సిద్ధం చేసిన వర్మీ కంపోస్ట్‌ ను కుప్పలా పోసి దానికి మళ్లీ నీరు ఇవ్వాలి. దీన్ని రైతులు నేరుగా వ్యవసాయానికి వాడుకోవచ్చు. ఈ వర్మీ కంపోస్ట్‌ ను 40 కిలోల చొప్పున సంచుల్లో నింపి రూ.260 చొప్పున జ్యోతి ఆర్గానిక్ యూనిట్‌ విక్రయిస్తోంది.వర్మీ కంపోస్ట్‌ తో సబ్ స్టిట్యూట్స్‌ ట్రైకో డెర్మా, ఫాస్పో పవర్‌, హ్యూమిక్ యాసిడ్‌, సూడోమోనాస్‌, వేంపవర్, వేపపిండి, జీవామృతం కలిపితే భూమికి కావాల్సి అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఒక టన్ను వర్మీ కంపోస్ట్‌ కు వేంపవర్‌, ట్రైకో డెర్మా, సూడోమోనాస్ రెండు రెండు కిలోల చొప్పున, హ్యూమిక్ యాసిడ్ ఒక కిలో, వేప పిండి 40 కిలోలు కలిపితే భూమికి అవసరమైన అన్ని రకాల పోషకాలు సమపాళ్లలు అందుతాయి. కల్చర్స్ అన్నీ కలిపిన 40 కిలోల వర్మీ కంపోస్ట్‌ రూ.350 కి తాము విక్రయిస్తున్నట్లు జ్యోతి చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండిన వేపకాయలు అంతగా లభించవు. వాటిని ఒడిశా, ఛత్తీస్‌ గఢ్ రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. వేపపిండి వేయడం వల్ల మొక్క నేలలో ఉన్నప్పటి నుంచే డిసీజ్ రాకుండా రక్షిస్తుంది. ఎవరైనా రైతులు వేపపిండి కావాలంటే 40 కిలోల బస్తా రూ.1500కు తమ వద్ద లభిస్తుందని జ్యోతి తెలిపారు. జ్యోతి ఆర్గానిక్ యూనిట్‌ లో వర్మీ కంపోస్ట్, కల్చర్స్ కలిపిన వర్మీ కంపోస్ట్‌, ఒరిజినల్‌ వేపపిండి, కోకోపిట్‌, పాటింగ్ మిక్స్‌, రెడ్‌ సాయిల్‌, వానపాములు కూడా అందజేస్తామన్నారు. వానపాములు కిలో రూ.500 కు ఇస్తామన్నారు.బత్తాయి, దానిమ్మ, నిమ్మ, మామిడి లాంటి ఎక్కువ కాలం జీవించే పండ్ల మొక్కలను నాటుకునే సమయంలో భూమిలో 3 కిలోల వర్మీ కంపోస్ట్‌ వేసుకోవాలి. ఒకవేళ అప్పటికే నాటుకుని ఉన్న మొక్కలకు వర్మీ కంపోస్ట్ వేయాలంటే ఆ మొక్క వయస్సు కన్నా ఒకటి, రెండు కిలోలో ఎక్కువ వేసుకుంటే మంచిదని జ్యోతి చెప్పారు. ఎదిగే మొక్క కాబట్టి ఐదారు ఏళ్ల పాటు ఎక్కువగా పీల్చుకుంటుంది కనుక వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి. మొక్కకు నష్టం కలిగించేవి ఏవీ వర్మీ కంపోస్ట్ లో ఉండవు కాబట్టి కాస్త ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఉండదు. కూరగాయలు, మిర్చి లాంటి స్వల్ప కాలిక పంటలకైతే దుక్కి దున్నేటప్పుడే భూమిలో ఎకరానికి 10 నుంచి 15 బస్తాల వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు. మిర్చికి అయితే.. పూత వచ్చే దశలో మొక్క చుట్టూ ఒకసారి 100 గ్రాముల వర్మీ కంపోస్ట్ వేసుకోవాల్సి ఉంటుంది.రెండేళ్లు క్రమం తప్పకుండా దుక్కి దున్నేటప్పుడే వర్మీ కంపోస్ట్‌ వేసుకుంటే.. మూడో ఏట నుంచి వేయాల్సిన అవసరం ఉండదని జ్యోతి వివరించారు. అంటే అప్పటికే ఆ భూమిలో వానపాములు పెరుగుతాయి కనుక సారవంతం అవుతుందన్నారు. కల్చర్స్ వల్ల భూమిలో ఉండే భాస్వరం, నత్రజనిని కరిగించి మొక్కలకు సరిపడా అందేలా చేస్తాయి. వర్మీ కంపోస్ట్ వేసిన తర్వాత బలం సరిపోవడం లేదని భావించి, రసాయన ఎరువులు వేసే తప్పు చేయొద్దని జ్యోతి హెచ్చరించారు. రసాయన ఎరువులు వేస్తే.. వర్మీ కంపోస్ట్ ద్వారా భూమిలో పెరుగుతున్న వానపాములు చనిపోతాయని చెప్పారు.

ఆర్గానిక్ ఎరువులు వాడితే ఖర్చు తక్కువ అవుతుంది, పంట దిగుబడి బాగా పెరుగుతుంది. భవిష్యత్‌ తరాలకు మంచి నేలను అందించినట్లు ఉంటుంది.

మరింత సమాచారం కోసం 9398867396 నంబరులో జ్యోతి ఆర్గానిక్ సంస్థను సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here