మన దేశంలో సుమారు 80 శాతం మంది మాంసాహారులు. వారిలో గొర్రె మాంసాన్ని ఇష్టంగా తినేవారు అధికశాతం మంది ఉంటారు. ఎక్కువ డిమాండ్‌ ఉండడంతో గొర్రెల్ని వాణిజ్యపరంగా విజయవంతంగా పెంచుతూ విజయాలు సాధించిన రైతుల మనకు ఎందరో కనిపిస్తారు. దేశంలో నాగరికత మొదలైన తొలి రోజుల్లో శతాబ్దాలుగా గొర్రెల పెంపకం వృత్తిగా ఉంటూ ఉంది. పొలం లేని రైతులకు గొర్రెల పెంపకం ఒక చక్కని ఆదాయ వనరుగా ఉంటోంది. గొర్రెల పెంపకం ద్వారా మాంసాన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా వాటి నుంచి పాలు, ఫైబర్‌, చర్మం లాంటివి కూడా మనకు లభిస్తాయి. వాటితో పాటు గొర్రెల పెంటను ఎరువుగా వినియోగించడం ద్వారా పంట దిగుబడులు మరింత అధికంగా వస్తాయి. గొర్రెల పెంపకంతో ఇన్ని విధాల లాభాలు ఉంటాయి కనుకే వాటి పెంపకం పట్ల శతాబ్దాలుగా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.

గొర్రెల పెంపకంలో అలాంటి ఆసక్తి కలిగి చక్కని లాభాలు ఆర్జిస్తున్న తెలంగాణకు చెందిన రైతు సక్సెస్‌ స్టోరీ తెలుసుకుందాం. జగిత్యాల జిల్లా రైకాల్‌ మండలం వీరాపురం గ్రామానికి చెందిన చందు మూడేళ్లుగా ఉస్మానాబాదీ జాతి గొర్రెల పెంపకంతో మంచి లాభాలతో విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాడు. అయితే.. గొర్రెల పెంపకంలో ఏమాత్రం అనుభవం లేక తొలి రోజుల్లో చందు చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ పట్టుదల వదలకుండా కాల క్రమేణా గొర్రెల పంపకంలో మంచి అనుభవం సంపాదించాడు. ప్రస్తుతం చందు గొర్రెల యజమానిగా ఏటా ఐదు లక్షల రూపాయల లాభం ఆర్జిస్తున్నాడు.పచ్చని చెట్ల ఆకులు, పొలాల్లో, పచ్చికబయళ్లలోని పచ్చగడ్డి మేకలు, గొర్రెలకు ప్రధానం ఆహారం. అందుకే గొర్రెలు, మేకల్ని వాటి యజమానులు పచ్చికబయళ్లలో వదిలిపెడతారు. గొర్రెలు, మేకలు తినే ఆహారం ఎలాంటి రసాయనాలు వాడని సహజసిద్ధమైన ఆహారమే. అందుకే గొర్రెల పెంపకానికి పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక గొర్రెలకు మేత కోసం పచ్చికబయళ్లను సొంతంగా కూడా నిర్వహించుకోవచ్చు. వాటిని కూడా కొంత నేలను కొన్ని మడులుగా చేసుకుని, కొద్దికొద్దిగా విరామం ఇస్తూ.. ప్రత్యేకంగా మడులను నిర్వహించేకుంటే.. జీవాలకు నిరంతరం మేతను అందించవచ్చు. ఒక మడిలో పచ్చిక అయిపోగానే మరో మడిలోకి వాటిని మేత కోసం వదలవచ్చు. ఇలా ఒక మడి తర్వాత మరో మడిలో గొర్రెలను మేపడం ద్వారా వాటి ఆరోగ్యానికి హాని కలిగించే క్రిములను దరిచేరనివ్వకుండా నివారించుకోవచ్చు. అంతే కాకుండా పచ్చిక బయళ్లను సొంతంగా నిర్వహించడం ద్వారా ఏడాది పొడవునా గొర్రెలకు చక్కని నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించవచ్చు. పచ్చికబయళ్లలో ముందుగా గొర్రెపిల్లల్ని మేత కోసం వదిలి, అవి తినగా మిగిలిన పచ్చికలోకి ఎదిగిన గొర్రెల్ని వదిలితే..  మడిలోని పచ్చికను పూర్తిగా తింటాయని చందు వివరిస్తున్నాడు.గొర్రెల్ని ఒకేసారి పెద్దమొత్తంలో కాకుండా కొద్ది కొద్దిగా వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతే లాభదాయకంగా ఉంటుందని చందు చెబుతున్నాడు. ఒకేసారి భారీ సంఖ్యలో గొర్రెల్ని పెంచితే.. ఒక్కసారిగా వాటికి మేత కోసం ఖర్చు వస్తుందని, అందుకే కొన్ని గొర్రెల నుంచి ఆదాయం రావడం మొదలైన తర్వాత మరికొన్నింటిని కలుపుకుంటే.. ఖర్చు కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన కష్టం ఉండదని అంటున్నాడు. అలాగే పెద్ద సంఖ్యలో ఒకేసారి గొర్రెల మందల్ని పెంచడం కూడా చాలా శ్రమ కూడా ఎక్కువే ఉంటుందంటున్నాడు. ఒకేసారి ఎక్కువ గొర్రెల్ని పెంచిన తొలి రోజుల్లో వాటికి భారీ స్థాయిలో ఆహారం అందించాల్సి వస్తుందని, ఆదాయం లేకుండా ఖర్చు ఎక్కువ చేయాల్సినప్పుడు వాటికి కాల్సినంత ఆహారం అందించలేని పరిస్థితి కూడా ఎదురయ్యే ప్రమాదం ఉందని చందు చెబుతున్నాడు. అలాగే.. రాత్రి పూటి వాటి కోసం భారీఎత్తున షెడ్లు నిర్మించేందుకు కూడా ఎక్కువ మొత్తమే ఖర్చు చేయాల్సి ఉంటుందని అంటున్నాడు. రోజూ వాటిని 3 నుంచి 5 గంటల పాటు పచ్చియ బయళ్లలో తిరగనివ్వాల్సి వస్తుందని, దాంతో వాటి ఆహారం కోసం మరింత అధికంగా ఖర్చు భరించాల్సి వస్తుందని చందు హెచ్చరిస్తున్నాడు. తొలుత 50 గొర్రెల్ని పంచడం ప్ఆరంభించి అంచెలంచెలుగా 350 వరకు పెద్దగా గొర్రెల మందల్ని పెంచుకుంటూ వెళ్తే మంచిదంటున్నాడు.

గొర్రె పిల్లలకు మనం సొంతంగా మడుల్లో పెంచిన పచ్చికను ఆహారంగా ఇవ్వాలని చందు చెబుతున్నాడు. ఆ గొర్రెలు ఎదిగి, మాంసం వినియోగానికి, పాలు ఇవ్వడానికి రెడీ అయినప్పుడు చక్కని లాభాలు కళ్ల జూడొచ్చంటున్నాడు. గొర్రిపాల డెయిరీ నిర్వహించాలనుకుంటే ఆరుబయట అవి పూర్తిగా తిరగకుండా పరిమిత స్థలంలోనే ఉండేలా చేయడం, లేదా పూర్తిగా షెడ్ల కిందే పెంచడం ఎంతో మేలు అంటున్నాడు. వాణిజ్య విధానంలో 50 నుంచి 350 గొర్రెలతో పాల డెయిరీ నిర్వహించాలనుకునే వారికి ఇది ఎంతో మెరుగైన విధానం అని చెబుతున్నాడు.గొర్రెల్ని పెంచాలనుకునేవారు సిరోహి, బార్బరీ, బెంగాలీ, జమ్నాపురి జాతుల కంటే.. ఉస్మానాబాదీ రకాన్ని ఎంపిక చేసుకుంటే.. మేలు అని చందు చెబుతున్నాడు. ఎందుకంటే.. ఉస్మానాబాదీ గొర్రెలు ఈతకు కనీసం రెండు పెల్లలకు జన్మనిస్తుంటాయి. ఉస్మానాబాదీ జాతి గొర్రె రెండేళ్ల కాలంలో కనీసం 3 సార్లు పిల్లల్ని కంటాయి. దీంతో గొర్రెల మంద అతి తక్కువ కాలంలోనే వేగంగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా ఆదాయమూ ఎక్కువగా వస్తుందనేది చందు అనుభవంతో చెబుతున్న మాట. ముందుగా ఎదిగిన 30 గొర్రెల నిర్వహణ ప్రారంభించిన చందు 3 నెలల్లోనే అవి ఈత ఈనిన తర్వాత పిల్లతో కలిపి 45 గొర్రెల మంద తయారైందని చెప్పాడు. నిజానికి ఉస్మానాబాదీ గొర్రెల్లో ఎదుగుదల చాలా త్వరగా కూడా ఉంటుందని అంటున్నాడు. అంతే కాకుండా అధిక పోషక విలువలతో పాటు ఉస్మానాబాదీ గొర్రెల మాంసం మంచి రుచిగా ఉంటుందని, అందుకే తెలుగు రాష్ట్రాల్లోని మాంసామార ప్రియులు వీటి మాంసం అంటే ఎక్కువగా ఇష్టపడతారని చందు వెల్లడించాడు.

తొలిసారిగా గొర్రెల పెంపకం ప్రారంభించినప్పుడు చందు వాటి కోసం ఏర్పాటు చేసిన 40X20 అడుగుల షెడ్‌ నిర్మించడానికి 2 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపాడు. గొర్రెల కోసం షెడ్‌ నిర్మించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు చందు సూచించాడు. ఎందుకంటే.. నాణ్యమైన షెడ్‌ వేస్తే.. అధిక ఎండ వేడి నుంచి, వర్షం నుంచి గొర్రెలకు రక్షణ కలుగుతుంది. తద్వారా అవి మరింత త్వరగా ఎదిగేందుకు వీలవుతుందని చెప్పాడు. వ్యాధులకు గొర్రెలు చాలా త్వరగా గురవుతుంటాయి. అందుకే మరింత ఎక్కువ శ్రద్ధగా, జాగ్రత్తగా  గొర్రెల్ని పెంచాల్సి ఉంటుందని అంటున్నాడు.ఆడ గొర్రెలకు సంతాన వృద్ది సమయంలో జొన్న, ఖనిజ మిశ్రమం, పప్పుల పొడి, వేరుశెనగ పిండి, ఉప్పు, ఇంకా పలు రకాల ఎంపిక చేసిన ధాన్యాలను కలిపి ఆహారంగా అందజేయాలని చందు వివరించాడు. చూడితో ఉన్నప్పటి నుంచి ఆడగొర్రె పిల్లల్ని ఈని, వాటికి పాలివ్వడం ముగిసే వరకు తాను ప్రతి రోజు 200 గ్రాముల మిశ్రమాన్ని అందజేస్తానని చెప్పాడు. ఇలాంటి ఆహార మిశ్రమాన్ని అందిస్తే.. గొర్రెపిల్లలకు రోగాలు దరిచేరకుండా ఇమ్యూనిటీ వస్తుందని, బలంగా కూడా తయారవుతాయని వెల్లడించాడు. గొర్రెలకు ఉదయం పూట ఎండబెట్టిన సోయాతో కూడిన ఆహారం అందిస్తే.. గొర్రెలు ఎక్కువ నీరు తాగుతాయని, దాంతో వాటి జోలికి రోగాలు దరిచేరవని, దరిమిలా ఆరోగ్యంగా ఉంటాయని తెలిపాడు. ఇక గొర్రెలకు దుకాణాల్లో లభించే అత్యధిక పోషకాలతో కూడిన హెడ్గే లాసెర్న్‌స్‌, సూపర్‌ నేపియర్‌ అనే రెండు రకాల విత్తనాలతో పొలంలో పెంచే మేతను ప్రధాన ఆహారాన్ని చందు అందిస్తాడు. ఇలాంటి ప్రధాన ఆహారాన్ని 50 గొర్రెలకు అందించాలంటే.. రెండు ఎకరాల్లో వేసుకుంటు సరిపోతుందంటాడు. ఆడగొర్రె  పిల్లల్ని పెట్టిన తర్వాత సరైన రీతిలో సక్రమమంగా ఆమారం అందిస్తే.. తర్వాతి ఐదు నెలల్లో మరోసారి చూడి అయ్యే అవకాశం ఉందని చందు చెప్పాడు. సాధారణంగా ఒక్కో ఈతకు ఉస్మానాబాదీ గొర్రె రెండేసి పిల్లలకు జన్మనిస్తుందని, ఒక్కోసారి మూడు పిల్లలకు కూడా జన్మనిచ్చే అవకాశం ఉందన్నాడు. కొత్తగా పుట్టిన గొర్రె పిల్లల్ని మరింత జాగ్రత్తగా సాకుతుండాలని చెప్పాడు. పిల్లలు పుట్టిన ఒకటి రెండు గంటలోగా తల్లి నుంచి వచ్చే మంచి పోషకాలతో కూడిన మురిపాలు తప్పకుండా తాగించాలని వెల్లడించాడు. ఒకటి రెండు గంటల్లోగా తల్లి నుంచి మురిపాలు తాగిస్తే.. ఆ పిల్లలు బలంగా ఉంటాయని, వ్యాధులు దరిచేరనివ్వకుండా మంచి ఇమ్యూనిటీ ఉంటుందని తెలిపాడు.గొర్రె పిల్లలు పరిపక్వత చెందడానికి 11 నెలలు పడుతుందని, ఆ తర్వాత 5 నెలల నుంచి సంతానోత్పత్తికి సిద్దం అవుతాయని చందు వివరించాడు. గొర్రెపిల్లా ఎదిగి 30 కిలోల బరువు వచ్చినప్పటి నుంచి విక్రయించుకోవచ్చన్నాడు. చందు ఆడ గొర్రెల్ని బ్రతికి ఉన్నవి ఉన్నట్లు విధానంలో కిలో రూ. 350 చొప్పున, మగ గొర్రెల్ని రూ.400 చొప్పున విక్రయిస్తాడు. అలా 30 కిలోల బరువుండే ఒక్కో ఆడ గొర్కెకు రూ.10,500, మగ గొర్రెకైతే రూ.12 వేలు ఆదాయం వస్తుంది. అలా తనకు ఒక్కో బ్యాచ్‌ నుంచి రూ.5 లక్షలు ఆదాయం లభిస్తోందని చందు వివరించాడు. అలా గొర్రెల పెంపకం ప్రారంభించినప్పటి నుంచి మూడేళ్లలో గొర్రెల సంఖ్య బాగా పెరగడమే కాకుండా ఆదాయం కూడా ఊహించనంత వస్తుందని తెలిపాడు.

వివిధ రకాలుగా ఆదాయం అందించే గొర్రెల పెంపకం రైతులకు ఎంతో ప్రయోజనకరమైన, ఆచరణీయమైన వృత్తి అని చెప్పవచ్చు. గొర్రెల్ని వాణిజ్యపరంగా పెంచుకుంటే మరింత అధిక ఆదాయం వస్తుందనడంలో సందేహం లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here