టెర్రస్‌ మీద కూడా చక్కని ఫలాలు అందించే వెరైటీల గురించి తెలుసుకుందాం. కుండీల్లో వేసుకున్నా చక్కగా గెలలు వేసే రకం షార్ట్‌ అరటి. అత్యంత పొట్టి బనానాల్లో ఇదొక వెరైటీ. మరో రకం ఆర్నమెంట్‌ బనానా. ఈ చెట్టు కాయలు తినడానికి పనికిరావు. కాకపోతే.. అందంగా అలంకరణ కోసం ఉపయోగపడతాయి. ఈ చెట్టు అరటి పువ్వు కలువపువ్వులా ఉంటుంది. మొత్తం పువ్వు నుంచి రేకులు రాలిపోవడానికి రెండు మూడు నెలలు పడుతుంది. ఆర్నమెంట్‌ బనానా ఆకు సాధారణ అరటి ఆకు కన్నా మందంగా ఉంటుంది. ఇంకో అరటి రకం.. దాని పువ్వు తామరపువ్వు మాదిరిగా ఉంటుంది. దాని రేకులు ముదురు పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. ఇది అలంకరణ కోసం వినియోగిస్తే అందంగా ఉంటుంది. అరటి పండ్లు, కాయల కోసం పెంచే అరటిలో అయితే.. పెద్ద చెట్టు చుట్టూ వచ్చే పిలకలను తీసేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ రకం అరటి చుట్టూ ఎన్ని పిలకలువచ్చినా పెరగనివ్వవచ్చు. ఈ అరటిమొక్క ఆకులు ఎన్ని వస్తే.. అన్నింటినీ మనం భోజనాలు చేసేందుకు, శుభకార్యాల్లో అందంగా అలంకరించేందుకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ అరటి ఆకుతో ‘నో ప్లాస్టిక్‌’ నినాదం చెప్పొచ్చు. దీని కాయలు కూడా తినేందుకు పనికిరావు.పొట్టి అరటిలోనే మరో వెరైటీ ట్విన్స్ బనానా. సాధారణ అరటిచెట్టుకు ఒకే గెల వస్తే.. ట్విన్స్‌ అరటి మొక్కకు రెండు గెలలు రావడం దీని విశేషం. ఈ వెరైటీ అరటి ఆకు కూడా కాస్త దళసరిగా ఉంటుంది. తొమ్మిది నెలల్లోనే ఈ వెరైటీ పంట ఇస్తుంది. జీ నైన్‌ అరటిపండ్ల మాదిరిగా దీని పండ్లు ఉంటాయి. మరో వెరైటీ అరటిచెట్టు ఆకుపైన చక్కని డిజైన్‌ ఉంటుంది.ఇప్పుడు వాటర్ యాపిల్‌ మొక్కల వివరాలు చూద్దాం. వీటిని లాంగ్‌ రెడ్‌ యాపిల్ అంటారు. లాంగ్ రెడ్‌ యాపిల్‌ పండులో విత్తనాలు ఉండవు. ఈ యాపిల్‌ పండు చూడ్డానికి అందంగానే కాకుండా మంచి రుచిగా కూడా ఉంటుంది. ఉడ్ యాపిల్ అనే మరో రకం ఉంది. అంటే వెలగకాయ మాదిరిగా ఉంటుంది. ఇది కూడా పొట్టి వెరైటీయే. ఈ థాయ్‌ లాండ్‌ ఉడ్‌ యాపిల్‌ ఆకు సోంపు వాసనతో ఉంటుంది. ఈ చెట్టుకు ముళ్లు ఉండవు.అంగెన్‌ మొక్కలు. ఎయిర్‌ లేయరింగ్‌ అంటే గాల్లోనే అంటు కట్టుకునే విధానం ద్వారా వీటిని సిద్ధం చేసి, నేల మీద పెంచుకోవచ్చు. విత్తనాలు నాటుకుని కూడా అంగెన్‌ మొక్కల్ని పెంచవచ్చు. అయితే.. ఈ విధానంలో పెంచితే పంట రావడం కాస్త ఆలస్యం అవుతుంది. ఎయిర్‌ లేయరింగ్ విధానం ద్వారా వీటిని పెంచుకుంటే.. త్వరగా పంట వస్తుంది.పొట్టిచెట్టు రకం జామ గురించి చూద్దాం. ఎయిర్‌ లేయరింగ్‌ ద్వారా వీటిని తయారు చేస్తారు. దీని పేను జపనీస్ రోజ్‌ అంటారు. ముదిరిన జామ కొమ్మ నుంచి జపనీస్ రోజ్‌ రకం జామ మొక్కల్ని అంటు కడతారు. అంటుకట్టిన సంవత్సరంలో దీన్ని కుండీల్లో వేసుకుని పెంచుకోవచ్చు.  లాంగ్ వెరైటీ మల్బరీ పండు మెరూన్‌ రంగులో ఉంటుంది. టర్కీ లాంటి దేశాల్లో లాంగ్‌ మల్బరీ పండు నుంచి వైన్‌ తయారు చేస్తారు. ఈ పండు రుచి  కూడా తేనెలా తియ్యగా ఉంటుంది. నాటుకున్న ఐదేళ్లలోనే ఈ మల్బరీ పండు గుబురుగా ఐదు అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. ఈ చెట్టును ద్రాక్ష తోట మాదిరిగా మనకు కావలసిన విధంగా డిజైన్ చేసుకోవాలి. దీని కొమ్మలు పొడవుగా ఎదుగుతాయి. కొమ్మల్ని మనకు కావాల్సినవి ఉంచుకుని, మిగతా వాటిని కత్తిరించాలి. అప్పుడు ఈ. పండ్లు కోసుకోవడం సులువు అవుతుంది.ఇక డ్రూపింగ్ మేంగో రకం సంగతి చూద్దాం. తెలుగులో దీన్ని పందిరి మామిడి అంటారు. ఈ మామిడి చెట్టుకు ఆధారం కోసం పందిరి వేయాల్సి ఉంటుంది. చెట్లన్నీ పైకి పెరిగితే.. డ్రూపింగ్ మేంగో మాత్రం కిందకు పెరుగుతుంది. అంటే దీని కొమ్మలు కిందకు వంగి పెరుగుతాయి. డ్రూపింగ్ మ్యాంగో సీజన్ లేనప్పుడు కూడా పునాసకాపు కాస్తుంది. ఈ మామిడికాయతో పెట్టుకునే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ మామిడికాయ పులుపు మిగతా మామిడి కాయలన్నా కాస్త డిఫరెంట్‌ గా ఉంటుంది. ఇది పండితే మాత్రం ఎంతో తీయ్యగా ఉంటుంది. అంటు కట్టిన సంవత్సరంలోనే కాయలు కూడా వస్తాయి.థాయ్‌ నిమ్మ రకం సంవత్సరంలో తొమ్మిది నెలల పాటు ఎక్కువసార్లు కాయలు కాస్తూనే ఉంటుంది. ఈ రకం నిమ్మ పది కాయలు కిలో బరువు తూగుతాయి. దీన్ని చూస్తూ బత్తాయి అనుకుంటాం. కాయ తయారైనప్పుడు చక్కని పసుపు రంగులోకి మారుతుంది.ఇలాంటి పొట్టి రకాల పండ్ల మొక్కల్ని మత తోటలోనూ, మిద్దె తోటలో కూడా పెంచుకోవచ్చు. పాత ప్లాస్టిక్‌, రేకు డబ్బాల్లో కూడా పొట్టిరకం మొక్కల్నిపెంచుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here