వ్యవసాయ విషయాలు, పంటల సాడుబడిలో విజేతలు, సాగు విధానాల నుంచి కాసేపు ఆట విడుపు విషయం తెలుసుకుందామా!? ఇది కూడా ఆదాయాన్నిచ్చే అంశమే… కాకపోతే కాస్త ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. అందులోనూ ఇంటిపట్టున ఉండే గృహిణుల చేతికి ఆదాయం తెచ్చెపెట్టేది.. ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కూడా కలిగించేది. అదే ‘ఆర్నమెంటల్‌ ఫిష్‌ ఫార్మింగ్’ అంటే.. అక్వేరియంలలో ఎందరో ఎంతో ఇష్టంతో పెంచుకునే చిన్న చిన్న చేపపిల్లల పెంపకం, విక్రయం అన్నమాట. ఇంటికి అందాన్నిచ్చేది, అలంకరణలో భాగంగా ఇంట్లో ఉంచుకునేది కనుక దీనికి ఆర్నమెంట్‌ ఫిష్‌ అనే పేరు వచ్చింది.

బాబ్లీ మండల్‌.. ముప్పై ఏళ్ల గృహిణి. పశ్చిమ బెంగాల్‌ లోని కుల్తలి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ చిన్న గ్రామంలో నివసిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌ కతాకు 75 కిలో మీటర్ల దూరంలో ఉండే పొడవైన సుందర్‌ బన్‌ మడ అడవుల్లో ఒక భాగం కుల్తలి. బాబ్లీ మండల్‌ భర్త వ్యవసాయం, చేపల పెంపకం ద్వారా అతి తక్కువ ఆదాయం సంపాదించగలుతున్నాడు. దీంతో బాబ్లీ మండల్‌ కుటుంబ అవసరాల కోసం మరింత ఆదాయం సంపాదించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బాబ్లీ మండల్‌.. సెంట్రల్‌ ఐలాండ్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐసీఏఆర్‌- సీఐఎఫ్‌ఆర్‌ ఐ) సహకారంతో ఆర్నమెంటల్‌ ఫిష్‌.. అదేనండి.. అక్వేరియంలలో పెంచుకునే చిన్న చిన్న రంగు రంగుల చేప పిల్లల పెంపకం ప్రారంభించింది.2021 నవంబర్‌ లో బాబ్లీ మండల్‌ సీఐఎఫ్‌ఆర్‌ ఐ నుంచి 20 ఆర్నమెంటల్‌ చేప పిల్లల్ని తీసుకొచ్చి, తమ ఇంటి టెర్రస్‌ మీద ఎంతో శ్రద్ధగా పెంచడం మొదలు పెట్టింది. కొన్ని నెలల్లోనే ఆ 20 చేపపిల్లల సంఖ్య 500 వరకు పెరిగిపోయింది. వాటిలో కొన్ని అలంకరణ లాభం వచ్చింది. అంటే.. ఆమె చేపపిల్లల్ని కొనడానికి, వాటిని పెంచడానికి పెట్టిన ఖర్చులు పోగా ఈ లాభం కళ్ల జూసింది. తొలిసారి పెట్టిన పెట్టుబడితోనే లాభం చవిచూసి బాబ్లీ మండల్‌ మరింతగా తన ఆర్నమెంట్‌ ఫిష్‌ ఫాంను విస్తరించింది. అదే క్రమంలో ఆమె ఆదాయమూ, లాభం కూడా పెరిగింది. ఊరికే ఇంట్లో కూర్చోకుండా ఆడుతూ పాడుతూ తాను చేసిన చిన్న కృషితో తన కుటుంబం చాలా సంతోషంతో ఉందని బాబ్లీ మండల్‌ చిరునవ్వుతో చెబుతోంది.సాధారణ చేపల్ని పెంచే రైతులు కిలోకు 100 నుంచి 150 రూపాయలకు అమ్ముతుంటారు. అయితే.. రకరకాల సైజులు, రంగుల్లో ఉండే ఒక్కో ఆర్నమెంటల్‌ ఫిష్‌ కు కనీసం 1,000 రూపాయలు పలుకుతోంది. చిన్న చిన్న, అక్వేరియంలు, ఇతర నీటి వ్యవస్థల్లో వివిధ రకాల ఆర్నమెంట్‌ ఫిష్‌ లను పెంచుకోవాలి. ఆర్నమెంటల్ చేపల పెంపకం ప్రపంచ వ్యాప్తంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఆర్నమెంట్‌ ఫిష్‌ ల ఎగుమతి ద్వారా రూ.10.84 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం సంపాదించింది. ఈ మూడేళ్లలో ఆ ఆదాయం మరింతగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.  అంటే.. ఆర్నమెంట్‌ ఫిష్‌‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉందో తెలుస్తోంది. ప్రపంచ మార్కెట్లో ఆర్నమెంట్‌ ఫిష్‌ ల ఎగుమతుల్లో భారతదేశం వాటా 0.4 శాతం ఉందని మత్స్యశాఖ విభాగం వెల్లడించింది. ఆర్నమెంట్ ఫిష్‌ లు ఎక్కువగా ఎగుమతి చేస్తున్న సింగపూర్‌ అగ్రస్థానంలో ఉంది.ఆర్నమెంట్ ఫిష్‌‌లు రెండు రకాలు. గుడ్లు పెట్టే చేపలు ఒక రకమైతే.. నేరుగా పిల్లల్ని పెట్టేవి మరో రకం. గుడ్లు పెట్టే ఆర్నమెంట్‌ చేపలు అక్వేరియం గాజు గోడల మీద లేదా అక్వేరియంలో ఉండే చిన్న చిన్న మొక్కల మీద గుడ్లు పెడతాయి. కొన్ని చేపలు బ్యాచ్‌ ల వారీగా పిల్లల్ని పెడతాయి. ఇలా పుట్టిన చేపపిల్లల పెంపకం చాలా సులభం. ఆర్నమెంట్ చేప పిల్లల పెంపకంలో బాబ్లీ మండల్‌ ముందుగా శిక్షణ తీసుకున్నారు. అక్వేరియంలో పెంచే చేపపిల్లలు చాలా సున్నితంగా ఉంటాయి. ఉష్ణోగ్రతకు,  అందుకే వాటి పెంపకంలో, వాటిని పెంచే నీటి నాణ్యత, నీటిలో ఉండే పీహెచ్‌ అంటే ఆమ్లం, ఉప్పు గాఢతకు అవి చాలా వేగంగా ప్రభావితం అవుతాయి. అందుకే ఆర్నమెంట్‌ చేపపిల్లల పెంపకంలో ముందుగా సరైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.కుల్తలిలో 85 శాతం మంది ప్రజలు ఆర్థికంగా పేదలు. మగవారు కొన్ని పంట పండిస్తారు. టైగర్ రొయ్యలు సాగు చేస్తారు. కొందరు కూరగాయలు పండిస్తారు లేదా రోజువారీ కూలిపనులు చేసుకుంటారు. వారు నెల అంతా కష్టపడితే సగటున 6 నుంచి 8 వేల రూపాయలకు మించి ఆదాయం వచ్చేది కాదు. ఈ నేపథ్యంలో కుల్తలిలోని ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన సామాజికవర్గాల మహిళలు తమ పెరట్లోనో లేదంటే… టెర్రస్‌ మీద అయినా తప్పనిసరిగా ఆర్నమెంట్‌ చేపల పెంపకం చేస్తుంటారు. పెద్దగా కష్టం ఉండదు. అంతగా ఖర్చు కూడా ఉండదు. కానీ కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది. ఇంటి ఆదాయానికి ఆ మహిళల ఆదాయం కూడా తోడు అవుతుంది. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతుంది.కుల్తలి లోని 500 మంది మహిళలు ఆర్నమెంట్‌ చేపపిల్లల్ని పెంచేందుకు బారక్‌ పోర్‌ లోని ఐకార్‌- సీఐఎఫ్‌ఆర్‌ ఐ సంస్థ ఫైబర్‌ రీఇన్‌ ఫోర్స్‌డ్‌ ప్లాస్టిక్‌ (ఎఫ్‌ఆర్‌ పీ) ట్యాంకులు, చేప విత్తనాలు, ఫీడ్‌, లైమ్‌ ఇతర అవసరమైన పరకరాలను అందజేసింది. మారుమూల గ్రామాల్లోని మహిళలకు కూడా ఆర్నమెంట్‌ చేప పిల్ల పెంపకంలో ఆ సంస్థ క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తుంది. గుడ్లు పెట్టే, నేరుగా పిల్లల్ని పెట్టే రకాల చేపపిల్లల్ని ఐకార్‌ సీఐఎఫ్‌ఆర్‌ ఐ సంస్థ అందజేస్తుంది. వాటిలో గోల్డ్‌ ఫిష్, ఏంజెల్‌, కోయి కార్ప్‌ చేపలు గుడ్లు పెట్టే రకాలు. కాగా.. మొల్లీ, గుప్పీ, స్వార్డ్ టెయిల్‌ నేరుగా పిల్లల్ని పెడతాయి.

ఆర్నమెంట్‌ చేప పిల్లల పెంపకం మొదటి మూడు నెలలు చాలా కీలకం అనే చెప్పాలి. ఎందుకంటే చేప విత్తనాల కొనుగోలు, వాటి పెంపకానికి అయ్యే ఖర్చు ఉంటుంది. ఆ మూడు నెలలూ ఆదాయం ఉండదు. ఖర్చు తప్పదు. ఆ తర్వాతి నుంచి పిల్లల్ని అమ్మడం ద్వారా ఆదాయం వస్తుంది.

 

ప్రపంచ వ్యాప్తంగా పట్టణాలు, నగరాల్లో అక్వేరియంలలో ఆర్నమెంట్ చేపపిల్లల్ని పెంచుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అనేక మంది ఇళల్లో అలంకరణ కోసం అక్వేరియం చేప పిల్లల్ని పెంచుకుంటున్నారు. దాంతో అలంకరణ చేపలకు మార్కెట్‌‌ల ోమంచి డిమాండ్ ఉంది. అధిక ఆదాయం సంపాదించాలనుకునే మహిళలకు వ్యాపార పరంగా ఆర్నమెంట్‌ చేపపిల్లల పెంపకం లాభదాయకం. ఆహ్లాదాన్ని ఇచ్చేదిగా కూడా చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here