నేల మీద మొక్కలు పెంచితేనే పంట దిగుబడి ఎక్కువగా వస్తుందనుకుంటాం కదా! అయితే.. టెర్రస్ గార్డెన్‌ లో కుండీల్లో పెంచిన రకరకాల కూరగాయల మొక్కలు, పండ్లు, పూల మొక్కలు కూడా అధికంగా పంట ఇస్తాయి. గుత్తులు గుత్తులుగా కూరగాయలు, బుట్టలు బుట్టలతో పూలు కూడా మనం పొందవచ్చు. రెడ్ పొగడబంతి లాంటి అరుదైన ఎగ్జోటిక్‌ వెరైటీ మొక్కల్ని కూడా టెర్రస్ గార్డెన్‌ లో పెంచుకోవచ్చు. దేశీ రకాల పండ్లు, కూరగాయలు కూడా టెర్రస్ గార్డెన్‌ లో చక్కగా పెరుగుతాయి.ఆకర్షణీయంగా కనిపించే డబుల్‌ పెటల్ రంగూన్ క్రీపర్‌. చిన్న పాదుకి చాలా రుచిగా ఉండేపెద్ద సైజులో ఉండే కీర. రసాయనాలు, పురుగుమందులేవీ వాడకుండా ఆర్గానిక్ విధానంలో పండించుకునే ఈ కీరను నేరుగా పైన ఉన్న తొక్కతో సహా తినవచ్చు. ఎంతో ఆరోగ్యంగా పెరిగే స్ట్రాబెరీస్. మరీ ఎండ ఎక్కువ కాకుండా కొంచెం మాత్రమే ఎండ తగిలేలా చూసుకుంటే స్ట్రాబెరీ ఫ్రూటింగ్‌ బాగా వస్తుంది. గుత్తులు గుత్తులుగా కాసే గ్రీన్ బింగెడ్ బీన్స్‌. ఇవి చాలా రుచిగా ఉంటాయి. గ్రీన్‌ బింగెడ్ బీన్స్‌ పువ్వులు బ్లూ రంగులో ఉంటాయి. మంచి ఫైబర్‌ ఉండే గ్రాన్ బింగెడ్‌ బీన్స్‌ చాలా తేలికగా ఉంటాయి. గ్రీన్‌ బింగెడ్ బీన్స్‌ గ్రీన్‌, పర్పుల్ రంగుల్లో ఉంటాయి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అయితే.. బింగెడ్ బీన్స్‌ ముదిరక ముందే వండుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ముదిరిపోతే మాత్రం పీచు పదార్థం బాగా ఎక్కువైపోయి, ముక్కలుగా కోసుకోడానికి కూడా కుదరదు. ఇది కూడా పాదు జాతి మొక్కే. ఒక్క మొక్క పెట్టినా అనేక బీన్స్ ఇస్తుంది గ్రీన్‌ బింగెడ్‌ బీన్స్‌ పాదు.టెర్రస్‌ గార్డెన్‌ లో కుండీల్లో పెంచుకునే రకాల్లో సొరకాయలు కూడా బాగా ఉంటాయి. పెద్దగా తయారవుతాయి.  వెల్వెట్ బీన్స్ కూడా టెర్రస్ గార్డెన్‌ లో చాలా సులువుగా పెంచుకోవచ్చు. ఇవి కూడా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. వెల్వెట్ బీన్స్‌ లో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయి. వెల్వెట్ బీన్స్ గింజలను కూరగా వండుకుని నరాల బలహీనత, అల్జీమర్స్‌ లాంటి సమస్యలు తింటే తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది. టెర్రస్ గార్డెన్‌ లో పెంచుకోవడానికి మరో ఎగ్జోటిక్ వెరైటీ గురించి తెలుసుకుందాం. మొక్కజొన్నలు, స్వీట్ కార్న్‌ లాంటివి మన అందరికీ తెలిసిందే. కానీ బ్లాక్ కార్న్‌, వైట్ కార్న్‌ అనే రెండు రకాలు చక్కటి ఎగ్జోటిక్‌ వెరైటీలు.క్లోబీన్స్ ఫ్లవర్స్‌. ఇవి కూడా టెర్రస్ గార్డెన్ పెంచుకోడానికి అనువైనవే. ఈ పువ్వులు మార్నింగ్ గ్లోరీ మాదిరిగా కనిపిస్తాయి. ఇవి సాయంత్రం పూట మాత్రమే పూస్తాయి. మార్నింగ్ గ్లోరీ ఉదయం మాత్రమే పూస్తాయి. ఇవే ఈ రెండు వెరైటీల మధ్య ఉండే తేడా. ఈ తేడాను గుర్తుంచుకుంటే చాలు. చూసేందుకు లవంగ మొగ్గల మాదిరిగా ఉండే ఈ క్లోబీన్స్‌ గ్రీన్, పర్పుల్ కలర్స్‌ ఉంటాయి. క్లోబీన్స్‌ పాదు చాల మొండి రకం. పాదు మొదట్లో వచ్చిన కలుపుతో పాటు పొరపాటున క్లోబీన్స్ మొక్కను పీకేసి, మళ్లీ నాటుకుంటే.. కూడా అది చనిపోదు. మామూలుగానే మళ్లీ బతుకుతుంది. ఈ పాదును పెద్దగా కేర్ తీసుకోకపోయినా అధిక మొత్తంలో పూలు పూస్తుంది. పువ్వు పూసిన వారం రోజుల్లోనే క్లోబీన్స్ కాయగా మారిపోవడం దీని ప్రత్యేకత. క్లోబీన్స్‌ కూడా లేతగా ఉన్నప్పుడే కోసుకోవాలి. క్లోబీన్స్‌ ను ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ముదిరితే రుచి అంతగా బాగుండదు. మనం ఒకటి రెండు క్లోబీన్స్ పాదులు పెట్టుకున్నా.. దాని విత్తనాలు కుండీల్లో పడి అవి కూడా మొలుస్తాయి.టెర్రస్ గార్డెన్ పెంచుకునే మరో వెరైటీ. దేశీ రకం దోసకాయలు. బెండలో చాలా అరుదైన రకం కస్తూరి బెండ. కుండీల్లో కూడా ఈ రకం బెండ చాలా ఆరోగ్యంగా, పచ్చగా ఎదుగుతుంది. చూసేందుకు అందంగా కూడా కనిపించే కస్తూరి బెండలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయంటారు. కస్తూరి బెండకాయల్ని అప్పుడప్పుడైనా కూర వండుకుని తింటూ ఉంటే మనకు ఆరోగ్య ప్రయోజనాలు కలుతాయంటారు. మామూలు బెండ మొక్కలు ఒకసారి కాపు కాస్తే.. దాని పని అయిపోతుంది. కానీ కస్తూరి బెండ మాత్రం కాపు అయిన తర్వాత మల్లీ కొత్త చిగుళ్లు, పువ్వులు వచ్చి మళ్లీ మళ్లీ సంవత్సరం అంతా కాయలు కాస్తూనే ఉంటుంది.  స్టార్ బెండ అనే మరో రకం కూడా టెర్రస్ గార్టెన్ లో పెంచుకోడానికి అనువైనది. ఈ బెండకాయ సైజు పెద్దగా ఉంటుంది. రుచిగా కూడా ఉంటుంది.టెర్రస్ గార్డెన్‌ లో పెంచుకోడానికి చాలా అనువైన రకం స్ట్రాబెర్రీ రంగులో పువ్వులు ఉండే బొగడబంతి. దీన్ని గాంఫ్రెనా అంటారు. దీంట్లో పర్పుల్‌, పింక్‌, వైట్‌ రంగుల్లో కూడా బొగడబంతి పూలు ఉంటాయి. అయితే.. స్ట్రాబెర్రీ రంగులో ఉండే బొగడబంతి మాత్రం చాలా ప్రత్యేకమైనది. చైన్స్ ఆఫ్‌ ఫ్లోరీ ప్లాంట్. దీన్నే క్లెరాడెండ్రమ్‌ స్మితియానం అంటారు. పసుపు కుంకుమ ఫ్లవర్స్‌ అనే మరో రకం ఉంది. దీన్నే మిల్క్‌ వీడ్ అంటారు. ఈ మొక్క పువ్వుల నుంచి కాయలు కూడా వస్తాయి. ఈ సీడ్స్‌ ని గమనించకపోతే పగిలిపోయి, విత్తనాలు గాలికి ఎగిరిపోతాయి. పసుపు, కుంకుమ మొక్క పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఊకబంతి. ఇది పూర్వకాలం నుంచీ ఉన్న బంతి రకం. ఆరెంజ్‌, తెలుపు రంగుల్లో ఈ ఊకబంతి పూలు ఉంటాయి. వీటినే బియ్యం బంతి అని కూడా అంటారు.మరో రకం ఆకు సంపెంగ. ఇది ఒక్క పువ్వు పూసినా పరిసరాలు మొత్తం చక్కటి సువాసన వెదజల్లుతుంది. దీన్ని సుగంధ ద్రవ్యాల్లో వాడుతుంటారు. దీన్ని ఇంగ్లీషులో లాంగ్లాంగ్ అంటారు. ఆకు సంపెంగ చాలా అరుదైనది, అలాగే చాలా ఖరీదు కూడా ఉంటుంది. పత్తి మందారం ముందుగా కాస్త తెలుపు రంగులో ఉంటుంది, కొద్ది రోజులకు లైట్‌ గులాబీ రంగులోకి మారుతుంద. తర్వాత మరికాస్త ఎక్కువ పింక్ రంగులోకి ఇంకా ఉండే కొద్దీ అది పూర్తి డార్క్‌ పింక్ కలర్ అవుతుంది. వైట్, ఎల్లో, పింక్ కలర్ లో ఉండే నిత్య మల్లె కూడా టెర్రస్ గార్డెనింగ్ కు అనువైనదే. కేట్స్ క్లా క్రీపర్‌ అనే మరో రకం పువ్వుల తీగ ఉంది. దీని పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. పాదు నిండా పువ్వులు పూయడం దీని ప్రత్యేకత. నేల మీద పెంచితే దీన్నుంచి మరిన్ని ఎక్కువ పువ్వులు వస్తాయి. పాదు చిన్నగా ఉన్నా పువ్వులు మాత్రం పెద్ద సైజులో వస్తాయి.టెర్రస్ గార్డెన్‌ లో కుండీల్లో పెంచుకునేందుకు అనువుగా ఉండే పండ్లలో బత్తాయిలు కూడా ఒకటి. మామూలుగా అయితే.. వీటిని భూమిలో పెంచితేనే దిగుబడి ఎక్కువ ఇస్తాయి. కుండీల్లో పెంచినా వాటి దిగుబడి అధికంగానే ఉంటుంది. మరో రకం పండ్లు కూడా టెర్రస్ గార్డెన్ లో పెంచుకోవచ్చు. అవే స్టార్ ఫ్రూట్స్. ఇవి కూడా చాలా తియ్యగా ఉంటాయి. ముదురు ఆకుపచ్చ రంగులో, గుండ్రంగా బంతిలా పెరిగే సొరకాయలు కూడా టెర్రస్ గార్డెన్ లో చక్కగా పెంచుకోవచ్చు. పొడవుగా ఉండి, డార్క్ గ్రీన్ రంగులో ఉండి, అక్కడక్కడా తెల్ల మచ్చలు ఉండే రకం సొర కూడా టెర్రస్ గార్డెన్ లో బాగా పెరుగుతుంది. ముసుగు వంకాయ అనే రకం కూడా టెర్రస్ గార్డెన్ లో చక్కగా పెరుగుతుంది. ఈ వంగ మొక్క మామూలు వంగమొక్కలా ఉండదు. మొక్క కూడా చాలా అందంగా, బలంగా ఎదుగుతుంది. దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్ లా పెంచుకోవచ్చు.హోంటమాటా, గ్రేప్ టమాటా, చెర్రీ టమాటా లాంటి అరుదైన కొన్ని టమాటాలు కూడా ట్రెరస్ గార్డెన్‌ లో బాగా పెరుగుతాయి. ఎర్ర గోంగూర రకం ఒకటి ఉంది. ఎర్ర గోంగూర మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుంది. దీనికి పురుగుల బెడద ఉండదు. బ్లాక్ మిర్చి కూడా టెర్రస్‌ పై కుండీల్లో పెంచుకోవచ్చు. వీటిలో రౌండ్‌ గా ఉండేవి, పొడవుగా ఉండే మిర్చిలు కూడా ఉంటాయి. చిత్రాడ బీర రకం కాస్త పొట్టిగా ఉంటుంది. కానీ చాలా రుచిగా ఉంటుంది. తెల్ల బెండ, వైట్ కాకర, దొండకాయల్ని కూడా టెర్రస్ గార్టెన్ లో చక్కగా పెంచుకోవచ్చు. వైట్ కాకర అంత చేదుగా ఉండదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here