సాధారణంగా మనం కంపోస్ట్‌ ఎరువు తయారు చేయడానికి కాస్త ఎక్కువ శ్రమే చేయాల్సి ఉంటుంది. కిచెన్‌ వేస్ట్‌ను ఎక్కువ సమయం నిల్వచేయడం వల్ల దాన్నుంచి వచ్చే చెడు వాసన కూడా ఒక్కోసారి భరించాల్సి ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా సులువుగా కంపోస్ట్‌ చేసే విధానం గురించిన తెలుసుకుందాం. దాంతో పాటు ఏ కాలంలో ఎలాంటి వేస్ట్‌ మెటీరియల్‌తో కంపోస్ట్‌ చేసుకుంటే ఎక్కువ ఉపయోగంగా ఉంటుందో చూద్దాం. అలాగే కంపోస్‌ ఎరువును ప్రత్యేకంగా తయారు చేసుకునే విధంగా కాకుండా కాస్త వెరైటీగా మొక్కల కుండీల్లోనే దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చే పరిశీలిద్దాం…సాధారణంగా మనం కంపోస్ట్ ఎరువును ప్రత్యేక పద్ధతుల్లో తయారు చేసుకుంటాం కదా.. ఇప్పుడు చెప్పుకునేది మొక్కలమొదళ్లలో, వాటి కుండీల్లోనే కంపోస్ట్ తయారు చేసుకునీ సులువైన పద్ధతిని ఉషా గార్డెన్‌ నిర్వాహకురాలు వివరించారు. అదేంటంటే..

కిచెన్‌ వేస్ట్ గానీ, ఉపయోగించగా మిగిలిపోయి, వాడిపోయిన పువ్వులను, మొక్కల మొదళ్లలో ముదిరిపోయిన, లేదా ఎండిపోతున్న ఆకులను తెంపుకుని కూడా ఈ కంపోస్ట్ ఎరువును ఈజీగా చేసుకోవచ్చు. ఇందుకు అనువైన కాలం శీతాకాలం. కిచెన్ వేస్ట్‌ గానీ, మిగిలిపోయి పువ్వులు గానీ, లేదా చెట్లు, మొక్కల ఆకులను గానీ మనం మిద్దెతోటలో గానీ, పెరటితోటలో గానీ కుండీల్లో పెంచుకునే మొక్కల మొదళ్లలో ఆచ్ఛాదనగా వేసుకోవాలి. అంటే మొక్కల వేసుకున్న మట్టిపైన కవర్ మాదిరిగా కప్పుకోవాలి.  దీంతో మొక్క మొదట్టోని మట్టిలో తేమ ఎప్పుడూ నిల్వ ఉంటుంది. తద్వారా మొక్కకు ఎక్కువగా నీరు పోయాల్సిన అవసరం ఉండదు. మట్టిలో తేమను పరిశీలించుకుని అవసరమైన మొక్కల కుండీల్లో మాత్రమే నీరు అందించుకోవచ్చు. దీంతో మనకు నీటి వినియోగం, దాని వల్ల అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గిపోతుంది.శీతాకాలంలో ఇలా మొక్కల కుండీల్లోని మట్టిపై కిచెన్ వేస్ట్‌, పువ్వుల వేస్ట, ముదిరిన, పండిన ఆకులు ఆచ్ఛాదనగా వేసుకుంటే.. అవి రెండు మూడు నెలల్లో కంపోస్ట్‌ ఎరువుగా మారిపోయి మొక్కకు అవసరమైన బలాన్ని అందిస్తాయి. చలికాలంలో వేయడం వల్ల పొడిగా ఉండే తేమ, లేదా కొద్దిగా తగిలే ఎండవల్ల కిచెన్ వేస్ట్‌ ఎండుతుంది. మనం పోసే నీటితో తడుస్తుంది. దాంతో వేస్ట్‌లో ఉండే పోషకాలు కొద్దికొద్దిగా మట్టిలోకి జారి మట్టితో బాగా కలిసిపోతాయి. దాంతో మొక్కకు కావాల్సిన బలం అందుతుంది.అయితే.. వర్షాకాలంలో మాత్రం ఇలా కిచెన్ వేస్ట్‌, పువ్వుల వేస్ట్‌, లేదా ఆకులను ఆచ్ఛాదనగా వేయవద్దని ఉష చెబుతున్నారు. ఎందుకంటే.. అవి ఒక్కసారిగా కుళ్లిపోయి, మెగెట్స్‌ వచ్చి, మొక్కలకు ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. మనం వేసే వేస్ట్‌ కొద్ది కొద్దిగా ఎండుతూ, మనం పోసే నీళ్లతో కొద్ది కొద్దిగా దాంట్లోని పోషకాలు మట్టిలో కలుస్తూ ఉంటేనే పైకి ఎలాంటి దుర్గంధమే వెదజల్లదు. పైగా ఇలా శీతాకాలంలొ మొక్కల మొదళ్లలో వేసిన ఆచ్ఛాదన ద్వారా అందే పోషకాలు మరో రెండు మూడు నెలల వరకు అందుతాయి. తద్వారా మొక్కలు బలంగా, ఏపుగా ఎదుగుతాయి. చక్కని దిగుబడులు ఇస్తాయి.మొక్కలకు కిచెన్ వేస్ట్‌ గానీ, పువ్వుల వేస్ట్‌ గాని, ఆకులు గానీ మరో విధంగా కూడా కంపోస్ట్‌ ఎరువుగా వాడుకోవచ్చు. మొక్కల కుండీల్లోని మట్టిని కాస్త గొయ్యిలా తీసి దాంట్లో కిచెన్‌, పువ్వుల వేస్త్‌ గానీ, ఆకులు గాని వేసి, దానిపై గ్రీన్‌ మిక్స్ పౌడర్ మార్కెట్లో లభిస్తుంది. లేదా అమెజాన్‌లో కూడా 3 కిలోల చొప్పున గ్రీన్ మిక్స్‌ సుమారు 300 నుంచి 400 రూపాయలకు దొరుకుతుంది. కుండీల గోతిలో వేసిన వేస్ట్‌పై గ్రీన్ మిక్స్‌ పౌడర్ వేసి, పైన మట్టి కప్పేస్తే.. మొక్కలకు అవసరమైనంత కంపోస్ట్‌ ఎరువు తయారైపోతుంది. ఇలా కంపోస్ట్ ఎరువు చేసుకున్నప్పుడు మగట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు.ఈ విధంగా కంపోస్ట్‌ను మొక్కల మొదళ్లలోనే తయారు చేసుకుంటే.. ఆ తర్వాత రెండు మూడు నెలల పాటు ఎలాంటి కంపోస్‌్ ఎరువు వేయకపోయినా మొక్కల ఎదుదలకు, దిగుబడి ఇవ్వడానికి ఇబ్బందేమీ ఉండదు. మట్టిలో తేమను చూసుకు కేవలం నీళ్లు అందిస్తే సరిపోతుంది. మొక్కల మొదట్లో కిచెన్ వేస్ట్‌, గార్డెన్ వేస్ట్‌ను ఆచ్ఛాదన వేయడం ద్వారా కలుపుమొక్కలు పూర్తిగా నివారణ కూడా అవుతాయి. ఉషగారు చెప్పిన విధానంలో కంపోస్ట్ చేసుకుంటే.. మొక్కలు పెరుగుతున్న మట్టి శీతాకాంలో దగ్గరగా అయిపోకుండా ఉంటుంది. అంటే తేమ తక్కువై ఉండ ఉండలుగా అయిపోదు. మట్టి గుల్లగుల్లగా తయారవుతుంది.  కిచెన్‌, గార్డెన్‌ వేస్ట్‌ను ఆచ్ఛాదనగా వేయడం వల్ల మట్టిలోని నీరు ఎక్కువగా ఆవిరి అయిపోదు. మట్టి కూడా చల్లగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కంపోస్ట్‌ ఎరువు కొని వేసే డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఈ టిప్‌పు ఫాలో అయితే.. మిద్దె తోటలు పెంచుకునే వారు, పెరటి తోటలు సాగు చేసే ఔత్సాహికులు, కుండీల్లో కూరగాయలు, ఆకు కూరలు, పువ్వులు, పండ్లు పండించుకునే రైతులకు ఎంటో మేలు అవుతుంది.వర్షాకాంలో మాత్రం ఈ విధానాన్ని అస్సలు చేయకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే.. వర్షాకాలంలో ఆచ్ఛాదనగా వేసే వెస్ట్‌ త్వరగా  కుళ్లిపోయి మగట్స్ వస్తాయి. ఎక్కువగా కుళ్లిన పదార్థం మొక్కల మొదళ్లలో ఉండడం వాటికి ఫంగస్ సోకే అవకాశం ఉంటుంది. దాంతో పాటు దోమలు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. వేస్ట్‌ను తీసుకురావడం, మొక్కల కుండీల్లో పైన పరుచుకోవడం చాల సులువైన విధానం కాబట్టి ఔత్సాహిక మిద్దెతోట రైతులు, పెరటి రైతులకు చాలా సులువుగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here