మొక్క తోటలు పెంచుకునేవారు క్రిమి కీటకాల నివారణ కోసం వాటిపై పురుగు మందులు స్ప్రే చేస్తుంటారు. ఏ మొక్క అయినా చీడపట్టి చచ్చిపోతోందనుకున్నప్పుడు రైతులు ఇలా మొక్కలపై పురుగుమందులు స్ప్రే చేయడం షరా మామూలే. భూమిపై ఉండే మొక్కల ఆకులు ఎండిపోతున్నాయంటే.. దాని తల్లి వేరు, పిల్ల వేర్లలో ఏదో తెగులు సోకిందని గ్రహించడం రైతులకు ఎంతైనా అవసరం అని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. అందుకని ఏదైనా ఒక మొక్క ఎదుగుదల సరిగా లేకపోయినా, ఆకులు ఎండిపోతున్నా ఆ మొక్క మూలాల్లోని వేర్లకు క్రిమి నివారణ మందులు ఇవ్వాలని చెబుతున్నారు. మొక్కకు పూత, పిందె వచ్చినప్పుడు మొక్క పైభాగంలో మందులు స్ప్రే చేసే తప్పు అస్సలు చేయొద్దని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొక్క ఏదైనా తెగులు సోకినట్లు గమనించినప్పుడు నివారణ మందులు దాని మొదట్లో అన్ని వేళ్లకు అందేలా వేసుకోవాలని సూచించారు.కడప జిల్లా ఖాజీపేట మండలం బీచువారిపల్లె యువరైతు దినేశ్ తాను ఇలాంటి తప్పే తాను ముందుగా చేశానని చెప్పారు. బీటెక్ చదివిన దినేశ్ బెంగళూరులో కొంతకాలం ఐటీ జాబ్ చేసి, వ్యవసాయంపై ఆసక్తి పెంచుకుని సొంతూరు వచ్చేశారు. తమ వ్యవసాయ క్షేత్రంలో రకరకాల పండ్ల మొక్కల్ని సహజసిద్ధంగా సాగుచేస్తున్నారు. అనుభవం లేనప్పడు తాము మొక్కలకు నీమ్ జాప్ మందును మొక్కలకు పిచికారి చేసినట్లు చెప్పారు. ఇలా మొక్కలకు మందు స్ప్రే చేయడం తప్పు అని తరువాతే తెలిసిందన్నారు. ఇలాంటి తప్పు రైతులు చేయొద్దని తెలిపారు.
మట్టిలో మనం వేసే పోషకాలు ఆయా మొక్కలకు అవసరమైన బలాన్ని క్రమేపీ అందిస్తాయని వ్యవసాయ నిపుణులు చెప్పారు. అప్పటికే మొక్కకు వచ్చిన క్రిమి కీటకాలను అరికట్టేందుకు, మళ్లీ అవి ఆశించకుండా చేయడానికి మాత్రమే నీమ్ జాప్ మందును మొక్క మొదట్లో వేయాలని తాము చెబుతామన్నారు. అయితే.. నీమ్ జాప్ అనేది సహజసిద్ధంగా, హెర్బల్స్ తో తయారు చేసేది కనుక క్రిమికీటకాలను బాగా అరికడుతుంది. మొక్క ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది.వ్యవసాయం పట్ల తనకు ఆసక్తి కలగడానికి తన తండ్రే తనకు స్ఫూర్తి అని యువరైతు దినేశ్ వెల్లడించారు. తమ వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన తర్వాత ఒక్కసారి మాత్రమే నీమ్ జాప్ వాడానన్నారు. ఆ తర్వాత మరే ఇతర మందు కొట్టలేదని చెప్పారు. అయినా.. మొక్కలు ఏపుగా చక్కగా పచ్చగా ఎదుగుతున్నాయని, చిగుర్లు కూడా ఎంతో బాగా వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయం ప్రారంభించిన తొలి రోజుల్లో కొంచెం కష్టం అనిపించిందని, అయితే తాను కూడా పొలం పనులు చేయడం ప్రారంభించిన తర్వాత మరింత ఆసక్తి పెరిగిందన్నారు. వ్యవసాయం చేసే విషయంలో తన తండ్రి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటారని, ఊరిలోని ఇతర రైతులు కూడా తనకు ఎంతో అవగాహన పెంచారని చెప్పారు.
దినేశ్ తమ తండ్రికి ఉన్న 35 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో కొంతభాగంలో ముందుగా చినీ మొక్కలు నాటారు. చినీ మొక్కల ఎదుగుదల సంతృప్తికరంగా ఉండడంలో నేరేడు, పనస, చింత, ఉసిరి, మామిడి లాంటి 11 రకాల పండ్ల మొక్కలు నాటారు. వ్యవసాయ క్షేత్రంలో తాము వచ్చినప్పుడు విశ్రాంతి కోసం ఏర్పాటు చేసుకున్న రూమ్ వెనకాల రెండేసి ఎక్జోటిక్ మొక్కలు నాటారు. తమ క్షేత్రంలో రెండు ఎకరాలను మాత్రం ఆవులకు దాణా కోసం పూర్తిగా కేటాయించినట్లు దినేశ్ తెలిపారు.వ్యవసాయం మొదలెట్టినప్పుడు తాను కూలీలు, కష్టాన్ని చూసి తాను చేయగలనా? అని కొంచెం భయపడిన మాట నిజమే అని దినేశ్ చెప్పారు. మెల్లిమెల్లిగా తాను స్వయంగా నడుం వంచి పొలంలో పనిచేయడం ప్రారంభించి, కూలీలను తగ్గించుకుంటూ తమ కుటుంబం చాలా వరకు పనులు చేసుకుంటున్నామన్నారు. పొలంలో తాను స్వయంగా పనిచేయడం ప్రారంభించాక కొంత సంతృప్తి కలిగిందని తెలిపారు.
ఎనిమిది ఎకరాల్లో 800 చినీచెట్లు నాటినట్లు దినేశ్ చెప్పారు. నాలుగు ఎకరాల్లో 1,300 సీతాఫలం మొక్కలు, మరో నాలుగు ఎకరాల్లో 600 వరకు నేరేడు మొక్కలు నాటారు. మరో రెండు ఎకరాల్లో 100 పనస మొక్కలు నాటినట్లు వెల్లడించారు. మూడు మూడు ఎకరాలను విభజించుకుని మామిడి, చింత, ఉసిరి, సపోటా మొక్కలు నాటారు. సాగుబడి ఒకే మూసలో కాకుండా కాస్త వెరైటీగా ఉండాలని బెంగళూరులో తన స్రేహితులను చూసి లక్ష్మణ ఫలం మొక్కలు వేశారుదినేశ్ కు వ్యవసాయంలో తొలి అనుభవం మాత్రం చినీ మొక్కల నుంచే ప్రారంభమైందని చెప్పారు. తొలిరోజుల్లో వేసిన చినీ మొక్కల్లో అనుభవం లేకపోవడం 300 మొక్కలు చనిపోయాయన్నారు. పనివారిని పెడితే.. వారికి కూడా సరైన అవగాహన లేక ఏడాది పాటు అసలు మొక్కను వదిలిపెట్టి, అంటు మొక్కను పెంచేసినట్లు చెప్పారు. అవి బాగా ఎత్తు పెరిగిపోయాయి కాని పూత, పిందె మాత్రం రాలేదన్నారు. పులివెందుల ప్రాంతంలో చినీ తోటల్లో పనిచేసే వారికి చూపిస్తే.. తమ తోటలో కాయలే రావని చెప్పారన్నారు. అప్పుడు ఏయే మొక్కలకు కాయలు రావో వాటన్నింటినీ కొట్టేస్తే.. చివరికి 300 మొక్కలు మిగిలాయని దినేశ్ తెలిపారు. తొలిరోజుల్లో తన తోటలోని మొక్కలకు రసాయన ఎరువులు వినియోగించినట్లు చెప్పారు. ఆర్గానిక్ సాగు విధానంలోకి మారిన తర్వాత మంచి ఫలితాలు కనిపించాయన్నారు. అయితే.. వారం, పది రోజులకే మొక్కలకు పురుగులు వచ్చేవి అని తెలిపారు. ఆ తర్వాత నీమ్ జాప్ వాడినప్పుడు వెంటనే ఫలితం బాగా వచ్చిందన్నారు. నీమ్ జాప్ వాడిన మొక్క ఎదుగుదలను చూస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుందని చెప్పారు.అయితే.. మొక్క ఆరోగ్య పరిస్థితి, మట్టి తీరును, మొక్క ఎదుగుతున్న విధానాలను అంచనా వేసి వ్యవసాయ శాస్త్రవేత్తలు నీమ్ జాప్ ఎంత మొతాదులో వాడాలో చెబుతారు. నీమ్ జాప్ ఎంత మోతాదులో వాడితే మొక్క వేరు కోలుకుని మళ్లీ చక్కగా ఎదుగుతుందో శాస్త్రవేత్తలు సరిగా లెక్క వేస్తారు. డ్యామేజ్ అవుతున్న మొక్కకు నీమ్ జాప్ పోసినప్పుడు దాని మొదట్లో మట్టి, గడ్డిని తీయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. మొక్క చుట్టూరా నీమ్ జాప్ పోయాలన్నారు. ఐదు లీటర్లు ఒక మొక్కు పోయాలని సూచిస్తే.. అందులో ఒక లీటర్ మొక్క మొదలు చుట్టూ పోయాలి. మిగతా నాలుగు లీటర్లను మొక్క చుట్టూ పళ్లెంలా చేసిన గుంతలో పోయాలి. నెమ్ టోడ్ తెగులు అంటే వేరుకుళ్లు తెగులును నీమ్ జాప్ బాగా నివారిస్తుంది. తల్లివేరుకు నీమ్ జాప్ అందిన వెంటనే అది మళ్లీ జీవం పోసుకుంటుంది. తల్లివేరు బతికేసిందంటే పిల్ల వేళ్లను ఆటోమేటిక్ గా తయారు చేసుకోగలుగుతుంది. తద్వారా చనిపోయిందనుకున్న మొక్క మళ్లీ బతుకుతుంది. తల్లి వేరుకు ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తే.. క్యాన్సర్ మాదిరిగా మొక్కకు పాకేస్తుంది. అందుకే ముందుగా తల్లివేరుకు రక్షణ కల్పించాలంటారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.
మొక్కలను పురుగు పట్టినప్పుడు మాత్రం నెలకోసారి పురుగుల మందు చల్లుతానని తెలిపారు. మామూలుగా అయితే.. చేపలు- బెల్లం బాగా కలిపిన ద్రవం, లేదా బాగా మాగి కుళ్లిపోయిన అరటిపండ్లతో డ్రమ్ముల్లో తయారు చేసిన ద్రవాన్ని తడవకు ఒక రకం మొక్కలకు స్ప్రే చేస్తానని దినేష్ చెప్పారు. కొబ్బరి మొక్కల చుట్టూ గుంత తీసి పళ్లెంలా చేసి, దాంట్లో ఒక్కోదాని చుట్టూ 5 లీటర్ల చొప్పున నీమ్ జాప్ పోసినట్లు తెలిపారు. అప్పటి నుండీ 15 రోజులకే చక్కని ఫలితం కనిపించిందని, కొబ్బరి మొక్కలు చాలా ఏపుగా, పచ్చగా పెరుగుతున్నట్లు వివరించారు.