మొక్క నాటిన ఏడాది లోపే పంట చేతికి వస్తుంది. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. చీడ పీడల బాధ పెద్దగా ఉండదు. లేబర్ ఖర్చు తక్కువ. కాయలు తయారైన తర్వాత వారం రోజుల పాటు చెట్టు నుంచి తెంపకపోయినా ఇబ్బంది ఉండదు. పంట తొలి కాపులో కాస్త పెద్ద సైజు కాయలు కాస్తుంది. ఎక్కువ కాయలు కాసినప్పుడు మామూలు సైజులోనే కాయలు వస్తాయి. సాధారణ నిమ్మ కన్నా ఈ నిమ్మచెట్టుకు ముళ్లు బాగా తక్కువ ఉంటాయి. రైతన్నలకు లాభసాటిగా ఉంటుంది. అదే క్లోనింగ్ విధానంలో రూపొందించిన తైవాన్ నిమ్మ.