టెర్రస్ మీద కూడా చక్కని ఫలాలు అందించే వెరైటీల గురించి తెలుసుకుందాం. కుండీల్లో వేసుకున్నా చక్కగా గెలలు వేసే రకం షార్ట్ అరటి. అత్యంత పొట్టి బనానాల్లో ఇదొక వెరైటీ. మరో రకం ఆర్నమెంట్ బనానా. ఈ చెట్టు కాయలు తినడానికి పనికిరావు. కాకపోతే.. అందంగా అలంకరణ కోసం ఉపయోగపడతాయి. ఈ చెట్టు అరటి పువ్వు కలువపువ్వులా ఉంటుంది. మొత్తం పువ్వు నుంచి రేకులు రాలిపోవడానికి రెండు మూడు నెలలు పడుతుంది. ఆర్నమెంట్ బనానా ఆకు సాధారణ అరటి ఆకు కన్నా మందంగా ఉంటుంది. ఇంకో అరటి రకం.. దాని పువ్వు తామరపువ్వు మాదిరిగా ఉంటుంది. దాని రేకులు ముదురు పసుపు, ఎరుపు రంగులో ఉంటాయి. ఇది అలంకరణ కోసం వినియోగిస్తే అందంగా ఉంటుంది. అరటి పండ్లు, కాయల కోసం పెంచే అరటిలో అయితే.. పెద్ద చెట్టు చుట్టూ వచ్చే పిలకలను తీసేయాల్సి ఉంటుంది. అయితే.. ఈ రకం అరటి చుట్టూ ఎన్ని పిలకలువచ్చినా పెరగనివ్వవచ్చు. ఈ అరటిమొక్క ఆకులు ఎన్ని వస్తే.. అన్నింటినీ మనం భోజనాలు చేసేందుకు, శుభకార్యాల్లో అందంగా అలంకరించేందుకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ అరటి ఆకుతో ‘నో ప్లాస్టిక్’ నినాదం చెప్పొచ్చు. దీని కాయలు కూడా తినేందుకు పనికిరావు.