Site icon V.E.R Agro Farms

‘గో మహాయాత్ర’ విజయవంతం

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2021 జనవరి 24న గోమహాయాత్ర జరిగింది. హైదరాబాద్‌లో వేలాదిమంది యువకులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి బహదూర్ పుర మల్లన్న దేవాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. ఇంటింటా తులసి, జగమంతా గోమాత, గోమాతను రక్షిద్దాం-కబేళాలను మూయిద్దాం వంటి నినాదాలతో యుగ తులసి ఫౌండేషన్ సభ్యులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇదిలావుండగా, చార్మినార్ వద్ద శ్రీభాగ్యలక్ష్మి దేవాలయం నుండి తలపెట్టిన గోమహాయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. యుగ తులసి ఫౌండేషన్ అధ్యక్షుడు, టీటీడీ పాలక మండలి సభ్యుడు కొలిశెట్టి శివకుమార్‌తో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని కార్ఖానా పోలీస్ స్టేషన్లకు తరలించారు. తొలుత శ్రీభాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించిన శివ కుమార్ గోసంరక్షణ కోరుతూ అమ్మవారికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గోహత్యను నిలిపివేసి, అక్రమ కబేళాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. యాదాద్రి, వేములవాడ దేవాలయాలను అభివృద్ధి పరచినట్లే ముఖ్యమంత్రి కేసీఆర్ గోవుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మి ఆలయం వద్ద శ్రీ కొలిశెట్టి శివ కుమార్

గోమహాయాత్రలో లోధ్ క్షత్రియ సదర్ పంచాయత్ సంచాలకులు మాతావాలే మహేశ్ సింగ్, మహామంత్రి రాజేశ్ సింహ్, మంత్రి రమేశ్ సింహ్, లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ ప్రతినిధి జశ్వత్ భాయ్ పటేల్, మీరాలం మండీ శ్రీ మహంకాళేశ్వర దేవాలయం చైర్మన్ గాజుల అంజయ్య, వివిధ దేవాలయాలకు చెందిన ప్రతినిధులు సదానంద్ యాదవ్, రాకేశ్ తివారీ, బాలకృష్ణ, నర్సింగ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. గోమహాయాత్రను విజయవంతం చేసిన గోభక్తులందరికీ కొలిశెట్టి శివకుమార్ ధన్యవాదాలు తెలిపారు. మరోవైపున గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రారంభించిన ఉద్యమంలో భాగంగా 2021 ఏప్రిల్ 1న హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో సాయంత్రం 4 గంటలకు ‘గోమహా గర్జన’ పేరుతో ఒక భారీ బహిరంగసభను నిర్వహించాలని యుగ తులసి ఫౌండేషన్ నిర్ణయించింది.

మరిన్ని వివరాలకు ఈ చిరునామాను సంప్రదించవచ్చు.

5-9-296, flat no 310, Prasad Apartment,
Gunfoundry, Abids Secunderabad,
Telangana, India 500001
Mobile No: 080083 18888, 91+ 8008 602 588
Email: feedbackytf@gmail.com

Exit mobile version