Site icon V.E.R Agro Farms

ఇది ఒక ఆర్గానిక్ సూపర్ స్టోర్

ఆర్గానిక్ పంటలు, దినుసులు, పదార్థాల పట్ల ఇప్పుడు దేశంలో మక్కువ పెరుగుతోంది. ఆర్గానిక్ సాగు వల్ల పండే పంటలతో తయారయ్యే పదార్థాలు రుచికరంగా ఉండి ఆరోగ్యకరం కావడమే ఇందుకు కారణం. ఇవి శరీరంలో వ్యాధినిరోధక శక్తిని ఇనుమడింపజేస్తాయి. అయితే అసలు సమస్య ఏమిటంటే మార్కెట్‌లో ఆర్గానిక్ పేరుతో లభించే ఆహార పదార్థాలన్నీ నూటికి నూరు శాతం సేంద్రియ పద్ధతుల ద్వారా సమకూరినవేమీ కావు. ఆర్గానిక్ ఫుడ్స్ ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి కాబట్టి ఆ పేరుతో దేన్నైనా సరుకు చేసుకుంటున్నవారున్నారు. ఆర్గానిక్ పేరు చూసి కొని మోసపోతున్నవారూ ఉన్నారు. అలా కాకుండా ఆర్గానిక్ సర్టిఫికేట్ పొందిన దినుసులను, వాటితో తయారయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తయారు చేసి విక్రయిస్తుంది ‘లక్ష్యాస్ నేచురల్ ఫుడ్స్’. తొలుత సికిందరాబాద్‌లోని సైనిక్‌పురిలో ఏర్పాటైన ఈ సంస్థ సకల సేంద్రియ సరుకుల సూపర్ స్టోర్. ఆర్గానిక్ జీవన శైలి అనుసరించేవారికి కావలసిన సరుకులన్నీ ఒక్కచోటే ఈ సూపర్ స్టోర్‌లో దొరుకుతాయి. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోనూ లక్ష్యాస్ స్టోర్‌ను నిర్వహిస్తున్నారు.

లక్ష్యాస్ స్టోర్‌లో లభించే సరుకుల గురించి వివరిస్తున్న డైరెక్టర్ శ్రీ సతీశ్

దేశంలో ఎక్కడెక్కడ మంచి నాణ్యమైన ఆహార పదార్థాలు లభ్యమౌతాయో అక్కడి నుండే ‘లక్ష్యాస్’ వాటిని తెప్పించుకుని విక్రయించడం విశేషం. ఉదాహరణకు గోధుమలకు రాజస్థాన్‌ రాష్ట్రం ప్రసిద్ధి. అందుకే ఈ సంస్థ రాజస్థాన్ నుండి గోధుమలను తెప్పించుకుంటుంది. అలాగే బాస్మతి రైస్‌ను ఉత్తర హిమాచల్ ప్రదేశ్ నుండి, బెల్లం, చక్కరలను మహారాష్ట్ర నుండి తెప్పిస్తుంది. పప్పు దినుసులు, బియ్యం, పల్లీలు, కొన్నిరకాల చిరుధాన్యాల వంటివాటిని ‘లక్ష్యాస్’ తమకు సంబంధించిన లేదా తమకు బాగా తెలిసినవారి వ్యవసాయక్షేత్రాల నుంచే ప్రొక్యూర్ చేస్తుంది. అది కూడా సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫామ్స్ నుండి మాత్రమే. ఇలా ఆర్గానిక్ వ్యవసాయం చేసేవారి నుండి ధాన్యం వంటివి సేకరించడం ద్వారా ‘లక్ష్యాస్ ఫుడ్స్’ సేంద్రియ రైతులకు కూడా తోడ్పాటును అందిస్తోంది. లక్ష్యాస్ తమ వినియోగదారుల కోసం నాలుగైదు రకాల ప్యూర్ తేనెను సైతం వివిధ ప్రదేశాల నుండి సేకరిస్తుంది. ద రియల్ టేస్ట్ ఆఫ్ నేచర్ అన్నది ‘లక్ష్యాస్’ నేచురల్ ఫుడ్స్ ట్యాగ్ లైన్. కనుక సేంద్రియ పదార్థాలను రుచికరమైన పద్ధతుల్లో అందించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తుంది.
ఎక్కడెక్కడ ఏ రకమైన ఔషధవిలువలు కలిగిన సేంద్రియ ఆహార దినుసులు దొరుకుతాయో చూసి వాటిని అక్కడి నుండి ఈ సంస్థ తెప్పించుకుంటుంది. సజ్జ బిస్కెట్లు, రాగి బిస్కెట్లు, జొన్న బిస్కెట్ల వంటి స్నాక్స్ ఇక్కడ దొరుకుతాయి. అంతేకాకుండా జొన్నలతోను, రాగులతోను దొసెలు, ఇడ్లీల వంటి సంప్రదాయ సేంద్రియ రెసీపీలను కూడా తయారు చేసి కస్టమర్లకు అందిస్తోంది లక్ష్యాస్. రెడీ టూ యూజ్ పిండి వంటివీ ఇక్కడ లభ్యమౌతాయి. స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యితో చక్కెరకు బదులు బెల్లం వాడి జొన్న లడ్డు, రాగి లడ్డు వంటి రుచికరమైన పిండివంటలను తయారు చేస్తుంది లక్ష్యాస్ నేచురల్ ఫుడ్స్.
అన్నిరకాల చిరుధాన్యాలతో తయారైన వివిధ ఆహార పదార్థాలు ఇక్కడ లభ్యమవుతాయి. రాగులు, జొన్నలు, సజ్జల వంటివాటితో తయారుచేసిన రుచికరమైన పదార్థాలు ఇక్కడ సరసమైన ధరలకే దొరుకుతాయి. ‘లక్ష్యాస్’ బ్రాండ్ పదార్థాలే కాకుండా పేరున్న అన్ని బ్రాండ్ల ఆర్గానిక్ ఫుడ్స్, సరుకులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అయితే మిగతా బ్రాండ్లవాటి కన్నా ‘లక్ష్యాస్’ తయారు చేసే సరుకుల ధరలు తక్కువగా ఉండడం ప్రత్యేకత.

లక్ష్యాస్ ఆర్గానిక్ ఫుడ్స్ డైరెక్టర్ శ్రీ సతీశ్

రకరకాల మట్టిపాత్రల దగ్గరి నుంచి ఆకులతో తయారుచేసే డిస్పోజబుల్ ప్లేట్ల వరకు అన్నీ ఈ ఆర్గానిక్ సూపర్ స్టోర్‌లో దొరుకుతాయి. ఇంటికి కావలసిన సరుకులన్నీ ఆర్గానిక్‌వై ఉండి, అవి కూడా ఒక్కచోటే లభించడం ‘లక్ష్యాస్’ స్పెషాలిటీ. ఇలాంటి ఒక స్టోరును నిర్వహించాలంటే అందుకు మంచి అభిరుచి ఉండాలి. అలాంటి అభిరుచి ఉన్నవారు లక్ష్యాస్ డైరెక్టర్ శ్రీ సతీశ్. ఆర్గానిక్ లైఫ్ స్టైల్‌ పట్ల ఆయనకున్న మక్కువ వల్లే లక్ష్యాస్ స్టోర్ రూపుదిద్దుకుంది. హైదరాబాద్ మహానగర కాంక్రీట్ కీకారణ్యంలో పర్యావరఁణ హిత ఆర్గానిక్ జీవనశైలికి చిరునామాగా నిలుస్తున్న Lakshyas Natural Foods ఆయన మానస పుత్రిక. ఆర్గానిక్ ఆహారం ఒక ట్రెండ్ కాదు, అది సంప్రదాయం వైపు మరలడం అంటారాయన. ‘లక్ష్యాస్’ వంటి ఒక పరిపూర్ణ ఆర్గానిక్ స్టోర్‌ను నిర్వహించాలంటే ప్రకృతి సాగు పట్ల అవగాహన ఉండాలి. అలాంటి అవగాహనా, అనుభవమూ, నేపథ్యమూ ఉన్న శ్రీ సతీశ్ తన ‘లక్ష్యాస్‌’ను కేవలం బిజినెస్‌లా కాకుండా స్వదేశీ భావాలతో ఒక పర్యావరణహిత సంస్థగా నిర్వహిస్తుండడం విశేషం.
లక్ష్యాస్ (Lakshyas Natural Foods) స్టోర్  హైదరాబాద్‌ (సికిందరాబాద్) సైనిక్‌‍పురి వద్ద హస్తినాపురి కాలనీలోని సాయిపురి కాలనీలో ఉంది. లక్ష్యాస్ బ్రాండ్ ఉత్పత్తులు హైదరాబాద్ నగరంలోని పలు స్టోర్లలో కూడా లభిస్తాయి.

ఆసక్తిగలవారు మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.

Lakshyas Natural Foods
4-158/136, 6th Ave, Saipuri Colony, Hastinapuri Colony,
Sainikpuri, Secunderabad, Telangana State, PIN: 500094, INDIA.
Mobile: 99084 85544, 9502731861, lakshyasagri@gmail.com

Exit mobile version