Site icon V.E.R Agro Farms

ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఈ-కామర్స్ వేదిక

ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులలో ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. రసాయన ఎరువుల వినియోగం వల్ల పెరిగిన ఆర్థిక భారంతో సతమతమౌతున్న అన్నదాతలు క్రమంగా సేంద్రియ సేద్యంవైపు మరలుతున్నారు. అయితే పండించిన ధాన్యాన్ని, దినుసులను ఎలా విక్రయించాలన్నదే పెద్ద ప్రశ్న. సేంద్రియ పద్ధతుల్లో పండించే పంటలకు వినియోగదారులలో కూడా ఆదరణ పెరుగుతోంది. కానీ మార్కెట్‌ వ్యవస్థ పటిష్ఠంగా లేదు. ఈ సమస్యను పరిష్కరించే ఆలోచనతో ఆవిర్భవించిందే ‘భూమి ప్రైడ్’ (Bhumi Pride) బ్రాండ్. ఇప్పుడిది ఇది ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల ఈ కామర్స్ రంగంలోకి కూడా ప్రవేశించింది. నబార్డ్ (NABARD) చైర్మన్ డాక్టర్ జీ ఆర్ చింతల జనవరి 4న ‘భూమి ప్రైడ్’ ఈ- కామర్స్ వెబ్ సైట్ www.bhumipride.com ను లాంఛనంగా ప్రారంభించారు.

తమిళనాడులోని కాంచీపురంకు చెందిన Hand in Hand India (హ్యాండ్ ఇన్ హ్యాండ్) అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతుల కోసం Natural Farmer Producer Company Limited (INFPCL)ని ఏర్పాటు చేసింది. ఇందులో ఐదు రైతు ఉత్పత్తి సంఘాలు భాగం పంచుకుంటున్నాయి. ఆర్గానిక్ విధానంలో సాగు చేసిన వ్యవసాయోత్పత్తులకు మార్కెట్ కల్పించాలన్న ఆలోచనతో ఈ కంపెనీ ‘భూమి ప్రైడ్’ బ్రాండ్‌ను ప్రారంభించింది.

సహనా శంకర్

ఈ బ్రాండ్‌తో సేంద్రియ పంటలను వినియోగదారులకు చేరుస్తోంది. ఇందులో భాగంగా జరిగిన వెబ్ సైట్‌ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ డాక్టర్ చింతల ఆర్గానిక్ సేద్యం విశిష్టతను వివరించారు. పర్యావరణానికి హాని చేయని రీతిలో పండించే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులకు మంచి మార్కెట్ ఉందన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని రంగాల్లోనూ డిజిటల్ కార్యక్రమాలకు ప్రాధాన్యం పెరిగిందని ఆయన చెప్పారు. కనుక వ్యవసాయోత్పత్తుల ఈ-మండీల (e-mandis) ఏర్పాటుకు కూడా Natural Farmer Producer Company Limited (INFPCL) పూనుకోవాలని ఆయన సూచించారు. ఇలా చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం farmer producing companies (FPC) నిర్వహణార్థం ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను హ్యాండ్ ఇన్ హ్యాండ్ సంస్థ వినియోగించుకోవచ్చునని ఆయన సూచన చేశారు. ‘భూమి ప్రైడ్’ ప్రారంభించిన ఈ కామర్స్ సైట్ ఆర్గానిక్ ఉత్పత్తుల అమెజాన్ కావాలని ఆయన ఆకాంక్షించారు.

కార్యక్రమంలో పాల్గొన్న నబార్డ్ తమిళనాడు సీజీఎం సెల్వరాజ్ మాట్లాడుతూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సంస్థ దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో రైతుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందని ప్రశంసించారు. హ్యాండ్ ఇన్ హ్యాండ్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కల్పనా శంకర్ మాట్లాడుతూ CRISIL (Credit Rating Information Services of India Limited) సహకారంతో రైతు ఉత్పత్తి సంఘాల ప్రమాణాల అభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పారు.
ఇదిలావుండగా ‘భూమి ప్రైడ్’ బ్రాండ్ ప్రారంభించిన www.bhumipride.com వెబ్‌సైట్‌లో పలు రకాల ఆర్గానిక్ బియ్యంతో పాటు 22 రకాల చిరు ధాన్యం ఉత్పత్తులు, 18 రకాల పప్పు దినుసులు, తేనె, వంట నూనెలు, మసాలా ద్రవ్యాలు వంటివి లభిస్తున్నాయి. ఇవన్నీ రసాయనాల ప్రమేయం లేకుండా పండిన పంటల తాలూకు ఉత్పత్తులు. సహనా శంకర్ చీఫ్ ‘భూమి ప్రైడ్’ బ్రాండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆసక్తిగలవారు ఈ చిరునామాను సంప్రదించవచ్చు.
Bhumi Pride, New No. 33, Old No. 14,
48th Street, 9th Avenue, Ashok Nagar, Chennai, Tamil Nadu 600083,
Phone: 044 4341 3221, +91 44- 4341 3200 contact@bhumipride.com
info@hihseed.org

Exit mobile version