Site icon V.E.R Agro Farms

జీవామృతం అంటే ఏమిటి?

జీవామృతం అంటే ఏమిటి? విషపూరితమైన రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయమే ఘన జీవామృతం. ఇది దేశీ ఆవుల పేడ తదితరాలతో తయారవుతుంది. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పితామహుడైన సుభాష్ పాలేకర్ సూచించిన విధానంలో తయారైన ఘన జీవామృతం పంటలకు సురక్షితమైనదే కాక అధిక దిగుబడిని ఇస్తుంది. జీవామృతం చల్లిన పంటభూమిలో వానపాములు చైతన్యవంతమై అన్ని రకాల పోషకాలను పంటలకు అందించేందుకు నిరంతరం శ్రమిస్తాయి.

జీవనద్రవ్యంతో కూడిన భూసారాన్ని పరిరక్షించుకోవడం అవసరం. మెట్టపొలాల్లో ఆచ్ఛాదనకు గడ్డి లేకపోతే, భూమిని పైపైన దుక్కి చేసి మట్టి పెళ్లలతో ఆచ్ఛాదన కల్పింవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటి ఎరువూ వేయనక్కర లేదు. దేశీ లేదా నాటు (దేశీ) ఆవు పేడ, మూత్రంతో తయారైన ‘జీవామృతం’లో కోటానుకోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. జీవామృతం పంటకు బలాన్ని ఇస్తుంది. ఈ జీవామృతమును ద్రవ, ఘన రూపాలలో తయారు చేసుకోవచ్చు. V.E.R AGRO FARMS ఘనజీవామృతాన్ని ప్రామాణిక విధానంలో తయారు చేసే అందిస్తోంది. దీనిని అన్ని రకాలైన పంటలకూ వాడవచ్చు. అలాగే మిద్దె పంటలకు, ఉద్యాన పంటలకు, తోటలకు కూడా ఉపయోగించవచ్చు. ఈ ఘనజీవామృతం ప్రకృతి వ్యవసాయ నిపుణుల పర్యవేక్షణలో తయారవుతుంది. ప్రకృతి వ్యవసాయ విధానంలో పండే పంటలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది.

జీవామృతం అంటే ఏమిటి?

For Orders Please Contact- V.E.R AGRO FARMS, Ph: 7396394749, 6303311894, Email: infonet@veragrofarms.com.

ఆర్డర్లు కోసం సంప్రదించండి :- వి ఈ ఆర్ ఆగ్రో ఫామ్స్, Ph: 7396394749, 6303311894, Email: infonet@veragrofarms.com.

Exit mobile version