Site icon V.E.R Agro Farms

సుభాష్ పాలేకర్ విశిష్ట వ్యవసాయ విధానం

Who is Subhash Palekar? సుభాష్ పాలేకర్ పేరు భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానాలతో ముడిపడిన పేరు. ఆయన అనన్య ప్రకృతి ప్రేమికులు. పంటలకు రసాయిన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా ఆరోగ్యకరమైన సహజ పద్ధతుల్లో అధిక దిగుబడి సాధించి చూపిన ఘనత పాలేకర్ గారిదే. ఒక్కమాటలో చెప్పాలంటే సుభాష్ పాలేకర్ భారత ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్. ఆయన అభివృద్ధి పరచిన వ్యవసాయ పద్ధతికి పాలేకర్ విధానంగా ప్రాచుర్యం పొందింది. ఇదే ప్రకృతి వ్యవసాయం.

సుభాష్ పాలేకర్ 1949 మహారాష్ట్ర లోని అమరావతి జిల్లాకు చెందిన బెలోరా అనే గ్రామంలో జన్మించారు. వ్యవసాయం అంటే తనకున్న మక్కువతో వ్యవసాయ రంగంలో పట్టా పొందారు. తండ్రితో పాటు వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. ఒక్క దేశవాళీ ఆవుతో సుమారు 30 ఎకరాలలో మిశ్రమ సేంద్రియ పంటలను పండించవచ్చని అంటారు సుభాష్ పాలేకర్. దేశవాళీ ఆవు పేడ, మూత్రము పంటలకు ఎంతో ముఖ్యమని చెబుతారు. దేశీఆవు పేడ, మూత్రము ఇచ్చినంత ఫలితాన్ని మరేదీ ఇవ్వదని పాలేకర్ ప్రదిపాదించారు.

నిత్యం ప్రయాణాలు, సదస్సులు, ఉపన్యాసాలతో గడిపే పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల సమర్థకులుగా మనదేశంలోనే గాక ప్రపంచప్రసిద్ధి పొందారు. ఇప్పటివరకు పాలేకర్ 50కి పైగా పుస్తకాలు వ్రాశారు. ఆయన ఏకబిగిన పన్నెండు గంటలపాటు ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అడవిలోని చెట్లు, ఫల వృక్షాలకు ఎవరు నీరు పోస్తున్నారు? ఎవరు ఎరువులేస్తున్నారు? క్రిమిసంహారక మందులెవరు చల్లుతున్నారు? ఆ పనులు చేసేవారెవరూ ఉండరు. కానీ ప్రకృతే ఆ బాధ్యతను తీసుకుంది. ఇలా సహజసిద్దంగా పండిన పంట రుచికరంగా ఉండడమే కాక పోషక విలువలు ఎక్కువగా కలిగి వుంటాయి. ఈ ఆలోచనే సుభాష్ పాలేకర్ ప్రకృతి సేద్యం అనే ఉద్యమం వైపు తిప్పింది.

ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు కావలసిని సలహాలనిస్తారు పాలేకర్. ఈ విషయంలో కొంత మంది కలసి ఎక్కడిరమ్మన్నా వస్తారు. వారికి తగు సలహాలను, సూచనలను ఇస్తారు. సుభాష్ పాలేకర్ ఆలోచనలతో ప్రభావితమై దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది రైతులు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఆయనకు నెలలో ఇరవై రోజులు ప్రయాణాలలో, అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్న సదస్సులతోనే సరిపోతుంది. సాగులో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడడం వల్ల రోగాల పాలవుతున్నామని ఆయన హెచ్చరిస్తారు. రసాయనిక సాగుతో పండిన పంటల్లో కూడా రసాయనిక అవశేషాలు ఉంటాయని ఆయన నిరూపించారు. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఆయన చెబుతారు. ఈ దుఃస్థితి నుంచి బయటపడాలంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని పాలేకర్ ప్రతిపాదిస్తారు. పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని zero budget natural farming (ZBNF)గా వ్యవహరిస్తారు. 

పాలేకర్ ప్రకృతిసేద్యం పద్ధతికి ఆకర్షితులైన లక్షలాదిమంది రైతులు ఆ విధానంలో వ్యవసాయం చేస్తున్నారు. అలా వ్యవసాయ దారులుగా మారిన వారిలో, వ్యాపార వేత్తలు, విద్యాధికులు. సాప్ట్ వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. ఈ విధానంలో వ్యవసాయం చేస్తున్నవారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుమారు లక్షమందిదాకా ఉన్నట్లు ఒక అంచనా.

హైదరాబాదులో పాలేకర్ వ్యవసాయ విధానానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యాలయం ఉంది. ప్రకృతి సేద్యం చేయాలనుకునేవారికి ఒక ఎకరానికి సరిపడా విత్తనాలను ఉచితంగా ఇస్తామంటున్నారు ఈ కార్యాలయంవారు. విద్యావంతులైన పాలేకర్ కుమారులు ఇద్దరూ తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి తండ్రి బాటలోనే ప్రయాణిస్తూ ఆయనకు చేదోడు వాదోడుగా వుంటున్నారు.

సుభాష్ పాలేకర్ సేంద్రియ వ్యవసాయ విధానాల స్ఫూర్తితో ఈశ్వర్ ఆగ్రో ఫామ్స్ పంటల కోసం పూర్తి దేశవాళీ ఆవుల పేడ తదితరాలను ఉపయోగించి ఘనజీవామృతాన్ని తయారు చేస్తోంది. మొక్కల ఎదుగుదలకు ఈ సహజ ఎరువు సంజీవని వంటిది. అన్ని రకాల పంటలకూ దీనిని ఉపయోగించవచ్చు. రసాయన ఎరువుల విషాలకు ఘనజీవామృతమే సరైన విరుగుడు. ఇది సరసమైన ధరలకే లభిస్తుంది.  

The father of ZBNF and Padma Shri Awardee, Sh. Subash Palekar has provided four important non-negotiable guidelines: Bijamrita (Seed Treatment using local cow dung and cow urine), Jiwamrita (applying inoculation made of local cow dung and cow urine without any fertilizers and pesticides), Mulching (activities to ensure favourable microclimate in the soil), and Waaphasa (soil aeration).

Who is Subhash Palekar? సుభాష్ పాలేకర్ జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం

For Orders Please Contact- V.E.R AGRO FARMS, Ph: 7396394749, 6303311894, Email: infonet@veragrofarms.com.

ఆర్డర్లు కోసం సంప్రదించండి :- వి ఈ ఆర్ ఆగ్రో ఫామ్స్, Ph: 7396394749, 6303311894, Email: infonet@veragrofarms.com.

Exit mobile version