దేశంలోని చెరకు రైతులకు రూ.3,500 కోట్ల మేరకు సబ్సిడీ అందించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ట్వీట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఐదు కోట్ల చెరకు రైతులు, వారి కుటుంబాలకు, సంబంధిత రంగాలకు చెందిన కార్మికులకు ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. చెరుకు రైతులకు తోడ్పడే ఈ నిర్ణయం తీసుకున్నందుకుగాను ప్రధాని నరేంద్ర మోదీకి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాయాన్ని తాము నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఆయన వివరించారు.

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ డిసెంబర్ 16న సమావేశమై చెరకు రైతులకు రూ.3,500 కోట్ల సబ్సిడీ సాయం అందించాలని నిర్ణ‌యించింది. ప్రస్తుతం భారతదేశంలో ఐదు కోట్ల మంది చెరకు రైతులు (గన్నా కిసాన్), వారిపై ఆధారపడినవారు ఉన్నారు. దీనికి తోడు చక్కెర మిల్లులు మరియు సహాయక కార్యకలాపాలలోనూ ఐదు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు; మరియు వారి జీవనోపాధి చక్కెర పరిశ్రమ పైనే ఆధారపడి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here