సన్నాల్లోనే సన్నరకం. దిగుబడి ఎక్కువ. చీడ, పీడలను తట్టుకుంటుంది. తాలు ఉండదు. గాలికి, వానకు, వడగళ్లను కూడా తట్టుకుంటుంది. పైరు నేల మీద పడిపోదు, మైనస్ లు పెద్దగా ఏమీ ఉండవు. మామూలు పంటల కన్నా పది రోజులు ముందే కోతకు వస్తుంది. నాణ్యత బెస్ట్. అత్యంత సన్నరకం. వానాకాలంలోనూ, వేసవి కాలంలో కూడా పంట పండించేందుకు అనువైనది. వానాకాలం కన్నా వేసవికాలం పంటలో మరింత ఎక్కువ దిగుబడి ఇస్తుంది. నారు పోసి, నాటుకోవచ్చు, విత్తనాలు వెదజల్లి కూడా సాగు చేస్తే మరింత అధిక దిగుబడి వస్తుంది. అదే జీనెక్స్‌ వరి రకం.జీనెక్స్‌ చిట్టిపొట్టి వరి పండించడంలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం ఎర్రగట్టు రైతు తాటికొండ రమేష్ రెడ్డి మంచి అనుభవం సంపాదించారు. రమేష్ రెడ్డి మాత్రమే కాకుండా అదే ఊరిలో మరింత మంది రైతులు కూడా ఈ చిట్టిపొట్టి రకం వరిపైరు సాగుచేస్తున్నారు. వానాకాలం ఖరీఫ్ సీజన్‌ లో పది ఎకరాల్లో జీనెక్స్ సూపర్ ఫైన్ రకం వరి పండించారు. దిగుబడి, ధర కూడా ఎక్కువ రావడంతో మరింత సాగు నేల పెంచి 18 ఎకరాల్లో రబీ సీజన్ అంటే ఎండాకాలం పంట వేశారు రమేష్ రెడ్డి.

రాళ్లు రప్పలతో నిండి, నిష్ప్రయోజనంగా ఉండే గుట్ట భూమిలో కూడా జీనెక్స్‌ సూపర్ ఫైన్ వరి రకాన్ని పండించుకోవచ్చు. కాకపోతే.. ఆ రాళ్లు రప్పల మీద మట్టి పోసుకోవాల్సి ఉంటుంది. అయితే.. రాళ్లు రప్పలు కవర్ అయ్యేలా మట్టి పోసేందుకు రమేష్‌ రెడ్డి ఎకరానికి రూ.5 లక్షల దాకా ఖర్చు పెట్టారు. నాలుగైదు పంటలు చేతికి వచ్చే సరికి జీనెక్స్ వరి పండించే రైతుకు గుట్ట భూమిని పంటకు అనుకూలంగా మార్చేందుకు అయిన ఖర్చు చేతికి వచ్చేస్తుంది. ఆపైన పండే పంట అంతా లాభదాయకంగా ఉంటుందని రమేష్ రెడ్డి తెలిపారు.వానాకాలంలో రమేష్ రెడ్డికి చిట్టిపొట్టి రకం జీనెక్స్‌ వారి నాటుకుంటే.. 75 కిలోల చొప్పున 42 బస్తాల చొప్పున ఎకరంలో బాగా ఎండిన ధాన్యం దిగుబడి వచ్చింది. జీనెక్స్ వరి పంట కాలం 125 రోజులు ఉంటుంది. వేరే రకాల వరి వేసుకుంటే మరి కాస్త ఆలస్యంగా పంట చేతికి వస్తుంది. ఇతర సన్న రకాల వరి కన్నా ఓ పది పదిహేను రోజులు ముందే పంట రావడం వల్ల కూడా రైతన్నలకు లాభదాయకం అనే చెప్పొచ్చు. అంటే వాతావరణ ప్రతికూలతల కన్నా ముందుగా పంట చేతికి రావడం వల్ల కూడా రైతుకు కష్టం, నష్టం అనేది ఉండదు.

నారు పోసి, నాటుకుని లేదా విత్తనాలు వెదజల్లుకుని కూడా జీనెక్స్ సూపర్ ఫైన్ వరి సాగు చేసుకోవడానికి వీలైన రకం. నారు నాటుకున్న పొలం కన్నా విత్తనాలు వెదజల్లిన భూమిలో పైరు మరింత బాగా ఉందని, ఎక్కువ దిగుబడి వస్తుందని రమేష్ రెడ్డి చెప్పారు. డిసెంబర్ లో పంట చేతికి వస్తే.. ఫిబ్రవరి వరకు నిల్వ చేసుకుని అమ్మితే.. జీనెక్స్‌ ధాన్యానికి 75 కిలోల బస్తాకు రూ.2,300 చేతికి వచ్చిందన్నారు. అదే పచ్చిగానే జీనెక్స్‌ ధాన్యం అమ్మితే 48 నుంచి 50 బస్తాల వరకు ఉంటుంది. కానీ ధర రూ.16 లేదా 17 వందలు పలికే అవకాశం ఉంది. అందుకే బాగా ఎండబెట్టిన జీనెక్స్‌ ధాన్యం అమ్మితేనే లాభదాయకంగా ఉంటుందని రమేష్ రెడ్డి వివరించారు.జీనెక్స్ ధాన్యం నుంచి బియ్యం కూడా చాలా క్వాలిటీగా వస్తుండడంతో మిగతా సన్న రకాలతో పోలిస్తే ధర మరింత ఎక్కువ వస్తోందని రమేష్‌ రెడ్డి వెల్లడించారు. ఇతర సన్న రకాల ధాన్యం కన్నా ఎకరా మీద రూ.6 నుంచి 7 వేల రూపాయలు ఎక్కువ ఆదాయం లభిస్తుందన్నారు. జీనెక్స్ సూపర్ ఫైన్ వరి వర్షాకాలం పంటగా వేసినా, ఎండాకాలం పంటగా సాగుచేసినా తెగుళ్లను బాగా తట్టుకుంటోందని రమేషన్ రెడ్డి తెలిపారు. ఇతర రకాల వానాకాలం పంటకు దోమకాటు కొద్దిగా ఉన్నా రెండుసార్లు మందు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఎత్తు తక్కువ ఉండడం వల్ల జీనెక్స్‌ వరికి ఇతర రకాల కన్నా ఎక్కువ నియంత్రణలో ఉంటుందని అన్నారు. జీనెక్స్‌ వరి పైరు చాలా పచ్చగా ఉంటుంది. ప్రతి వరి మొక్కకు 40 నుంచి 50 పిలకల దాకా వచ్చి మంచి దుబ్బు కడుతుంది. అదే ఇతర సన్న రకాల వరికైతే 30 నుంచి 35 పిలకల వరకు మాత్రమే వచ్చేవని రమేష్ రెడ్డి చెప్పారు. చాలా అరుదుగా 40 వరకు పిలకలు వచ్చేవన్నారు. పైరు ఎత్తు చాలా తక్కువ ఉండడం వల్ల గాలి, దుమ్ము, వానలకు కింద పడదు జీనెక్స్ వరి.వర్షాలు, గాలులకు పైరు కింద పడిపోతే కోతకు ఖర్చు పెరిగిపోతుంది. కోత కోసే సమయం ఎక్కువ అవుతుంది. ధాన్యం నాణ్యత కూడా తగ్గుతుంది. జీనెక్స్ రకం కింద పడిపోయే అవకాశం లేదు కనుక అలాంటి ఇబ్బందులు ఉండవు. ఖర్చు కూడా ఎక్కువ అవదు. అన్ని ఫెర్టిలైజర్ షాపుల్లోనూ జీనెక్స్‌ సూపర్ ఫైన్ విత్తనాలు దొరుకుతున్నాయి. 10 కిలోల జీనెక్స్‌ విత్తనం ధర రూ. 1,000 ఉంటుంది. విత్తనాలు వెదజల్లితే ఎకరానికి 6 నుంచి 7 కిలోలు సరిపోతాయి. నారు నాటే విధానంలో అయితే.. మూడు బ్యాగులు పోసుకుంటే రెండున్నర ఎకరాలకు వస్తుంది. నాటు విధానంలో అయితే.. ఎకరానికి సుమారు 8 నుంచి 9 కిలోల విత్తనాలు అవసరం అవుతాయి.చిట్టిపొట్టి రకం జీనెక్స్‌ వరి పంట సాగు చేయాలనుకునే ఔత్సాహిక రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలను లేదా, ఇప్పటికే ఈ పంట పండిస్తున్న రైతులను కలిసి వివరాలు సేకరించుకుంటే మంచిది. పంట సాగు అవుతున్న పొలాలను స్వయంగా దర్శించి, వివరాలు అవగాహన చేసుకుంటే మరింత మేలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here