రాబిట్‌.. కుందేలు లేదా చెవులపిల్లి. చూసేందుకు ముచ్చటగా.. చాలా చిన్నగా, సున్నితంగా కనిపిస్తుంది. ముట్టుకుంటే కందిపోతుందేమో.. చనిపోతుందేమో అనేలా ఉంటుంది. కానీ కుందేలు చాలా దృఢమైనది. వాతావరణ పరిస్థితులను తట్టుకోగలుగుతుంది. సులువుగా ఎదుగుతుంది. చాలా తొందరగా పునరుత్పత్తి చేసి మంచి ఆదాయాన్ని ఇస్తుంది. మాంసాహార ప్రియులకు చక్కని ఆహారం కూడా. కుందేలు మాంసంలో ఆరోగ్యాన్నిచ్చే  మంచి పోషకాలు ఉన్నాయి. దీనిలో పెద్దమొత్లంలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. చికెన్‌ లేదా ఇతర మాంసాలతో పోల్చుకుంటే కుందేలు మాంసంలో చాలా తక్కువగా కొవ్వు పదార్థాలు, కొలెస్ట్రాల్‌ ఉంటాయి. కుందేలు బొచ్చుకు కూడా ఎంతో డిమాండ్ ఉంది. కుందేలు బొచ్చు నుంచి ఏడాదికోసారి ఆదాయం వస్తుంది. అదిపెరిగిన వాతావరణం, దానికి పెట్టిన ఆహార నాణ్యత, జాతి మరీ ముఖ్యంగా దాని ఆరోగ్య స్థితిపై ఆధారపడి బొచ్చు నాణ్యత, పరిమాణం ఉంటుంది. ఇలాంటి రాబిట్ ఫార్మింగ్‌ ను రైతులు చిన్నతరహా పరిశ్రమగా నిర్వహించుకోవచ్చు.మన దేశంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది రాబిట్‌ ఫార్మింగ్‌ పరిశ్రమ. అతి తక్కువ స్థలంలో కూడా రాబిట్ ఫార్మింగ్‌ చాలా సులువుగా చేసుకోవచ్చు. ఒక్కో ఆడ కుందేలు ప్రతి రెండు నెలలకు కనీసం ఆరు నుంచి ఏడు పిల్లలకు జన్మనిస్తుంది. కుందేలు గరిష్టంగా 5నుంచి 8 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుంది. ఐదేళ్ల వయస్సువచ్చే వరకు దానికి పునరుత్పత్తి అవకాశాలు ఉంటాయి. రెండు నెలలకు ఒకసారి చొప్పున కుందేలు ఆరేడు పిల్లల చొప్పున ఐదేళ్లలో కనీసం 300 పిల్లలకు జన్మనిస్తుంది. పెరిగిన ఒక్కో కుందేలు మూడు కిలోల వరకు బరువు వస్తుంది. కుందేలు పిల్ల పుట్టిన తర్వాత 8 నుంచి 12 వారాలకు మాంసం వినియోగానికి ఉపయోగపడుతుంది. మాంసం కిలో కనీసం రూ.250 ఉంటే..రూ.2.50 లక్షలు వరకూ ఆదాయం తెచ్చిపెడుతుంది.కుందేళ్లను పంజరాల్లో లేదా చిన్న చిన్న గుడిసెల్లో కూడా పెంచుకోవచ్చు. కుందేళ్లను పెంచుకునే చోట వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కుందేళ్లను పెంచే ప్రదేశం పరిశుభ్రంగా, పొడిగా ఉండేలా చూడాలి. వాతావరణ పరిస్థితులను బట్టి కుందేళ్లను ఇన్‌ డోర్‌ లోను ఔట్‌ డోర్ లో పెట్టుకోవచ్చు. కుందేళ్లు ఆరోగ్యంగా ఎదగాలంటే పచ్చిగడ్డి కానీ, తాజా కూరగాయలు కానీ వాటి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారం కానీ ఇవ్వాలి. కుందేలు లేదా చెవులపిల్లిని చెవులు పట్టుకుని పైకి ఎత్తాలని అందరూ అనుకుంటారు. కానీ మూడు కిలోల బరువుంటే కుందేలును చెవులు పట్టుకుని పైకి లేపితో చెవు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కుందేలు నడుము భాగంలో వెన్నుపూసకు అటూ ఇటూ ఉండే చర్మాన్ఇన రెండు వెళ్లతో పట్టుకుని పైకి లేపితే అవి కూడా చాలా కంఫర్ట్‌ గా ఉంటాయి.బ్రీడింగ్‌ దశకు వచ్చిన 7 ఆడ, 3 మగ కుందేళ్లతో కూడిన ఒక్కో యూనిట్‌ రూ.17,500 నుంచి రూ.18 మధ్యలో లభిస్తుంది. పంజరం ఖర్చు కూడా అందులోనే ఉంటుంది. 10 అడుగుల ఎత్తు 4 అడుగుల వెడల్పుతో తయారు చేసిన ఇనుప పంజరాలను కర్ణాటకలోని దావణగెరెకు చెందిన రైతు సీఎన్ సుధీంద్రరెడ్డి అందజేస్తారు. కనీసం మూడు యూనిట్ల కుందేళ్ల కోసం కనీసం 50 నుంచి 55 వేల దాకా ఖర్చవుతుంది. కుందేలు పంజరాలను షెడ్‌ కాని, పాక గాని వేసుకుని పెట్టొచ్చు. దాని రూఫ్ మాత్రం వర్షం కురవకుండా, ఎండ నేరుగా పడకుండా ఉండాలి. చుట్టూరా వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. షెడ్‌ కోసం తొలిసారి మాత్రమే ఖర్చవుతుంది. ఆ తర్వాత షెడ్ ఖర్చు ఉండదు. ఆవులు, గేదెలు, కోళ్లు, గొర్రెలు, మేకలు లాంటి వాటి కోసం వేసుకునే షెడ్‌లో నేలను సిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కుందేళ్లను పెంచే షెడ్‌ లో ఆ ఖర్చు ఉండదు. మామూలు మట్టి నేలే సరిపోతుంది.కుందేలు యూనిట్లను సరఫరా చేయడమే కాకుండా రైతులు పెంచిన కుందేళ్లను తిరిగి సుధీంద్రరెడ్డి కొంటారు. కుందేళ్లను విక్రయించమే కాకుండా వాటి పెంపకం ఎలా చేయాలి, ఏమేమి ఆహారంగా ఇవ్వాలి? వ్యాధులు వస్తే ఎలాంటి మందులు వాడాలో కూడా పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. కుందేళ్ల పెంపకం ఇతర ఇబ్బందులు వస్తే సూచనలు, సలహాలు ఇస్తామని సుధీంద్ర రెడ్డి చెప్పారు. ఎమ్మెస్సీ చేసిన సుధీంద్రరెడ్డి 18 ఏళ్లుగా కుందేళ్ల ఫార్మింగ్ ను స్వయంకృషి మోడరన్‌ ఫార్మ్‌ పేరిట విజయవంతంగా నిర్వహిస్తున్నారు.తక్కువలో తక్కువ మూడు యూనిట్ల కుందేళ్లను పెంచుకుంటే లాభదాయంగా ఉంటుంది. మూడు పంజరాల్లో కలిపి 21 ఆగ, 9 మగ కుందేళ్లు ఉంటాయి. ఒక్కో ఆడ కుండేలు రెండు నెలలకోసారి ఆరేడు పిల్లల్సి పెడుతుంది. అలా 21 ఆడ కుందేళ్లు రెండు నెలల్లో 100 నుంచి 120 పిల్లలకు జన్మనిస్తాయి. అంటే కుందేళ్ల పెంపకం ప్రారంభించిన మూడు నుంచి నాలుగు నెలల్లో మనకు ఆదాయం మొదలవుతుంది. అప్పటి నుంచి ఆ ఆదాయ ప్రతి రెండు నెలలకు ఒకసారి చేతికి వస్తుంది. కుందేళ్ల యూనిట్ కొని, వాటిని పెంచిన ఖర్చులు పోగా మంచి లాభమే కనిపిస్తుంది. ఇతర పరిశ్రమల మాదిరిగా కాకుండా కుందేళ్ల పెంపకానికి అతి తక్కువ మంది మనుషులే అవసరం అవుతారు.కుందేళ్ల కోసం ప్రత్యేకంగా షెడ్ వేయాల్సి పని లేకుండా కోళ్లఫారంలో కానీ, డైరీ ఫాంలో లేదా మేకలు, గొర్రెల ఫాంలో లేదా సిల్క్‌ ఫాంలో అయినా ఒక మూలన కుందేళ్లను పెంచుకోవచ్చు. లేదా మన ఇంటి పక్కనే పెరట్లో షెడ్ వేసుకుని కూడా పెంచుకోవచ్చు.కర్ణాటకలోనే కాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కుందేలు మాంసానికి మంచి డిమాండ్ వస్తోందని సుధీంద్రరెడ్డి చెప్పారు. ఆ రాష్ట్రాల్లో రైతులకు కూడా కుందేళ్ల యూనిట్లు సరఫరా చేయడమే కాకుండా మార్కెటింగ్‌ కూడా చేసి పెడతామన్నారు. కుందేళ్ల యూనిట్లు రైతులకు ఇచ్చేటప్పుడే తాము పెరిగిన కుందేళ్లను కొంటామని ఒప్పందం చేసుకుంటామన్నారు. అంటే.. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియని రైతులకు తామే కొంటామని సుధీంద్రరెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అయితే.. తమకు రవాణా ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి పెద్దమొత్తంలో కుందేళ్ల స్టాక్‌ ఉండాలని చెప్పారు.ఇక రాబిట్ ఫార్మింగ్‌ లో అతి ముఖ్యమైన అంశం. ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్న కుందేళ్లను కొనుగోలు చేయడం. వాటిని పెంచేందుకు సక్రమమైన సౌకర్యాలు కల్పించాలి. క్రమం తప్పకుడా అవి పెరుగుతున్న విధానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఇలా అతి తక్కువ పెట్టుబడితో, కాస్తంత శ్రద్ధ పెట్టి కుందేళ్లను పెంచుకుంటే లాభదాయకంగా ఉంటుంది.

వివరాల కోసం కింది లింక్‌ లో చూడొచ్చు

https://www.youtube.com/watch?v=9P7GwfTelpA&t=0s

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here