దేశంలో వెదురు పెంపకాన్ని మరింతగా పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 2021 మార్చి 23న మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వెదురు టెక్నాలజీ, ఉత్పత్తులు, సేవలపై వర్చువల్ ఎగ్జిబిషన్‌లో ఆయన ప్రసంగించారు. ఈ ప్రదర్శనను ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ గ్రీన్ ఎనర్జీ (IFGE) నిర్వహించింది. వెదురుకు డిమాండ్ పెంచాల్సిన అవసరం ఉందని గడ్కరీ తన ప్రసంగంలో సూచించారు. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా వెదురును ఉపయోగించుకునే అవకాశం ఉందని, భవన నిర్మాణంలో కూడా దాన్ని ఉపయోగించవచ్చని ఆయన అన్నారు.
అన్ని ఎన్‌హెచ్‌ఏఐ రహదారులపై త్వరలో జనపనార, కొబ్బెర పీచు (కాయిర్) mattresses వాడకం తప్పనిసరి చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు. సాంప్రదాయ ఉత్పత్తులైన జనపనార, కొబ్బెర పీచు (coir), వెదురు ఉత్పత్తులను మరింత అభివృద్ధి పరచడం ద్వారా వాటిని విరివిగా ఉపయోగించాలని ఆయన సూచించారు. వివిధ వర్గాల కృషి కారణంగా భారతదేశంలో వెదురు పరిశ్రమ విలువ 25 నుండి 30 వేల కోట్ల రూపాయల మేరకు విస్తరిస్తుందని గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చు, ఆకర్షణీయమైన ఉత్పత్తి రూపకల్పన వెదురు వాడకాన్ని ప్రోత్సహించగలదని ఆయన చెప్పారు. తద్వారా ప్రజలు వెదురు వినియోగం వైపు మళ్లుతారని, అది వెదురు పెంపకాన్ని ప్రొత్సహిస్తుందని తెలిపారు.

వెదురు టెక్నాలజీపై జరిగిన ఎగ్జిబిషన్‌లో ప్రసంగిస్తున్న నితిన్ గడ్కరీ

వెదురు ప్రమోషన్‌కు సంబంధించిన పథకాలు, కార్యక్రమాలకు ఎంఎస్‌ఎంఇ మంత్రిత్వ శాఖ నుండి అన్ని విధాలా సహాయం అందిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారు. ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాలనీ, ఉత్పత్తి అభివృద్ధికి సరైన విధానం అనుసరించారనీ, దీనికి మార్కెట్ మద్దతు కూడా అవసరమనీ మంత్రి అన్నారు. వెదురు, వెదురు కర్రల వినియోగానికి రైల్వే నుంచి 50 శాతం సబ్సిడీ పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన చెప్పారు. వెదురు వాడకాన్ని పెంచడం ద్వారా వెదురు సాగు పెరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బయో సిఎన్‌జితో పాటు బొగ్గు తయారీకి కూడా వెదురును ఉపయోగించవచ్చని గడ్కరీ అన్నారు. వెదురు మిషన్ నుండి ప్రత్యేక నిధుల సహాయంతో ఐఐటిలు దీనిపై మరింత పరిశోధనలు చేయవచ్చని ఆయన సూచించారు.
మోదీ ప్రభుత్వం Indian Forest Actకు సవరణ తెచ్చి వెదురును వృక్షజాతుల నిర్వచనం నుండి తొలగించింది. దీంతో గిరిజనులు తమ ఉపాధి కోసం వెదురు పెంపకం చేపట్టేందుకు వీలైంది. వెదురు వాడకాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని కేంద్రం భావిస్తోంది.

Virtual Exhibition on Bamboo Technology, Products and Services: Video:

https://youtu.be/IfZBPjgcDE0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here