రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 4వ సిటీ, ఫ్యూచర్‌ సిటీ కి అతి సమీపంలో అనేక హంగులతో ‘నందనవనం’ పేరిట ఆర్గానిక్ పార్మ్‌ ల్యాండ్‌ రూపుదిద్దుకుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెడికల్‌ టూరిజం, స్పోర్ట్స్‌, సాఫ్ట్ట్‌వేర్‌, ఫార్మా రంగాల హబ్‌గా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌ ఫోర్త్‌, ఫ్యూచర్‌ సిటీ ప్రాంతంలో ఈ నందనవనం ఏర్పాటైంది. సీనియర్ జర్నలిస్ట్‌ వర్రే గంగాధర్‌ ఈ ఫార్మ్‌ల్యాండ్‌ను అందంగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దారు. ఈ ఆర్గానిక్ వనంలో 5 గుంటలు అంటే 605 చదరపు గజాలు, 10 గుంటలు అంటే 1210 చదరపు గజాల చొప్పున క్షేత్రాలు అందుబాటులో ఉన్నాయి. నాగార్జునసాగర్‌ హైవేకి కేవలం 5 కిలోమీటర్లు, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు 12వ ఎగ్జిట్‌కు 35 కిలోమీటర్ల దూరంలో నందనవనం ఫార్మ్‌ ల్యాండ్‌ రూపుదిద్దుకుంది. త్వరలోనే సాకారం కాబోతున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు 9 కిలోమీటర్ల లోపలే ఈ ప్రాజెక్టు ఉంది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌సిటీకి మెట్రో సేవలు, ఎలక్ట్రిక్‌ బస్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టంను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.  ఫోర్త్‌సిటీలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రేవంత్‌ సర్కార్ ప్రకటించింది.  వీటితో పాటుగా ఇప్పటికే ఫ్యూచర్‌సిటీలో ఏర్పాటవుతున్న మెడికల్‌ హబ్‌ను గ్రీన్‌ మెడికల్‌ హబ్‌గా తయారుచేయాలని సీఎం ఆదేశించారు. రేవంత్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రీన్ మెడికల్‌ హబ్‌ కూడా త్వరలోనే సాకారం కాబోతుంది.

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో గంగాధర్‌ ఇప్పటికే అభివృద్ధి చేసిన పలు ఫార్మ్‌ ల్యాండ్స్‌ను ఔత్సాహికులు కొనుగోలు చేశారు. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టు నందనవనాన్ని అక్కడికి సమీపంలో అభివృద్ధి చేశారు. ఫార్మాసిటీకి అతి సమీపంలో వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్‌ వారి ‘నందనవనం’ ప్రాజెక్టు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ముచ్చెర్ల ఫార్మాసిటీకి కేవలం కిలో మీటర్‌ దూరంలోనే నందనవనం ప్రాజెక్టు నెలకొంది.వీఈఆర్‌ ఆగ్రోఫార్మ్స్‌ ‘నందనవనం’ ఫార్మ్‌ల్యాండ్‌లో చదరపు గజం రూ.4,999 ధరకే లభిస్తోంది. నందనవనంలో ల్యాండ్‌ కొనుగోలు చేసిన వారికి స్పాట్ రిజిస్ట్రేషన్‌ సౌకర్యాన్ని ప్రాజెక్టు యాజమాన్యం కల్పిస్తుంది. ఇందులో స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి పట్టాదారు పాస్‌ బుక్‌ లభిస్తుంది. ఈ వెంచర్‌లో భూమి కొన్నవారు రైతు బంధు పథకానికి అర్హులవుతారు.

వీఈఆర్‌ ఆగ్రో ఫార్మ్స్‌ ప్రాజెక్టు ప్రత్యేకతలు:

  • నందనవనం ఫార్మ్‌ ల్యాండ్‌ చుట్టూ అత్యంత కట్టుదిట్టమైన చక్కని ప్రహారీగోడను ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ నిర్మిస్తుంది.

– ఫార్మ్‌ ల్యాండ్‌లో మామిడి, సపోటా, నిమ్మ, నేరేడు, జామ, సీతాఫలం, గూస్ బెరి, పనస, కొబ్బరి లాంటి అనేక రకాల పండ్లు, చక్కని ఫలాలు పండే మొక్కలను పూర్తి ఆర్గానిక్ విధానంలో ప్రాజెక్టు యాజమాన్యం పెంచుతుంది.– వారాంతాల్లో సేదదీరేందుకు, ఆటవిడుపు కోసం, ఆహ్లాదంగా సమయం గడిపేందుకు నందనవనంలో భూమి కొన్నవారు తమ ఫార్మ్‌ ల్యాండ్‌ను సందర్శించవచ్చు. తమ ఫార్మ్‌ ల్యాండ్‌లో పండిన పండ్లు, కాయలు కోసి, తీసుకెళ్లవచ్చు.

  • నందనవనం ఫార్మ్‌ ల్యాండ్‌లో డ్రిప్ ఇరిగేషన్ విధానంలో నీటి సదుపాయాన్ని మేనేజ్‌మెంటే కల్పిస్తుంది.– కొనుగోలు చేసిన వారి ఫార్మ్‌ ల్యాండ్‌ను ఐదేళ్ల పాటు ఈవీఆర్‌ నందనవనం ప్రాజెక్టు సంస్థే ఉచితంగా నిర్వహిస్తుంది. ఇందుకు కొనుగోలుదారులు ఎలాంటి రుసుము చెల్లించనక్కరలేదు.

– ఫార్మ్‌ ల్యాండ్‌కు 24/7 పటిష్టమైన పూర్తి భద్రత కూడా సంస్థే ఏర్పాటు చేస్తుంది.

– స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ సంస్థ కల్పిస్తుంది.– వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్‌ ప్రాజెక్టులో భూమిని కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు 7396394749 ఫోన్ నెంబర్‌ లో సంప్రదించవచ్చు. లేదా www.veragrofarms.com లో కూడా వివరాలు తెలుసుకోవచ్చు.– నందనవనం ప్రాజెక్టులో భూమి కొనుగోలు చేస్తే.. పెట్టిన పెట్టుబడికి చక్కని ఎదుగుదల ఉంటుందని ఇంతకు ముందు ఈ సంస్థ అభివృద్ధి చేసిన పలు ఫార్మ్‌ ల్యాండ్‌లలో భూములు కొనుగోలు చేసిన వారు చెబుతున్న మాట.