చిన్నప్పటి నుంచీ తాను కంటున్న కలను ఓ 27 ఏళ్ల బందరుబాబు 2017లో నెరవేర్చుకున్నాడు. ప్రకృతి సాగులో మమేకమై తానే ఓ సరికొత్త ఆర్గానిక్‌ ప్రపంచాన్ని తన టెర్రస్‌ మీదే సృష్టించుకున్నాడు. కుటుంబ అవసరాలకు కావాల్సిన పండ్లు, కూరగాయలు తానే సేంద్రీయ విధానంలో పండించుకుంటున్నాడు. తనతో పాటు ‘బందరు బృందావనం’ పేరుతో ఫేస్‌బుక్‌లో ఓ గ్రూప్‌ సృష్టించాడు. ఆ గ్రూపులో సమాచారం, వీడియోలు పెట్టి ప్రకృతి వ్యవసాయం వైపు వందలాది మంది అడుగులు వేసేలా చేస్తున్నాడు. ఈ నాటి మన కథకు బందరుబాబు అదేనండీ అన్నా మణిరత్నం మన హీరో.

నెలకు కేవలం 500 లేదా 600 రూపాయల ఖర్చుతో జీవామృతం, పంచకావ్య లాంటి ఆర్గానిక్‌ ఎరువులు సొంతంగా తయారు చేసుకుంటున్నాడు బందరుబాబు. కొద్దిపాటి ఖర్చుతో తన టెర్రస్‌ గార్డెన్‌పై ఎర్రజామ (రెడ్‌ గువా), సీతాఫలం లాంటి పండ్ల జాతులు, టమాటా, వంకాయ లాంటి కూరగాయల మొక్కలు, తోటకూర, గోంగూర, పాలకూర లాంటి ఆకు కూరల జాతులు, మల్లెపూవు లాంటి పూలమొక్కలు, జుట్టుకు మేలు చేసే భృంగరాజ్‌, ఉప్పిచెట్టు (సోర్‌సోప్‌), బోన్సాయ్‌ మొక్కలు ఎన్నో పెంచుతున్నాడు. ఇలా తన 675 చదరపు అడుగుల టెర్రస్‌పై 100 రకాలకు పైగా మొక్కల్ని మణిరత్నం పెంచుతున్నాడు.పాత ఇంటిలో ఉన్నంతకాలం మణిరత్నం కల నెరవేరనే లేదు. 2017లో కొత్త ఇంటిలోకి మారడం ద్వారా మణిరత్నం చిన్ననాటి కల నెరవేరింది. మూడేళ్లలో మణిరత్నం టెర్రస్‌ గార్డెన్‌ ఇప్పుడు ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందులు అస్సలు వాడకుండా చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించే పంటలనే ఆహారంగా తీసుకుంటున్న మణిరత్నం కుటుంబం ఆరోగ్యంగా ఉంది. సహజ వ్యవసాయ విధానంలో తాను నిర్వహించే టెర్రస్‌ గార్డెనింగ్‌ టిప్స్‌ను ఇప్పుడు మణిరత్నం తన ఫేస్‌ బుక్‌ గ్రూప్‌ ద్వారా పదుగురితో పంచుకుంటున్నాడు.

మొదట మణిరత్నం తన టెర్రస్‌పై తులసి మొక్కలు పెంచడం ద్వారా ఆర్గానిక్‌ ఫార్మింగ్ ప్రారంభించాడు. తర్వాత మల్లె లాంటి పలు పూలమొక్కల విత్తనాలు, టమాటా, వంకాయ లాంటి కాయగూరల విత్తనాలు సంపాదించి టెర్రస్‌పై పాత ప్లాస్టిక్‌ డబ్బాలు, బకెట్లలో నాటాడు. ఆ మొక్కల నుంచి వచ్చే పంటలను మణిరత్నం కుటుంబం నిత్యం వినియోగిస్తోంది. మొక్కలకు జీవామృతం, పంచకావ్య లాంటి ఆర్గానిక్ ఎరువులు మాత్రమే వాడుతున్నాడు. ఈ ఆర్గానిక్‌ ఎరువుల తయారీకి ముందుగా మణిరత్నం తన ఇంటి చుట్టుపక్కల ఆవులున్న వారి నుంచి పేడ, ఆవు మూత్రం తీసుకుని టెర్రస్‌పైనే పాత డబ్బాల్లో వాటిని నిల్వ ఉంచేవాడు. వాటిలో నీరు కలిపి పలుచగా చేసి ప్రతి నెలా 150 లీటర్ల జీవామృతం తయారుచేసేవాడు. ఆ జీవామృతాన్ని ప్రతి 14 రోజులకు ఓసారి మొక్కలకు వేస్తాడు. తాను ఆర్గానిక్‌ పార్మింగ్‌ ప్రారంభించిన తొలి రోజుల్లో తమ చుట్టుపక్కల వారు ఆవుపేడ, మూత్రాన్ని ఉచితంగానే ఇచ్చేవారని మణిరత్నం చెప్పాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఆర్గానిక్‌ ఎరువులు కొనేందుకు కూడా బయట దొరకనప్పుడు తమ వంట ఇంట్లో మిగిలిన పదార్థాలనే కంపోస్ట్ ఎరువుగా తయారు చేసి వినియోగించినట్లు వెల్లడించాడు.టెర్రస్‌పై మరిన్ని ఎక్కువ మొక్కలను పెంచాలనుకున్నప్పుడు సిమెంట్‌ కుండీలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపాడు మన యువకుడు మణిరత్నం. టెర్రస్‌పై తాను పెంచిన మొక్కలు ఎదిగిన తర్వాత 2019 నుంచీ ఇక బయటి నుంచి ఆర్గానిక్ ఎరువులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు మణిరత్నం. ఆ నిర్ణయంతో తన మొక్కలకు కావాల్సిన కంపోస్ట్ ఎరువులు సొంతంగా తయారుచేసుకోవడం ప్రారంభించాడు. దీంతో ఖర్చు నెలకు 500 నుంచి 600 మాత్రమే అవుతోందన్నాడు. అదే సమయంలో ఆర్గానిక్‌ విధానంలో పండిస్తున్న పంటలను వినిగిస్తున్న కారణంగా తమ వంట ఇంటిలో వృథా తక్కువగా వస్తుండడం గమనించినట్లు తెలిపాడు మణిరత్నం. ఇంటిలో వచ్చే తడి చెత్తను కంపోస్ట్‌ ఎరువుగా తయారు చేస్తున్నామని, సీసాలు, డబ్బాలు లాంటి పొడి చెత్తను మొక్కలు పెంచేందుకు వినియోగిస్తున్నానన్నాడు. ఆర్గానిక్‌ పంటల ద్వారా తన స్థిరమైన జీవన విధానం గురించి చుట్టుపక్కల వారికి వివరించి, ప్రకృతి పంటల విధానం అవలంబించేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపాడు.టెర్రస్‌పై ప్రకృతి పంటలు పండించేందుకు ముందుగా తాను ఆర్గానిక్‌ ఫార్మింగ్‌పై గుంటూరులో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఓ పదిహేను రోజుల పాటు పాల్గొన్నట్లు మణిరత్నం వెల్లడించాడు. అదే అవగాహన శిబిరంలో పరిచయమైన గౌరీ కావ్యతో కలిసి ‘బందర్ బృందావనం’ అనే ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశానన్నాడు. తమ గ్రూప్‌ 1,000 మంది సభ్యులతో ఓ కుటుంబంలా ఉంటున్నామన్నాడు. గ్రూపు ద్వారా ఆర్గానిక్ ఎరువులు, పురుగుమందులు ఎలా తయారుచేసుకోవాలో, విత్తనాలను ఎలా నాటుకుని, మొక్కల్ని పెంచాలో వీడియోల ద్వారా టిప్స్‌ కూడా ఇస్తున్నాడు. దాంతోపాటుగా తనకు 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న తన గ్రూపులోని సభ్యులకు విత్తనాలు అందజేస్తున్నాడు మణిరత్నం. దాని ప్రతిఫలంగా వారు తమ తోటలో పండించిన విలక్షణమైన పంటలను ఇస్తారని చెప్పాడు. ఈ మార్పి వ్యవహారం మొత్తం ఇంచుమించు ఉచితంగా కొనసాగుతోందన్నాడు.

భవిష్యత్తులో తమ గ్రూపు ద్వారా మరింత ఎక్కువ మంది తమ తమ ఇళ్లలో ఆర్గానిక్‌ పంటల సాగు చేసేలా చేయాలని ఆశాభావంతో మణిరత్నం ఉన్నాడు. తద్వారా మంచి జీవన విధానం అలవాటు అవుతుందని, ఆరోగ్యకరమైన సమాజం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు మన బందరుబాబు అన్నె మణిరత్నం.

You can join Mani’s FB group Bandar Brundavanam here.

Or contact on mobile number: +918885382341

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here