క్రమశిక్షణ గల పోలీస్‌ అధికారి. డ్యూటీలో ఆ ఐపీఎస్‌ పీపుల్స్‌ ఫ్రెండ్లీ. సమస్య ఏదైనా సామరస్యంగా పరిష్కరించే సత్తా ఉన్నోడు. ఏ అంశాన్నైనా క్షుణ్ణంగా అధ్యయనం చేసే మనసున్నోడు. నిరంతర అధ్యయన శీలి. సమాజ హితం కోరే మంచి మనిషి.. ఆర్థిక నేరస్థులకు దడ పుట్టించిన సీబీఐ అధికారి. పోలీస్‌ ర్యాంకుతో ఇంటి పేరుగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనే వాసగిరి వెంకట లక్ష్మినారాయణ (జేడీ లక్ష్మీనారాయణ).రైతులంటే, వ్యవసాయం అంటే జేడీ లక్ష్మీనారాయణకు ఎంతో ఇష్టం. పోలీస్‌ అధికారిగా ఎక్కడ పనిచేస్తుంటే అక్కడి రైతుల కష్టాల్ని స్వయంగా అధ్యయనం చేశారు. పోలీస్‌ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్న తర్వాత జేడీ లక్ష్మీనారాయణ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. వ్యవసాయంపైనా, ఆధునిక విధానాలపైనా, తక్కువ ఖర్చుతో అధికంగా వ్యవసాయ దిగుబడులు సాధించే పలు అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయం వైపు యువతరాన్ని ఆకర్షించేందుకు ఇప్పుడు నిరంతరం కృషిచేస్తున్నారు. రైతు రాజ్యం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.

కౌలు రైతులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి జేడీ లక్ష్మీనారాయణకు చక్కని అవగాహన ఉంది. అయిన సరే కౌలు రైతుల కష్టాలేంటో స్వయంగా అనుభవించి తెలుసుకునేందుకు తాజాగా కౌలురైతు అవతారం ఎత్తారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరంలో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు. ఇటీవలే జరిగిన ఏరువాక పున్నమి రోజున జేడీ లక్ష్మీనారాయణ భూమికి పూజ చేసి ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. జులై 29 ఉదయం ఆ పొలంలో లక్ష్మీనారాయణ వరినాట్లు వేశారు.లక్ష్మీనారాయణ స్వయంగా నాగలిపట్టి దుక్కి దున్నారు. ట్రాక్టర్‌ నడిపి దమ్ము చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి యువకులకు ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఎంత ఎక్కువ మంది వీలైతే అంత అధిక సంఖ్యలో తాను వేసే వరినాట్లు కార్యక్రమానికి హాజరు కావాలని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఈ పిలుపు వెనుక ఆయన ఉద్దేశం సుస్పష్టం. వ్యవసాయం పట్ల యువతలో మరింత ఆసక్తి పెంచాలనేది జేడీ లక్ష్మీనారాయణ ఆకాంక్ష.సాగు రంగంలోకి నవతరం రావాలని మనస్ఫూర్తిగా జేడీ లక్ష్మీనారాయణ కోరుకుంటున్నారు. యువత స్వయంగా పొలంలోకి దిగి సాగు పనులు చేయాలంటారు లక్ష్మీనారాయణ. మనం పండించిన పంటను ఆహారంగా తిన్నప్పుడే అందులో మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు అంటారాయన. తాను వ్యవసాయం చేస్తున్న కౌలు పొలంలో జేడీ లక్ష్మీనారాయణ ఐదు రకాల వరి నార్లు పోశారు. పొలం పనులు స్వయంగా చేస్తున్నారు. సాగుదారులు, యువతతో కలిసి ఆకు తీశారు. నాట్లు వేశారు.వ్యవసాయం స్థాయిని పెంచాలని, అప్పుడే కొత్త తరం సాగుబడి వైపు వస్తారనేది లక్ష్మీనారాయణ అభిప్రాయం. సాగు రంగంలో సాంకేతికతను యువత జోడించాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపు.

చూశారు కదా వీవీ లక్ష్మీనారాయణ అలియాస్‌ జేడీ లక్ష్మీనారాయణ కౌలు రైతు అవతారం.. ఉద్యోగంలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆయన ఇప్పుడు దేశంలో యువ రైతుల్ని పెంచే కృషీవలుడయ్యారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here