ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటిఎల్) అధునాతనమైన పలు ఫీచర్లతో కొత్త సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ట్రాక్టర్ ధర (ఎక్స్-షోరూమ్, ఆల్ ఇండియా) రూ. 7,21,000. దీనిని జపనీస్ హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. ఐటిఎల్ తన జపాన్ భాగస్వామి యన్మార్ (Yanmar) అగ్రిబిజినెస్ కో సహకారంతో ఈ ట్రాక్టర్‌ను తయారు చేసింది.
60 హెచ్‌పి ట్రాక్టర్ లాగే ఈ కొత్త 50 హెచ్‌పి సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్ కూడా ఎలక్ట్రిక్ ఎనర్జీతో పాటు సాంప్రదాయ డీజిల్ ఇంజన్ శక్తిని కలిగి ఉంటుందని ఐటిఎల్ తెలిపింది. అలాగే హెవీ డ్యూటీ మైలేజ్ ఇంజిన్ 45 హెచ్‌పి ట్రాక్టర్ లాగా ఇంధన వినియోగ సామర్థ్యం కలిగి ఉంటుందని పేర్కొంది. సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్‌ డాష్‌బోర్డ్‌లో ‘పవర్ బూస్టర్’ స్విచ్‌తో పాటు చేతితో ఆపరేట్ చేయగలిగే లివర్ కూడా ఉంటుంది. ఈ ట్రాక్టర్ అధునాతన ఎలక్ట్రిక్ మోటారు సహాయంతో త్వరితంగా యాక్సిలరేషన్ (వేగం) అందుకుంటుంది.
“అభివృద్ధి చెందిన దేశాలలోని నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత రైతులకు సరసమైన ధరలకే అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. మేము సృజనాత్మకంగా మూడు ట్రాక్టర్ల స్థాయిలో పనిచేసే సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్‌ను అందిస్తున్నాము. ఇది 60 హెచ్‌పి ట్రాక్టర్ స్థాయిలో అత్యుత్తమ పనితీరును, 45 హెచ్‌పి ట్రాక్టర్ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మా హైబ్రిడ్ ట్రాక్టర్ ఇ-పవర్‌బూస్ట్ (E-Powerboost) వంటి అధునాతన లక్షణాలతో కూడి ఉంటుంది. ఇది రైతుకు అవసరమైనప్పుడు అదనపు శక్తిని వినియోగించుకునేందుకు వీలు కల్పిస్తుంది. మిగిలిన సమయాల్లో సాధారణ ట్రాక్టర్‌గా పనిచేసేటప్పుడు ఇంధన సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది.” అని ఐటిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ వివరించారు.

Raman Mittal, executive director of International Tractors, with Solis Hybrid 5015.

“ఈ హైబ్రిడ్ ట్రాక్టర్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అధునాతన మోటారుతో కూడి ఉండి కాలుష్యాన్ని తగ్గిస్తూ, ఉత్పాదకత పెరగడానికి రైతుకు తోడ్పడుతుంది. ఇందులోని అధిక వోల్టేజ్ ట్రాక్టర్ బ్యాటరీని సాధారణ 16A గృహ సాకెట్ ప్లగ్‌తో ఛార్జ్ చేయవచ్చు. దీన్ని 3 గంటలలోపు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు” అని ఆయన చెప్పారు.
సోలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్‌లోని లిథియం-అయాన్ బ్యాటరీ నిరంతర విద్యుత్ సరఫరాను అందిస్తుంది. దీనికి అదనంగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఇది ఆటో-ఛార్జింగ్ కట్-ఆఫ్ ఫంక్షన్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ జీవితకాలం పెరుగుతుంది. నిరంతర బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఇది ప్రయాణంలో సైతం ఛార్జింగ్ అందిస్తుంది. అదనంగా, ఈ ట్రాక్టర్‌లో బ్యాటరీ స్థాయి ఛార్జీ స్థాయిని తెలిపే సోలిస్ హైబ్రిడ్ 5015 గెట్సా యూజర్ ఫ్రెండ్లీ ‘స్మార్ట్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే’ కూడా ఉంటుంది. ఈ ట్రాక్టర్లను International Tractors Ltd, ITL కు చెందిన హోషియార్‌పూర్ (పంజాబ్) ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు.

ఆసక్తి కలిగినవారు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
International Tractors Limited (Solis Tractors Division)
C-133A, Sector-2, Noida, U.P. – 201301, India
Toll-Free No.: 1800-1200-76547,
Phone: +91-120-4095860 Miss Call Number: ‪9667133997
support@solistractors.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here