‘చేనుకు చేవ.. రైతుకు రొక్కం’
ఇది ఒకప్పటి ఓ రసాయన ఎరువుల సంస్థ ఇచ్చిన నినాదం. ఈ ఒకే ఒక్క నినాదంతో ఆ సంస్థ అప్పట్లో వేల కోట్ల రూపాయల రసాయన ఎరువులను దేశంలోని వ్యవసాయ భూములను కప్పేసింది. అయితే.. ఇప్పుడా పరిస్థితి మారింది. రసాయన ఎరువులతో పండించిన పంటలు తిన్న ప్రతి ఒక్కరికీ అనారోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. నెలనెలా వేలకు వేలు ఆస్పత్రుల ఖర్చులకు, మందుల వినియోగానికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ ఒక్కరిని కదిపినా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉందని చెబుతున్నాడు. మరి కొందరైతే తాము ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్ని ఏకరువు పెడుతూనే, ఎన్నెన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారో బాధగా చెబుతున్నారు.

అందుకే ప్రస్తుత సమాజంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఆరోగ్య సూత్రాలు పాటిస్తూనే ఉన్నారు. ఆహార నియమాలనూ అలవరచుకుంటున్నారు. ఎలాంటి ఆహారం తినాలి.. ఎలాంటి ఆహారం ఆరోగ్యాన్ని చెడగొడుతుందో తెలుసుకుంటున్నారు. తాను తింటున్న రసాయన మిళిత ఆహారం వల్ల ఎంతగా నష్టపోతున్నారో గమనిస్తూనే ఉన్నారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుపడుతుందో, ఎలాంటి ఆహారం తింటే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి ఆహారం పట్ల మొగ్గు చూపుతున్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు, కలుపు నివారణ లేదా నాశక మందుల అవసరం లేకుండా ప్రకృతి సిద్ధమైన విధానంలో వ్యవసాయం చేయడం, పంటలు పండించడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ‘కేవలం ఒకే ఒక్క దేశీ ఆవుతో 30 ఎకరాల భూమిని సాగుచేయవచ్చు’ఇది సుభాష్‌ పాలేకర్ పద్ధతి. సుభాష్ పాలేకర్‌ అంటే ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త.. రైతు.. వ్యవసాయ పుస్తక రచయిత, ఆయన విధానం ప్రకృతి నేచురల్‌ ఫార్మింగ్‌. సుభాష్‌ పాలేకర్ వ్యవసాయ విధానంలో 4 విధానాలుంటాయి. అవి 1. బీజామృతం (Seed Dresser), 2. జీవామృతం, 3. అచ్చాదన (Mulching), 4. వాఫ్స (Water Management).సుభాష్‌ పాలేకర్‌ విధానాల్లోని రెండో పద్ధతి జీవామృతానికి కావాల్సిన ప్రకృతిసిద్ధ ఎరువును ఈశ్వర్ ఆర్గానిక్ మెన్యూర్ సంస్థ మనకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే వేలాది మంది రైతులకు ఈశ్వర్‌ ఆర్గానిక్‌ మెన్యూర్‌ను సరఫరా చేసింది. ఆ రైతులు తమ ప్రకృతి వ్యవసాయంలో ఈశ్వర్‌ ఆర్గానిక్‌ మెన్యూర్‌ వినియోగించి ఎంతో ప్రయోజనం పొందారు. చక్కటి సహజ సిద్ధమైన పంటలు పండించారు. తద్వారా ఆర్థికంగా కూడా ఎంతో లాంభం పొందారు. ప్రకృతిసిద్ధమైన ఎరువుల్ని తమకు అందించిన ఈశ్వర్ ఆర్గానిక్‌ సంస్థను కొనియాడుతున్నారు.

నేల నుంచి బంగారం లాంటి పంట పండించవచ్చు.. అయితే.. ఆ నేలకు మంచి బలం ఉండే తీరాలి.. నేలను తొలుచుకుని మొక్క మొలిచేందుకు అందులో సారం ఉండాలి.. మొక్కలకు భూసారం ఒక వరం.. ఆ సారం సహజసిద్ధంగా వస్తే మంచిది. రసాయనాలతో వస్తే చెడుకు నాంది.
ప్రకృతిసిద్ధమైన వనరులతో ఉత్పత్తి చేసే ఎరువు.. స్వచ్ఛమైన పంటలకు కల్పతరువు.

ఈశ్వర్ బ్రాండ్ సమర్పించే ఈశ్వర్ ఆర్గానిక్ మెన్యూర్ అచ్చమైన దేశీ ఆవుల గోమయం, గోమూత్రం, శనగపిండి వంటి అనేక ప్రకృతిసిద్ధమైన పదార్థాలతో, సహజసిద్ధంగా సంప్రదాయ పద్ధతుల్లో తయారు చేస్తోంది. ఈశ్వర్‌ ఆర్గానిక్‌ మెన్యూర్‌ మనం పెంచే మొక్కలు, చేసే ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన పూర్తి పోషకాలను అందిస్తుంది.

కుండీల్లో పెంచే మొక్కలకు, ఇంటి ఆవరణలో వేసే పంటకూ, మిద్దెలపైన నిర్వహించే పళ్లు, కూరగాయలు, పూల మొక్కలకూ, ఆహ్లాదం కలిగించే గార్డెన్లకు, మొక్కల నర్సరీలకు ఈశ్వర్ ఆర్గానిక్‌ మెన్యూర్‌ ఎంతో ఉపయోగకరం. మొక్కల మొదళ్లకు బలమే కాకుండా, కుండీల్లోని తడిని తొందరగా ఆరనివ్వకుండా తేమని పట్టి ఉంచే సామర్థ్యం కూడా ఈశ్వర్‌ ఆర్గానిక్‌ మెన్యూర్‌కు ఉంటుంది. ఈశ్వర్‌ ఆర్గానిక్‌ మెన్యూర్‌ మొక్కలకు కావలసిన Nitrogen, Phosphorus and Potassium లను పుష్కలంగా సమకూర్చి మంచి ఫలసాయం అందజేస్తుంది.

శాస్త్రీయంగా, వ్యవసాయ నిపుణుల పర్యవేక్షణలో, దేశీ ఆవుల గోశాలలో పూర్తి సహజసిద్ధ జీవామృత విధానంలో ప్రత్యేకంగా తయారు చేసిన.. నూటికి నూరు శాతం ఆర్గానిక్ మెన్యూర్ ఇది. అన్నిరకాల పూల, పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలకు, అశ్వగంధ వంటి ఔషధ మొక్కలకు ఈశ్వర్‌ ఆర్గానిక్ మెన్యూర్‌ను చక్కగా వాడుకోవచ్చు. తద్వారా మనం ఆశించిన ఫలితం కొద్ది రోజుల్లోనే సంపూర్ణంగా పొందవచ్చు.

ఈశ్వర్‌ ఆర్గానిక్‌ ఎరువు 25 కేజీలు, 5 కేజీలు ప్యాక్‌లలో సరసమైన రేట్లకే లభిస్తుంది. This Manure Is Ideal For Your Plants In Lawns, Yards, Home Gardens, Bins, Containers, Pots, Indoor Plants And Also Farm Beds. దేశంలో పేరెన్నికగన్నఈశ్వర్ బ్రాండ్ మీ కోసం అందిస్తున్న ఎకో ఫ్రెండ్లీ All Purpose High Quality, Odor free దేశీ ఆర్గానిక్ మెన్యూర్.

Go Desi.. Go for Eswar Organic Manure!

మా చిరునామా-
వి.ఈ.ఆర్ ఆగ్రో ఫామ్స్
మేళ్లవాగు, బొల్లపల్లి మండలం
గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 522614
ఈ మెయిల్ – veragrofarms@gmail.com,
ఫోన్ నంబర్ – 6303311894.

For Orders, Please Contact- V.E.R AGRO FARMS,
Ph: 7396394749, 6303311894, Email: veragrofarms@gmail.com.
ఆర్డర్లు కోసం సంప్రదించండి :- వి.ఈ.ఆర్ ఆగ్రో ఫామ్స్, Ph: 7396394749, 6303311894, Email: veragrofarms@gmail.com, infonet@veragrofarms.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here