అంజీర పండు లేదా అత్తిపండు ఆహారంగా తీసుకున్నవారికి జీర్ణక్రియ మెరుగు అవుతుంది. అంజీర పండులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది సాధ్యం అవుతుంది. ఎముకలు బలంగా మారతాయి. బ్లడ్‌ పెషర్‌ను తగ్గిస్తుంది. కేలరీలు తక్కువ కనుక బరువును తగ్గిస్తుంది. ఎండిన అంజీర పండును నానబెట్టి ప్రతిరోజూ తింటే రక్తం ఉత్పత్తి పెరిగి, రక్తహీనతను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యానిక మేలుచేసే సీ, ఈ, ఏ విటమిన్లు అధికంగా ఉంటాయి కాబటటి మేలు చేస్తుంది. అంజీర పండులో ఎక్కువగా పోషకాలు ఉంటాయి ఉదయం పరగడున రెండు పండ్లు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. అంజీర పండ్లు మాత్రమే కాకుండా చెట్టు ఆకులతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లు పరిశోధనలలో వెల్లడైంది. ఇవి హైపర్‌ గ్లైసేమిమా, హైపో గ్లైసేమియా పరిస్థితుల్లో గ్లూకోజ్‌ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకొస్తుందని తేలింది.

వ్యవసాయ క్షేత్రాల్లోనే కాకుండా మిద్దెతోటలో కూడా అంజీర పండ్ల సాగును ఈజీగా చేయొచ్చు. అయితే.. అంజీర మొక్కను నాటిన కేవలం నాలుగు నెలల నుంచే పంట తీసుకోవచ్చు. అందుకు మనం చేయాల్సిన విధానం ఏంటో తెలుసుకుందాం.నాలుగైదేళ్ల వయస్సు ఉన్న అంజీర చెట్టు కొమ్మకు దాని లేయర్ పూర్తిగా తీసేసి, అక్కడ ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ గ్లాసును దాని చుట్టూ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఆ గ్లాసులో కోకోపిట్‌ను నీటితో తడిపి పెట్టాలి. ఆ గ్లాసు మొత్తాన్ని గాలి చొరబడకుండా పేపర్‌ కవర్‌తో గట్టిగా బిగించి కట్టాలి. 40 రోజుల వరకు దాని జోలికి ఏమాత్రం వెళ్లకూడదు. 40 రోజుల తర్వాత కొమ్మను గ్రాఫ్టింగ్‌ చేసిన చోట గ్లాసులో వేర్లు ఏర్పడతాయి. ఆ తర్వాత తల్లి మొక్క నుంచి గ్లాసుకు కింది భాగంలో కొమ్మను కత్తిరించాలి. ఇప్పుడా కొమ్మ ప్రత్యేకంగా మొక్క అయింది.తర్వాత వేర్లు తెగిపోకుండా మొక్క నుంచి ప్లాస్టిక్‌ గ్లాసును జాగ్రత్తగా తొలగించాలి. రాళ్లు లేని, మొత్తని మట్టిని, కంపోస్ట్‌ ఎరువును మిక్స్‌ చేసి, గార్డెన్ సాయిల్‌ తయారు చేసుకోవాలి. దాన్ని మరో మొక్కల కుండీలో పోయాలి. గ్రాఫ్టింగ్‌ చేసుకున్న అంజీర మొక్క వేళ్లు పాడవకుండా కుండీలో నాటుకోవాలి. కొద్ది రోజులకే ఆ మొక్క నుంచి కొత్త చిగుర్లు వస్తాయి. మొక్కకు అవసరమైన మేరకు నీటిని అందించాలి. ప్రతి 15 నుంచి 20 రోజులకు ఒకసారి కుండీలో వర్మీ కంపోస్ట్‌ వేస్తుండాలి. దీంతో కుండీలో ఎలాంటి కలుపుమొక్కలు ఉండవు. తర్వాత మొక్క కొమ్మలు పడిపోకుండా ఒక తాడును కట్టుకోవాలి. దీంతో మొక్క నాటిన నాలుగు నెలల నుంచే అంజీర మొక్క కాయలు కాస్తుంది.ఎండ వేడిమి ఎంత ఎక్కువ ఉంటే అంజీర మొక్క, పండు అంత ఆరోగ్యంగా ఉంటాయి. వేసవి కాలంలో దానికి ఎలాంటి తెగుళ్లు సోకవు. ఏడాది పొడవునా అంజీర పండ్లు కాస్తూనే ఉంటుంది.అంజీర పండ్ల సాగును పెద్ద మొత్తంలో చేసుకుంటే లాభాల పంట పండిస్తుంది. ఎకరం తోటలో సుమారు 3 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వాటిని డ్రై ఫ్రూట్ చేస్తే 6 నుంచి 7 క్వింటాళ్ల వరకు వస్తుంది. అంజీర డ్రై ఫ్రూట్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది. కిలోకు సుమారు రూ.800 పలుకుతుంది. అవే పండు కాయలైతే రూ.100 ధర వస్తుంది. అంజీర ఎండబెట్టకుండా పండుగా తిన్నా మంచిదే. అది చాలా తియ్యగా ఉంటుంది.